ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్న దుబాయ్ షేట్
హైదరాబాద్: ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్న దుబాయ్ షేట్ను సౌత్‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుబాయ్ షేక్ టూరిస్ట్ వీసాపై మనదేశానికి వచ్చి ఇలాగే బాలికలను పెళ్లిళ్లు చేసుకుంటాడని తెలుస్తోంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఈ షేట్ నగరానికి వచ్చాడు. పాతబస్తీకి చెందిన ఇద్దరు బాలికలను వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన సౌత్‌జోన్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు బాలికలకు విముక్తి కల్పించారు.
షేట్ బాలికలను వివాహం చేసుకోవడానికి సహకరించిన 10 మంది బ్రోకర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షేట్ గతంలో కేరళలోనూ ఇదే విధంగా పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.