సాక్షి మాక్‌ఎంసెట్ పరీక్ష ఏప్రిల్ 26కు వాయిదా వేసిన విషయం మీకు తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ఇంజనీరింగ్, మెడిసిన్ ఔత్సాహిక విద్యార్థుల ప్రయోజనార్థం సాక్షి మీ డియా గ్రూప్ ఆధ్వర్యంలో త్వరలో మాక్ ఎంసెట్ నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 26న ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు సాక్షి మాక్ ఎంసెట్ ఉంటుంది.
శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(అటానమస్), చిత్తూరు ఈ మాక్ ఎంసెట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ మాక్ ఎంసెట్ ద్వారా విద్యార్థులు తమ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడమే కాకుండా తమ ప్రతిభను పెంపొందించుకోవచ్చు.
తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగు పరచుకునేందుకు వీలవుతుంది. దీనితో పాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెరుగైన ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులుంటాయి. దరఖాస్తు వెల రూ.75లతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని వస్తే వెంటనే హాల్ టికెట్ పొందవచ్చు. సాక్షి మాక్ ఎంసెట్‌కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలి.
26న సాక్షి మాక్ ఎంసెట్
Published Sat, Apr 18 2015 2:52 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement