సాక్షి, అనంతపురం : నగరంలోని కమలానగర్‌కు చెందిన రేవతి ఇంటి ఖర్చుల నిమిత్తం సమీపంలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లడానికి సిద్దమైంది. ఒక్కతే వెళ్లడానికి సాహసం చేయలేక.. పక్క ఇంట్లో ఉన్న సావిత్రిని సాయం అడిగింది. అక్కా.. కాస్త ఏటీఎం వరకు వస్తావా.. డబ్బులు డ్రా చేసుకుని వస్తామని పిలిచింది. అయ్యో.. ఇంట్లో కాస్త పని ఉంది.. ఏమనుకోకుండా నీవే వెళ్లిరా అని చెప్పింది. నిన్న బెంగళూరులో ఏటీఎం కేంద్రంలో జరిగిన సంఘటన టీవీలో చూసిన తరువాత ఒక్క దాన్నే ఏటీఎంకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని చెప్పింది.
ఇది నగరానికి చెందిన ఒక్క రేవతి భయమే కాదు. జిల్లాలోని పలువురు మహిళలు సైతం భద్రతా వ్యవస్థ సరిగాలేని మన ఏటీఏం కేంద్రాలకు వెళ్లడానికి జంకుతున్నారు. బెంగళూరు నగరంలో ఏటీఎం కేంద్రంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్‌పై దుండగుడి దాడి నేపథ్యంలో నిత్యం ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఖాతాదారులు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనతో మహిళలు ఒంటరిగా ఏటీఎంలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏటీఎం కేంద్రాల నిర్వహణ విషయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు అమలు కావడం లేదు.
అనంతపురంలో స్టేట్‌బ్యాంకు పరిధిలో దాదాపు 20 ఏటీఎం కేంద్రాలు పనిచేస్తుండగా, మిగిలిన వాణిజ్య బ్యాంకుల పరిధిలో ఆరు నుంచి 10 ఏటీఏం కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే కార్పొరేట్ బ్యాంకుల పరిధిలో మూడు నుంచి ఐదు వరకు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రతి ఏటీఎం కేంద్రం వద్ద ఖాతాదారులు డబ్బు తీసుకుని వెళ్లే దాకా కల్పించాల్సిన భద్రత నామమాత్రంగా ఉంది. 50 శాతం ఏటీఏం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డు ఉండటం లేదు. కొన్ని కేంద్రాల్లో నిఘా కెమెరాలు పని చేయడం లేదు. ముఖ్యంగా ఏటీఎం కేంద్రాల వద్ద ఉండే సెక్యూరిటీ గార్డుల వద్ద ఆయుధం కాదు..కదా.. చిన్న కర్ర కూడా ఉండడం లేదు. దీంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటే నిస్సహాయ స్థితిలో చేతులు ఎత్తేయడం మినహా చేసేదేమి లేదు.
ఇక్కడ భద్రమేనా?
Published Thu, Nov 21 2013 2:45 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement