ఇంతవరకూ అమలులో ఉన్న పంటల గుర్తింపు, గణన , ఆదాయం తదితర వివరాల సేకరణలో పాత పద్ధతికి స్విస్తి చెప్పి, ఈ-కాప్ ్రద్వారా కొత్త విధానానికి శ్రీకారం చట్టునున్నారు. ఇందుకోసం ట్యాబ్‌లను వినియోగించున్నారు. వీఆర్వోల నుంచి కలెక్టర్ వరకూ అందరికీ ట్యాబ్‌లను అందజేయనున్నారు. ట్యాబ్‌ల వినియోగించి వీఆర్వోలు నమోదు చేసిన గణాంకాలను ఆయా స్థాయిల్లోని జిల్లా అధికారులు పరిశీలించవచ్చు.
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఆరులక్షల పట్టాదారులున్నారు. ఇందులో వ్యవసాయం చేసే పట్టాదారులు ఐదు లక్షల మంది ఉండగా, అనుభవదారులు 21 లక్షల మంది ఉన్నారు. వీరు సాగు చేసే అన్ని పంటలను వీర్వోలు తమకు అందజేసిన ట్యాబ్‌ల సహాయంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రికార్డు చేసి వెంటనే ఉన్నతాధికారులకు అప్‌లోడ్ చేస్తారు. ఇందుకోసం ముందుగా వీఆర్వో తమ పేరును ఐడీని రిజిస్టర్ చేసుకున్న వెంటనే ట్యాబ్‌లో వీఆర్వో
పరిధిలోని గ్రామంలో ఉన్న భూముల వివరాలు వస్తాయి. ఒక వీఆర్వోకు రెండు మూడు గ్రామాలు ఇన్‌చార్జిగా ఉన్నా... ఒకే ట్యాబ్ ఇస్తారు. మొదట ఒక గ్రామానికి సంబంధించిన పంటల సాగు వివరాలను అప్‌లోడ్ చేశాక, తరువాత తాను ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న గ్రామం తరఫున మరోసారి రిజిస్టర్ అయితే ఆ గ్రామానికి సంబంధించిన వివరాలు ట్యాబ్‌లో ప్రత్యక్షమవుతాయి. వెంటనే లాగిన్ అయి ఈ గ్రామంలోని భూముల వివరాలను, పంటల సాగును నమోదు చేస్తారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి ఫొటో తీస్తారు. వీలును బట్టి సంబంధిత రైతు ఫొటో కూడా అక్కడ అప్‌లోడ్ అవుతుంది.
జిల్లాకు 760 ట్యాబ్‌లు
ఈ ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేస్తున్న ఈ-క్రాప్ విధానం కోసం అవసరమైన ట్యాబ్‌లను కేఆర్‌సీ అధికారులు జిల్లాకు తీసుకువచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్వోలు, తహశీల్దార్లకు 760 ట్యాబ్‌లను ఉన్నతాధికారులు పంపించారు. ఈ ట్యాబ్‌లను వీఆర్వోలకు సంబంధిత అధికారులకు శుక్రవారం నుంచి అందజేయనున్నారు. వీటికి సంబంధించి 3జీ, 2జీ సిమ్‌లను అందజేస్తారు. వీటి సహాయంతో పంటల చిత్రాలను అప్‌లోడ్ చేసి సాగును, స్థూల ఉత్పత్తి వివరాలు తెలుసుకుంటారు.
20 నుంచి శిక్షణనిస్తాం: కేఆర్సీ డి ప్యూటీ కలెక్టర్ శ్రీలత
ఈ -క్రాప్ విధానంపై ఈనెల 20 నుంచి శిక్షణ ఇవ్వనున్నామని కోనేరు రంగారావు సిఫార్సుల అమలు కమిటీ డిప్యూటీ కలెక్టర్ ఆర్ శ్రీలత చెప్పారు. ఇటీవల జిల్లా నుంచి తనతో పాటు ఈడీఎం శ్రావణ్, ఎన్‌ఐసీ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ అధికారి నరేంద్రలతో పాటు ఓ తహశీల్దార్, ఒక వ్యవసాయాధికారి, ఓ ఆర్‌ఐ, వీఆర్వోకు హైదరాబాద్‌లో శిక్షణనిచ్చారన్నారు.
తామంతా ఇప్పుడు క్షేత్ర స్థాయిలోని వీఆర్వోలు, ఏఓలు, తహశీల్దార్లు, ఆర్‌ఐలకు శిక్షణ ఇస్తామన్నారు. 20న విజయనగరం, 21వ తేదీ ఉదయం నెల్లిమర్ల, మధ్యాహ్నం చీపురుపల్లి, 22వ తేదీ ఉదయం గజపతినగరం, మధ్యాహ్నం ఎస్‌కోట, 23వ తేదీ ఉదయం బొబ్బిలి, మధ్యాహ్నం సాలూరు, 24వ తేదీ ఉదయం పార్వతీపురం, మధ్యాహ్నం కురుపాం నియోజకవర్గాలకు చెందిన వీఆర్వోలు, అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు.
ఇక ఈ క్రాప్
Published Fri, Jul 17 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement
Advertisement