ఆర్థిక నష్టాల్లో ఆర్టీసీ
Published Thu, Mar 2 2017 11:04 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
► అక్రమ రవాణా, యాజమాన్య నిర్ణయాలే కారణం
► ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి
► వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి
కడప అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, దీనికి అక్రమ రవాణా, యాజమాన్య నిర్ణయాలే ప్రధాన కారణాలని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి అన్నా రు. బుధవారం ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ స్థాయిలోనే ఆర్టీసీలో ప్రమాదాల రేటు 0.11గా నమోదై 64 కార్పొరేషన్ల కంటే ఉన్నత సంస్థగా పేరు తెచ్చుకుందన్నారు. కానీ ప్రైవేటు ట్రావెల్స్ అక్రమ రవాణా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
రాష్ట్రంలో పలు ట్రావెల్స్ టూరిస్టు పర్మిషన్ తీసుకుని స్టేజ్ క్యారియర్లుగా నడుపుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారన్నారు. ప్రమాదాలు జరిగినపుడు ఎక్స్‌గ్రేషియాలు చెల్లిస్తూ చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ప్రస్తుతం అద్దె బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ కండక్టర్‌తో పనిలేకుండా వారికే టిమ్‌లను ఇచ్చి నష్టానికి కారణమవుతున్నారని ఆరోపించారు. అలాగే ఆన్‌లైన్ రిజర్వేషన్ సిస్టమ్‌ను ప్రైవేటు వారి కి అభి బస్‌కు అప్పగించడం ఎంతవరకు సమంజసమన్నా రు.
రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం ఒక శాతం నిధులను ఆర్టీసీకి కేటాయించి నిబంధనలు పాటిస్తే అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి శివశంకర్, రీజినల్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కార్యదర్శి బాబా ఫకృద్దీన్, కడప డిపో కార్యదర్శి టి.జయరామయ్య, ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement