దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా | CM YS Jaganmohan Reddy Tweet On YSR Asara Scheme Launch | Sakshi
Sakshi News home page

దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా

Published Fri, Oct 8 2021 5:17 AM | Last Updated on Fri, Oct 8 2021 4:32 PM

CM YS Jaganmohan Reddy Tweet On YSR Asara Scheme Launch - Sakshi

సాక్షి, అమరావతి: అమ్మవారిని కొలిచే నవరాత్రులు ప్రారంభమవుతున్న రోజు అక్కచెల్లెమ్మల మధ్య వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభించడం దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పడుతున్న బాధలు, ఇబ్బందులు చూసి ఒక మాటిచ్చానని.. ఆ మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటున్నానని చెప్పారు.

ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్‌ ఆసరా పథకానికి మీ అందరి సమక్షంలో శ్రీకారం చుడుతున్నందుకు మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా ఉంది. స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే నవరాత్రుల ఆరంభం రోజు అక్కచెల్లెమ్మల మధ్య వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను.


పొదుపు సంఘాల రుణాలకు సంబంధించి నేను మీకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ ఆసరా ద్వారా 7.97 లక్షల పొదుపు సంఘాల ఖాతాలకు రూ.6,440 కోట్లు జమ చేస్తున్నాం. నేటి నుంచి అక్టోబర్‌ 18 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని’ అందులో పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement