ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో ఉదయమే జరగాల్సిన విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ కేసులో సాల్వే తెలంగాణ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించనున్నారు.
ఈనెల ఏడో తేదీన ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించడం, దీన్ని తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి విధివిధానాలను నిర్ణయించేందుకు సమయం కావాలని, అందువల్ల అక్టోబర్ ప్రాంతంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని టీ సర్కారు వాదిస్తోంది. కానీ అంత ఆలస్యం అయితే విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని ఆంద్రప్రదేశ్ సర్కారు అంటోంది. ఈ విషయమై సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోంది.
ఎంసెట్ కౌన్సెలింగ్పై సుప్రీంలో విచారణ వాయిదా
Published Mon, Aug 4 2014 11:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement