ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి
సాక్షి, తిరుమల : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని, అందుకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తోందన్నారు.
మింగుడుపడని ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షపార్టీ నేతను ఎలా ఎదుర్కోవాలనే విషయానికే సమయాన్ని వెచ్చిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఇచ్చే సూచనల్ని ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిని మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగనే సీఎం
Published Fri, Mar 18 2016 1:06 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement