
చినవెంకన్న హుండీల ద్వారా వచ్చిన నాణాలను లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది (ఫైల్)
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల : ఒకప్పుడు చిల్లర నాణాల కోసం వ్యాపారులు బ్యాంకుల వద్ద క్యూలు కట్టేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకులు పిలిచి మరీ నాణాలు ఇస్తామన్నా తీసుకునే నాథుడే కనిపించడం లేదు. దీంతో జాతీయ బ్యాంకుల్లో నాణాల నిల్వలు మూలుగుతున్నాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని ఆంధ్రాబ్యాంకులో పెద్ద మొత్తంలో నాణాలు నిల్వ ఉన్నాయి. శ్రీవారి హుండీల ద్వారా వచ్చే నాణాలు ఈ బ్యాంకుకు చేరుతుండటమే ప్రధాన కారణం. గతంలో హుండీలు తెరిచే సమయంలో స్థానిక వ్యాపారులతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఎమ్మెల్యేల సిఫార్సులతో అధిక మొత్తంలో చిల్లర నాణాలను పొందేందుకు ఎగబడేవారు.
సందిట్లో సడేమియా అంటూ కొం దరు చిల్లర వ్యాపారులు కమీషన్ బిజినెస్ కోసం నాణాలను తీసుకెళ్లేవారు. అయితే ఇటీవల మార్కెట్‌లో చిల్లర నాణాల చలా మణి ఎక్కువుగా ఉండటంతో వీటి కోసం ఎదురుచూసేవారు కరువయ్యారు. ప్రస్తు తం ద్వారకాతిరుమల ఆంధ్రాబ్యాంకులో రూ.1, రూ.2, రూ.5 నాణాలు పెద్ద మొ త్తంలో నిల్వ ఉన్నాయి. కావాల్సిన వ్యాపారులు ఫోన్ నంబర్లు 08829–271429, 83745 59609లో సంప్రదించాలని బ్యాం కు మేనేజర్ శేషగిరిరావు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment