ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 485మంది హాజరు
Published Sat, Aug 24 2013 3:39 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా స్థానిక సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు 485మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలిచ్చిన విద్యార్థులతో కళాశాల ప్రాంగణం నిండిపోయింది. ఉదయం 9.00 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన రాత్రి 8.00 గంటల వరకు కొనసాగింది. హెల్ప్‌లైన్ కేంద్రం సమన్వయకర్త సీహెచ్ పుల్లారెడ్డి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు. నేడు ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన.. ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా శనివారం సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 85,001 నుంచి 95,000 ర్యాంకు వరకు గల విద్యార్థులు హాజరుకావాలి.
నేడు సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేత
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: వర్సిటీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎంసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శనివారం నిలిపివేస్తున్నామని రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్ కాంతం తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వర్సిటీ అధ్యాపకులు శనివారం సామూహిక సెలవు ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా.. శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భోజన వసతిలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంపై సమావేశం
సెప్టెంబరు 11న నిర్వహించాల్సిన వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవ ఏర్పాట్లపై వైస్‌చాన్సలర్ కె.వియన్నారావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబరు 11న జరుగుతుందని ప్రకటించవద్దని, ఏర్పాట్లు మాత్రం చేయాలని నిర్ణయించారు. చివరివరకు పరిస్థితిని గమనించి నిర్వహణపై నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడ్డారు. సమావేశంలో రెక్టార్ వైపీ రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆర్‌ఆర్‌ఎల్ కాంతం, ఓఎస్డీ జడ్.విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
రేపటి ఎన్‌ఐఓఎస్ పరీక్ష వాయిదా
గుంటూరు ఎడ్యుకేషన్: సాక్షర భారత్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 25న నిర్వహించాల్సిన అభ్యాసకుల సామర్థ్య పరీక్ష (ఎన్‌ఐఓఎస్)ను సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు వయోజన విద్య ఉప సంచాలకులు జి.తారకేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సాక్షరభారత్ కోఆర్డినేటర్లు గమనించాలని సూచించారు.
Advertisement