మోర్తాడ్, న్యూస్‌లైన్ :
మార్కెట్‌లో పెరిగిన కోడిగుడ్ల ధరకు అనుగుణం గా ఒక్కో గుడ్డుపై 57పైసల ధరను పెంచుతు ఇందిర క్రాంతి పథకం ఉన్నతాధికారులు సర్క్యులర్‌ను జారీ చేశా రు. దీంతో అమృతహస్తం పథకానికి నెలరోజులుగా సరఫ రా కాకుండా నిలచిపోయిన కోడిగుడ్లకు మోక్షం కలుగనుంది. మార్కెట్‌లో కోడి గుడ్ల ధరలు పెరగడంతో అంగన్‌వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్న అమృత హస్తం పథకాని కి గుడ్లను సరఫరా చేయలేమని మహిళా సమాఖ్యలు చే తులెత్తివేశాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫ రా నిలచిపోవడంతో బాలింతలు, గర్భిణులకు పౌష్టిక ఆ హారం అందని ద్రాక్షలాగా మారింది. మార్కెట్‌లో ఒక కో డి గుడ్డు ధర రూ. 4.50గా ఉంది.
మహిళా సమాఖ్యలకు ఒక కోడిగుడ్డుపై ఐసీడీఎస్ అధికారులు రూ. 3.50 చెల్లిస్తా రు. గతంలో మార్కెట్‌లో కోడిగుడ్డు ధర హోల్‌సెల్‌లో రూ.3.30కు లభించేది. మార్కెట్‌లో రూ.4కు విక్రయించేవారు. ఫౌల్ట్రీ పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో కోడిగుడ్ల ధరలను వ్యాపారులు పెంచారు. మా ర్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.4.50గా ఉండగా హోల్ సెల్ లో రూ. 4కు లభిస్తుంది. అయితే ఐసీడీఎస్ అధికారులు మాత్రం కోడిగుడ్డుకు రూ. 3.50 చెల్లిస్తుండటంతో మహి ళా సమాఖ్యలు లాభాలకు బదులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీంతో మహిళా సమాఖ్యలు కోడిగుడ్ల ను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయలేమని స్పష్టం చేశాయి. గడచిన జనవరి1న రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి న అంగన్‌వాడీ కేంద్రాలలో అమృత హస్తం పథకాన్ని అ మలు చేసింది. జిల్లాలోని భీమ్‌గల్, దోమకొండ, ఎల్లారె డ్డి, మద్నూర్, బాన్సువాడలలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప రిధిల్లో ఉన్న 19 మండలాల్లోని 2,628 అంగన్‌వాడీ కేం ద్రాల్లో అమృత హస్తం పథకం అమలు జరుగుతుంది. ప థకం ఆరంభంలో 11,694 మంది గ ర్భిణులు, 7,650 మంది బాలింతలకు పథకాన్ని వర్తింపజేశారు.
ఎంతో మంది గర్భిణులకు, బాలింతలకు ఆర్థిక స్థోమత సరిగా లే క పౌష్టిక ఆహారం తీసుకోక పోవడంతో మాతా శిశుమరణాల సంఖ్య పెరిగింది. దీంతో పౌష్టిక ఆహారం అందించ డం కోసం ప్రభుత్వం స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అ మృత హస్తం పథకాన్ని ప్రారంభించింది. వారంలో ఆరు రోజుల పాటు మధ్యాహ్నం పూట బాలింతలు, గర్భిణుల కు అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయల భోజనంతో పాటు, ఒక కోడిగుడ్డు, పాలను అందిస్తున్నారు. ఒక్కో బా లింత, గర్భిణిపై ప్రభుత్వం ఒక పూటకు రూ. 17 ఖర్చు చే స్తుంది. పథకం ఆరంభంలో రూ. 15 ఉండగా ధరలు పెరగడంతో రూ. 2ను పెంచింది. కోడి గుడ్ల ధర పెరగడంతో మహిళా సమాఖ్యలు తాము సరఫరా చేసే గుడ్ల ధర పెం చాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను కోరారు. అయితే ఇది తమ చేతిలో లేదని అధికారులు స్పష్టం చేయడంతో మహిళా సమాఖ్యలు చేతులెత్తేశాయి.
ఇందిర క్రాంతి పథకం జిల్లా ఉన్నతాధికారులు మహిళా సమాఖ్యలకు హోల్‌సెల్‌గా కోడిగుడ్లను సరఫరా చేసే వ్యాపారులను పిలిపించి గతంలోని ధరలకే కోడిగుడ్లను సరఫరా చేయాల్సిందిగా కోరారు. అయితే కోడిగుడ్ల వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ధర తగ్గించే విషయంపై వెనక్కి తగ్గలేదని తెలిసింది. చివరకు ఇందిర క్రాంతి పథకం అధికారులు స్పందించి ఒక్కో కోడిగుడ్డుపై 57పైసల ధర పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి కోడిగుడ్ల సరఫరా జరిగే అవకాశం ఉంది.
‘అమృత హస్తం’కు తీరనున్న గుడ్ల కొరత
Published Mon, Dec 16 2013 2:59 AM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM
Advertisement
Advertisement