నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్: ఇందిరాక్రాంతి పథకం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా సంఘాల అభివృద్ధి చాలా బాగుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల బృందం సభ్యులు జ్యోతినిరజ్ కైర్వల్, కె. పాండే, సంజయ్‌కుమార్, శైలేంద్ర, బిఎల్. టమటా, అశిష్‌పుంతి, ఆనంద్‌భాస్కర్ కితాబిచ్చారు. గురువారం న ర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుం ట గ్రామాన్ని సందర్శించి గ్రామాఖ్య మహిళ సంఘల పనితీరు, ప్రభుత్వం బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్న రుణాల తో ఎలా అభివృద్ధి చెందుతున్నరన్న విషయలతోపాటు పౌష్టికాహార కేంద్రా ల నిర్వహణ తదితర అంశాలపై అధ్యయనం చేశారు.
ఇక్కడ అమలవుతున్న మహిళా సంఘాలను ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్ర ప్రభుత్వ సైతం ఇంది క్రాంతి లాంటి పథకాన్ని అమలు చేసిందన్నారు. తమ రాష్ట్ర మహిళలలకు సైతం తక్కువ వడ్డీతో రుణాలు అందజేసేందుకు కృషి చేస్తోందన్నారు. బాలిం త, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహార కేంద్రాలు పనితీరు సైతం బాగుం దన్నారు. అనంతరం మహిళలలో వారు మాట్లాడుతూ బ్యాంక్ రుణాలు తీసుకోవాడం, వాయిదాల చెల్లింపు, ఆదాయం కోసం చేపట్టే పనులు, తదితర అంశాల పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృందం మేనేజర్ కరుణాకర్, స్థానిక ఐకేపీ ఏపీఎం సత్యనారాయణ, సీసీ దత్తు, గ్రామఖ్య సంఘల మహిళ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.
అందోల్‌లోనూ..
జోగిపేట: డ్వాక్రా గ్రూపులపై అధ్యయయానికి ఉత్తరాఖండ్ చెందిన అధికారుల బృందం గురువారం అందోల్ మండలంలో పర్యటించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన డిప్యూటీ కమీషనర్ శైలేంద్ర వస్తే, ఎన్‌ఆర్‌ఐ అధికారి పునీ త, ఐఏఎస్ అధికారి జ్యోతి, సీడీఓ సం జయ్‌కుమార్, నవనీత పాండే, పీడిలు ఆనంద్ సింగ్, బాలకృష్ణలు ఈ బృందంలో ఉన్నారు. స్థానిక ఐకేపీ కా ర్యాలయంలో మండల సమాఖ్య మహిళలతో సమావేశాన్ని నిర్వహించి వారి ద్వారా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. డీఆర్‌డీఏ జేఆర్పీ లక్ష్మీప్రియ ఇందిరా క్రాంతి పథంనకు సం బంధించిన పలు విషయాలను వారికి క్లుప్తంగా విరించింది.
ఆమె ఆంగ్లంలో అన్ని విషయాలను వివరించే ప్రయత్నం చేయడం బాగా ఆకట్టుకున్న బృందం సభ్యులు ఆమెను అభినందించారు. మహిళా సమైఖ్యకు చెందిన సభ్యులు తాము బ్యాంకుల ద్వారా బుణాలు, శ్రీనిధి బుణాలు, సీఐఎఫ్, ఉపాధి కార్యక్రమాలు జమలు, చెల్లింపులు వంటి వాటిపై వారికి వివరించారు. గ్రూపుల పనితీరు, నిర్వాహణపై బృందం సభ్యు లు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఐకెపి ఏపీఎం విశ్వేశ్వర్, సీసీ రుక్మిణీలు కూడా ఐకేపీ పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
మహిళా సంఘాల అభివృద్ధి భేష్
Published Fri, Jan 24 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement
Advertisement