Indira Kranthi scheme
-
జిల్లాల్లో ఐకేపీ ఉద్యమ సెగలు
* 17 నెలల జీతాలివ్వడం లేదంటూ సర్కారుపై నిప్పులు * సోమవారం చలో అసెంబ్లీకి తరలివస్తున్న ఉద్యోగుల అరెస్టు * అరెస్టులు, నిర్బంధాలకు నిరసనగా అసెంబ్లీలో జగన్ వాకౌట్ * సర్కారు దమనకాండకు నిరసనగా జిల్లాల్లో ఆందోళనలు * రాజధానిలో 600 మందిని అరెస్టు చేసి ఛలో అసెంబ్లీని భగ్నం చేసిన పోలీసులు సాక్షి, విజయవాడ బ్యూరో: ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) యానిమేటర్లు సోమవారం రాష్ట్రమంతటా ఉద్యమించారు. 27వేల కుటుంబాలు 15నెలలుగా జీతాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నా సర్కారు పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలకు కేవలం రూ.2 వేల గౌరవ వేతనంతో అర్ధాకలితో జీవిస్తున్న తమ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నిర్బంధకాండను కొనసాగించడంపై విరుచుకుపడ్డారు. ఐకేపీ వీఓఏలు సోమవారం నిర్వహించిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఆదివారం రాత్రి నుంచి అన్ని ప్రయత్నాలు చేసింది. ఏపీలోని అన్ని బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద మోహరించిన పోలీసు బలగాలు ఐకేపీ యానిమేటర్లు హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నాయి. వారికి నాయకత్వం వహించే మహిళలు, సీఐటీయూ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి రాత్రి సమయంలో వారిని అదుపులోకి తీసుకుంది. నిర్బంధాన్ని నిరసిస్తూ సోమవారం అన్ని జిల్లాల్లోనూ ఉద్యమ సెగలు రేగా యి. నిర్బంధాలకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాం గ్రెస్ పా ర్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై యాని మేటర్ల కుటుంబాలు హర్షం వ్యక్తంచేశాయి. జిల్లాల్లో రేగిన ఉద్యమ సెగలు: ఐకేపీ వీఒఏలపై ప్రభుత్వ నిర్బంధకాండను నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉద్యమ సెగలు రేగాయి. శ్రీకాకుళం జిల్లాలో 12పోలీస్ స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని హిందూపురం, తాడిపత్రి, ధర్మవరంలో సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ఐకేపీ యానిమేటర్ల అరెస్టులు కొనసాగాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నల్లబ్యాడ్జీలు ధరించిన సీఐటీయూ కార్యకర్తలు, ఐకేపీ యానిమేటర్లు నిరసన ప్రదర్శన, ధర్నాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయాన్ని సీఐటీ యూ, ఐకేపీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. గుంటూరులో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సీఎం దిష్టిబొమ్మలు దగ్ఢం చేశారు. ప్రకాశం జిల్లాలో సీఐటీయూ, వీఓఏలు ధర్నాలు నిర్వహించారు. అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా ప్రకటించారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఐకేపీ ఉద్యోగులు ఆందోళన చేశారు. సుమారు ఆరు వందల మంది అరెస్ట్ అయ్యారు. ఐకేపీ యానిమేటర్ల అరెస్టు అప్రజాస్వామికం వారి ఆందోళనకు మద్దతు: జగన్ సాక్షి, హైదరాబాద్: తమ సమస్యల సాధన కోసం చలో అసెంబ్లీ ఆందోళన నిర్వహిస్తున్న ఐకేపీ యానిమేటర్లకు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. తమ సమస్యల సాధన కోసం చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ తరలివస్తున్న ఐకేపీ యానిమేటర్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అసెంబ్లీలో ఉన్న జగన్‌కు ఆ విషయం తెలిసిన వెంటనే యానిమేటర్ల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మితో ఫోన్లో మాట్లాడారు. అప్రజాస్వామికంగా జరిగిన ఈ అరెస్టులను తాను ఖండిస్తున్నానన్నారు. యానిమేటర్ల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు తాను పూర్తి మద్దతు నిస్తున్నానని ఆమెకు ఫోన్లో జగన్ చెప్పారు. మహిళలు అనే విషయం కూడా విస్మరించి అన్యాయంగా వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాకు నైతిక మద్దతునిచ్చారు ధనలక్ష్మి సమస్యల సాధన కోసం తాము చేస్తున్న పోరాటానికి విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఫోన్ చేసి మద్దతు ప్రకటించడం తమకు ఎంతో నైతిక బలాన్ని ఇచ్చిందని కె.ధనలక్ష్మి పేర్కొన్నారు. వాస్తవానికి జగన్ తమను ప్ర త్యక్షంగా పరామర్శించేందుకు పోలీసు స్టేష న్కే రావాలని భావించారని, అయితే శాసనసభా సమావేశాల విరామ సమయం తక్కువ గా ఉండటం, తమను అరెస్టు చేసి ఉంచిన బొ ల్లారం పోలీస్‌స్టేషన్ అసెంబ్లీకి చాలా దూరంగా ఉండటంతో రాలేకపోయానని వివరించారని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నేత గా తమ సమస్యలను, ఆందోళనను అసెం బ్లీలో ప్రస్తావించడమే కాక వాకౌట్ చేయడం పట్ల జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ హక్కు కూడా వారికి లేదా? సాక్షి, హైదరాబాద్: ఐకేపీ వీఓఏలును ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంపై సభ్యుల ఆందోళనతో సోమవారం శాసన మండలి దద్దరిల్లింది. మొదట ఈ అంశంపై విటపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో యానిమేటర్లు చేసిన ఆందోళనకు టీడీపీ నేతలు మద్దతు పలికి.. ఇప్పుడేమో నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. అదే సమయంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యంగ్యంగా మాట్లాడటంతో.. టీడీపీ మినహా మిగిలిన పార్టీలకు చెందిన సభ్యులు ఆగ్రహంతో ఒక్కసారిగా పోడియం వద్దకు దూసుకొచ్చి బైఠాయించారు. చర్చల సమయంలో మండలి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి యనమల హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు. ఐకేపీలపై సర్కారు తీరుకు నిరసనగా వాకౌట్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) కింద గంటల వారీ పద్ధతిన పని చేయించుకుంటున్న సిబ్బంది క్రమబద్ధీకరణ అంశంపై సోమవారం ఏపీ శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ తరహా ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాల్సిన పని లేదని అధికార పక్షం అడ్డం తిరగగా.. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని విస్మరిస్తారా అంటూ విపక్షం ధ్వజమెత్తింది. పరస్పర వాగ్వాదం, ఆరోపణలతో సభ దద్దరిల్లింది. అధికార పక్షం తీరుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఎమ్మెల్యేలు ఎస్.వి.మోహన్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిస్తూ ‘కాదు, లేదు, ఆ ప్రసక్తే లేదు’ అంటూ ముక్తసరిగా జవాబు చెప్పినప్పుడు ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ హయాంలో లక్షన్నర ప్రైవేటు ఉద్యోగాలు వస్తే ఇప్పుడు వాటి ఊసే లేకుండా పోయిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి నియమించే కన్నా కొత్తవారికి ఉద్యోగాలు ఇవ్వాలని, ఉర్దూ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ యానిమేటర్ల సమస్యను, వారి అరెస్టును ప్రస్తావించారు. దీనికి మంత్రి యనమల జవాబిస్తూ ప్రతిపక్షం డిమాండ్లు నెరవేర్చాలంటే చాలా సమయం పడుతుందని ఒకింత వ్యం గంగా వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీ లించేందుకు ఒక కమిటీని నియమించామని పేర్కొన్నారు. సభ్యులు సభ మధ్యలోకి దూ సుకు వచ్చే ప్రయత్నం చేయడంతో జగన్మోహన్రెడ్డిని మాట్లాడాల్సిందిగా స్పీకర్ కోరారు. ఇది నిరంకుశ పాలన: జగన్ జగన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిం చారు. యానిమేటర్లు హైదరాబాద్ వచ్చి నిరసన తెలపాలనుకుంటే దారిమధ్యలోనే అరెస్ట్ చేశారని, ఇది నిరంకుశ పాలనని దుయ్యబట్టారు. ‘‘కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల ప్రణాళికలో చెప్పా రు. బాబు వచ్చాడు. ఈవేళ ఉన్న వాటిని తీసివేస్తున్నారు. ఇంటికో ఉద్యో గం ఏమైంది? రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు ఎందుకని? అవసరం తీరాక పట్టించుకోరా? మీ తీరును మేము నిరసిస్తున్నాం. ఈ వైఖరికి వ్యతిరేకంగా మేం సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్వేశ్వరరావు, ఐజయ్య, నారాయణస్వామి తదితరులు మీడి యా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌పై ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
మహిళా సంఘాల అభివృద్ధి భేష్
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్: ఇందిరాక్రాంతి పథకం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా సంఘాల అభివృద్ధి చాలా బాగుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల బృందం సభ్యులు జ్యోతినిరజ్ కైర్వల్, కె. పాండే, సంజయ్‌కుమార్, శైలేంద్ర, బిఎల్. టమటా, అశిష్పుంతి, ఆనంద్‌భాస్కర్ కితాబిచ్చారు. గురువారం న ర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుం ట గ్రామాన్ని సందర్శించి గ్రామాఖ్య మహిళ సంఘల పనితీరు, ప్రభుత్వం బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్న రుణాల తో ఎలా అభివృద్ధి చెందుతున్నరన్న విషయలతోపాటు పౌష్టికాహార కేంద్రా ల నిర్వహణ తదితర అంశాలపై అధ్యయనం చేశారు. ఇక్కడ అమలవుతున్న మహిళా సంఘాలను ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్ర ప్రభుత్వ సైతం ఇంది క్రాంతి లాంటి పథకాన్ని అమలు చేసిందన్నారు. తమ రాష్ట్ర మహిళలలకు సైతం తక్కువ వడ్డీతో రుణాలు అందజేసేందుకు కృషి చేస్తోందన్నారు. బాలిం త, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహార కేంద్రాలు పనితీరు సైతం బాగుం దన్నారు. అనంతరం మహిళలలో వారు మాట్లాడుతూ బ్యాంక్ రుణాలు తీసుకోవాడం, వాయిదాల చెల్లింపు, ఆదాయం కోసం చేపట్టే పనులు, తదితర అంశాల పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృందం మేనేజర్ కరుణాకర్, స్థానిక ఐకేపీ ఏపీఎం సత్యనారాయణ, సీసీ దత్తు, గ్రామఖ్య సంఘల మహిళ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. అందోల్లోనూ.. జోగిపేట: డ్వాక్రా గ్రూపులపై అధ్యయయానికి ఉత్తరాఖండ్ చెందిన అధికారుల బృందం గురువారం అందోల్ మండలంలో పర్యటించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన డిప్యూటీ కమీషనర్ శైలేంద్ర వస్తే, ఎన్ఆర్ఐ అధికారి పునీ త, ఐఏఎస్ అధికారి జ్యోతి, సీడీఓ సం జయ్‌కుమార్, నవనీత పాండే, పీడిలు ఆనంద్ సింగ్, బాలకృష్ణలు ఈ బృందంలో ఉన్నారు. స్థానిక ఐకేపీ కా ర్యాలయంలో మండల సమాఖ్య మహిళలతో సమావేశాన్ని నిర్వహించి వారి ద్వారా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీఏ జేఆర్పీ లక్ష్మీప్రియ ఇందిరా క్రాంతి పథంనకు సం బంధించిన పలు విషయాలను వారికి క్లుప్తంగా విరించింది. ఆమె ఆంగ్లంలో అన్ని విషయాలను వివరించే ప్రయత్నం చేయడం బాగా ఆకట్టుకున్న బృందం సభ్యులు ఆమెను అభినందించారు. మహిళా సమైఖ్యకు చెందిన సభ్యులు తాము బ్యాంకుల ద్వారా బుణాలు, శ్రీనిధి బుణాలు, సీఐఎఫ్, ఉపాధి కార్యక్రమాలు జమలు, చెల్లింపులు వంటి వాటిపై వారికి వివరించారు. గ్రూపుల పనితీరు, నిర్వాహణపై బృందం సభ్యు లు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఐకెపి ఏపీఎం విశ్వేశ్వర్, సీసీ రుక్మిణీలు కూడా ఐకేపీ పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. -
నిధులు మింగిన ఉద్యోగులపై వేటు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం ఇందిరాక్రాంతి పథం పాలనను గాడిలో పెట్టేందుకు ఐటీడీఏ పీవో వీరపాండియన్ ఎట్టకేలకు దృష్టి సారించారు. ఐకేపీ ద్వారా అర్హులకు పథకాలను అందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాకుండా...అడ్డగోలుగా నిధులు కొల్లగొడుతున్న సిబ్బందిపై కఠినంగానే వ్యవహరించారు. ట్రైబల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(టీపీఎంయూ) పరిధిలోని ఇందిరాక్రాంతి పథంలో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రికలో వ రుస కథనాలు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన పీవో అక్రమార్కులపై వేటు వేసేందుకు నిర్ణయించారు. విద్యార్థులకు అందజేయాల్సిన ఉపకార వేతనాలు, గ్రెయిన్ బ్యాంకు నిధులు, అభయ హస్తం ద్వారా మంజూరైన పింఛన్లను అర్హులైన వారికి ఇవ్వకుండా కాజేసిన ఆరుగురు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీసీ)ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం పీవో ఉత్తర్వులు జారీ చేశారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక క్లస్టర్ సీసీ జీ.ప్రభాకర్, పర్ణశాల ఎంబీకే టీ. వెంకటేశ్వర్లు, తూరుబాక సీసీ పీ. మోహన్‌రావు, దుమ్ముగూడెం క్లస్టర్ సీసీ. శంకరమ్మ, మారాయిగూడెం సీసీ జీఆర్కే స్వామి, ఆర్లగూడెం సీసీ ఐ.రామకృష్ణ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. రామకృష్ణ ప్రస్తుతం వెంకటాపురంలో పనిచేస్తుండగా, స్వామి వీఆర్ పురం మండల ఏపీఎంగా పనిచేస్తున్నారు. మిగతా నలుగురు దుమ్ముగూడెం మండలంలోనే పనిచేస్తూ ఇటీవల టీపీఎంయూ కార్యాలయానికి సరెండర్ అయ్యారు. ఉపకార వేతనాలు, గ్రెయిన్ బ్యాంకు, అభయహస్తం పింఛన్లకు సంబంధించి మంజూరైన నిధులను లబ్ధిదారులకు అందజేయకుండా ఫోర్జరీ సంతకాలతో దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడి కావటంతోనే వారిపై చర్యలు తీసుకున్నట్లు పీవో వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. గాడిలో పెట్టేందుకే... ఇందిరాక్రాంతి పథం కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరవుతున్న నిధులను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పింఛన్లతో పాటు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల నిర్వహణపై కూడా వీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టీపీఎంయూ పరిధిలో గల చింతూరు, కూనవరం, దుమ్ముగూడెం, వెంకటాపురం, మణుగూరు తదితర మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యహారంపై ‘సాక్షి’లో కథనాలు వచ్చిన నేపథ్యంలో సెర్ఫ్ చీఫ్ విజిలెన్స్ అధికారి రాజబాబు నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇటీవల భద్రాచలం వచ్చి విచారణ జరిపింది. వీరి నివేదిక ఆధారంగా మరి కొంతమంది సిబ్బందిపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖలోని ఓ అధికారి తెలిపారు. ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు బాధ్యతలతో పాటు వివిధ పథకాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే బాధ్యతలను ప్రస్తుతం ఐకేపీ సిబ్బంది చూస్తున్నారు. చాలా మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావటం లేదని అసంతృప్తితో ఉన్న పీవో వీరపాండియన్ ఐకేపీని గాడిలో పెట్టేందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారనేవ్యాఖ్యలు నిపిస్తున్నాయి. -
‘అమృత హస్తం’కు తీరనున్న గుడ్ల కొరత
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మార్కెట్లో పెరిగిన కోడిగుడ్ల ధరకు అనుగుణం గా ఒక్కో గుడ్డుపై 57పైసల ధరను పెంచుతు ఇందిర క్రాంతి పథకం ఉన్నతాధికారులు సర్క్యులర్‌ను జారీ చేశా రు. దీంతో అమృతహస్తం పథకానికి నెలరోజులుగా సరఫ రా కాకుండా నిలచిపోయిన కోడిగుడ్లకు మోక్షం కలుగనుంది. మార్కెట్లో కోడి గుడ్ల ధరలు పెరగడంతో అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్న అమృత హస్తం పథకాని కి గుడ్లను సరఫరా చేయలేమని మహిళా సమాఖ్యలు చే తులెత్తివేశాయి. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫ రా నిలచిపోవడంతో బాలింతలు, గర్భిణులకు పౌష్టిక ఆ హారం అందని ద్రాక్షలాగా మారింది. మార్కెట్లో ఒక కో డి గుడ్డు ధర రూ. 4.50గా ఉంది. మహిళా సమాఖ్యలకు ఒక కోడిగుడ్డుపై ఐసీడీఎస్ అధికారులు రూ. 3.50 చెల్లిస్తా రు. గతంలో మార్కెట్లో కోడిగుడ్డు ధర హోల్‌సెల్‌లో రూ.3.30కు లభించేది. మార్కెట్లో రూ.4కు విక్రయించేవారు. ఫౌల్ట్రీ పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో కోడిగుడ్ల ధరలను వ్యాపారులు పెంచారు. మా ర్కెట్లో కోడిగుడ్డు ధర రూ.4.50గా ఉండగా హోల్ సెల్ లో రూ. 4కు లభిస్తుంది. అయితే ఐసీడీఎస్ అధికారులు మాత్రం కోడిగుడ్డుకు రూ. 3.50 చెల్లిస్తుండటంతో మహి ళా సమాఖ్యలు లాభాలకు బదులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీంతో మహిళా సమాఖ్యలు కోడిగుడ్ల ను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయలేమని స్పష్టం చేశాయి. గడచిన జనవరి1న రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి న అంగన్వాడీ కేంద్రాలలో అమృత హస్తం పథకాన్ని అ మలు చేసింది. జిల్లాలోని భీమ్‌గల్, దోమకొండ, ఎల్లారె డ్డి, మద్నూర్, బాన్సువాడలలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప రిధిల్లో ఉన్న 19 మండలాల్లోని 2,628 అంగన్వాడీ కేం ద్రాల్లో అమృత హస్తం పథకం అమలు జరుగుతుంది. ప థకం ఆరంభంలో 11,694 మంది గ ర్భిణులు, 7,650 మంది బాలింతలకు పథకాన్ని వర్తింపజేశారు. ఎంతో మంది గర్భిణులకు, బాలింతలకు ఆర్థిక స్థోమత సరిగా లే క పౌష్టిక ఆహారం తీసుకోక పోవడంతో మాతా శిశుమరణాల సంఖ్య పెరిగింది. దీంతో పౌష్టిక ఆహారం అందించ డం కోసం ప్రభుత్వం స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అ మృత హస్తం పథకాన్ని ప్రారంభించింది. వారంలో ఆరు రోజుల పాటు మధ్యాహ్నం పూట బాలింతలు, గర్భిణుల కు అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయల భోజనంతో పాటు, ఒక కోడిగుడ్డు, పాలను అందిస్తున్నారు. ఒక్కో బా లింత, గర్భిణిపై ప్రభుత్వం ఒక పూటకు రూ. 17 ఖర్చు చే స్తుంది. పథకం ఆరంభంలో రూ. 15 ఉండగా ధరలు పెరగడంతో రూ. 2ను పెంచింది. కోడి గుడ్ల ధర పెరగడంతో మహిళా సమాఖ్యలు తాము సరఫరా చేసే గుడ్ల ధర పెం చాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను కోరారు. అయితే ఇది తమ చేతిలో లేదని అధికారులు స్పష్టం చేయడంతో మహిళా సమాఖ్యలు చేతులెత్తేశాయి. ఇందిర క్రాంతి పథకం జిల్లా ఉన్నతాధికారులు మహిళా సమాఖ్యలకు హోల్‌సెల్‌గా కోడిగుడ్లను సరఫరా చేసే వ్యాపారులను పిలిపించి గతంలోని ధరలకే కోడిగుడ్లను సరఫరా చేయాల్సిందిగా కోరారు. అయితే కోడిగుడ్ల వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ధర తగ్గించే విషయంపై వెనక్కి తగ్గలేదని తెలిసింది. చివరకు ఇందిర క్రాంతి పథకం అధికారులు స్పందించి ఒక్కో కోడిగుడ్డుపై 57పైసల ధర పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి కోడిగుడ్ల సరఫరా జరిగే అవకాశం ఉంది. -
ఐకేపీ, డీఆర్డీఏ జేఏసీ ఏర్పాటు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పాటయ్యారు. రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. స్థానిక డ్వాక్రాబజార్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఐకేపీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జి.రాంబాబు ఆ వివరాలు వెల్లడించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకుడు అశోక్‌బాబు అధ్యక్షతన శుక్రవారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఐకేపీ జేఏసీ ఏర్పాటైనట్లు చెప్పారు. శనివారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, సోమవారం పీడీలకు సమ్మె నోటీసులు అందజేస్తామన్నారు. మంగళవారం నుంచి నిర్వహించనున్న నిరవధిక సమ్మెలో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో గల 70 లక్షల మంది ఐకేపీ ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఐకేపీ అధికారులు కృష్ణకుమారి, అంబేద్కర్, సురేష్, సాల్మన్, ప్రసాద్, పి.రాంబాబు, డేవిడ్, కృష్ణారావు పాల్గొన్నారు. రేపటి నుంచి పశుసంవర్థకశాఖ వైద్యులు... ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యసెగ పశుసంవర్థకశాఖను తాకింది. ఇప్పటికే ఆ శాఖ సిబ్బంది నిరవధిక సమ్మెలోకి దిగగా, తాజాగా పశువైద్యులు, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లు సమ్మెబాట పట్టనున్నట్లు ప్రకటించారు. గజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు పశుసంవర్థకశాఖ డెరైక్టర్‌కు సమ్మె నోటీసు కూడా అందించారు. జిల్లాలోని 110 మంది పశువైద్యులు, 17 మంది అసిస్టెంట్ డెరైక్టర్లు సమ్మెలోకి దిగనున్నారు. ఇప్పటివరకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలోని మినిస్టీరియల్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. అయితే, సేవలపై వారి సమ్మె ఎలాంటి ప్రభావం చూపలేదు. పశువైద్యులు, అసిస్టెంట్ డెరైక్టర్ల సమ్మెతో సేవలకు విఘాతం కలగనుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పశువులు వ్యాధుల బారినపడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పశువైద్యులు సమ్మెలోకి దిగడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు... పశువైద్యులు, అసిస్టెంట్ డెరైక్టర్లు ఈనెల 19వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి దిగుతుండటంతో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్థకశాఖ గజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ డీ సురేంద్రప్రసాద్, కార్యదర్శి పీ వెంకటసుబ్బయ్య తెలిపారు. సంతపేటలోని బహుళార్ధ పశువైద్యశాల ఆవరణలో సమ్మెకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను శనివారం వారు వెల్లడించారు. నిరవధిక సమ్మెలోకి దిగినప్పటికీ అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రతి పశువైద్యశాలలో సంబంధిత పశువైద్యాధికారి ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే ఫోన్‌చేసిన వెంటనే వైద్యుడు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు.