విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఎంసెట్–2017 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విజయవాడలోని స్టేట్ గెస్టు హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిల సమక్షంలో ఈ ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్ తెలిపారు.
ఫలితాలు విడుదలైన అరగంట తరువాత ర్యాంకుల సంక్షిప్త సందేశాలను విద్యార్ధుల మొబైల్ నంబర్లకు పంపిస్తామన్నారు. ఇలా ఉండగా ఎంసెట్ ప్రశ్నలపై అందిన 110 అభ్యంతరాలపై నిపుణుల కమిటీ బుధవారం పరిశీలన చేసింది. వారిచ్చేనివేదికలోని అంశాలను ఎంసెట్ కమిటీ మళ్లీ చర్చించనుంది. ఇందుకు గురువారం విజయవాడలోని ఉన్నత విద్యామండలిలో చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు అధ్యక్షతన ఎంసెట్ కమిటీ సమావేశమవుతుంది. నివేదికకు ఆమోదముద్రతో పాటు వాటి ఆధారంగా తుది ఫలితాల వెల్లడికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. అనంతరం శుక్రవారం ఫలితాలను వెల్లడించనున్నారు.
రేపే ఎంసెట్ ఫలితాలు
Published Thu, May 4 2017 3:19 AM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM
Advertisement