MLC kolagatla veerabhadra swamy
-
‘అలా చేస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారు’
-
‘అలా చేస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారు’
సాక్షి, విజయనగరం : కాంగ్రెస్‌తో కలిస్తే చంద్రబాబును గుడ్డలూడదీసి తంతారని వ్యాఖ్యానించిన మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తిలకు ఏం సమాధానం చెప్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి చంద్రబాబును ప్రశ్నించారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో.. తిరిగి అదే పార్టీతో కలవడం ద్వారా ఆయన ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ నేతలు మదన పడుతున్నారనీ ఈ విషయం చంద్రబాబుకు పట్టదా అని కోలగట్ల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీది రక్తంతో తడిసిన హస్తమని నాడు వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు అదే చేతిలో చెయ్యేసి నడుస్తున్నారని కోలగట్ల అన్నారు. అంటే మీ చేతులకు రక్తం అంటించుకున్నట్టు అంగీకరిస్తున్నట్టేనా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయట పడేందుకు, మీ అవినీతి చరిత్ర పై విచారణ ఎదుర్కొనేందుకు ఓ జాతీయ పార్టీ అవసరం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆగర్భశత్రువైన కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జతకట్టడాన్ని తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ‘పదవుల కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఎంతటి నీచ నికృష్ట రాజకీయాలు చేయడానికైనా సిద్దపడతారని మరోసారి రుజువైంది’ అని ఎమ్యెల్సీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన బాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఖబడ్దార్ చంద్రబాబూ అంటూ కోలగట్ల వ్యాఖ్యానించారు. -
ఉప ఎన్నికలు అనగానే చంద్రబాబు భయపడుతున్నారు?
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అసమర్థత, పాలనతో గత నాలుగు సంవత్సరాలు నుంచి ఆంధ్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి తీవ్రంగా మడిపడ్డారు. ఆయన గురువవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... శుక్రవారం రోజు బ్లాక్ డేగా గంట స్తంభం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆంధ్ర ప్రజల ఆంకాంక్ష మేరకు ప్రత్యేకహాదా కోసమే వైఎస్సార్ సీసీ ఎంపీలు ఒక సంవత్సరం పదవి కాలం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల శ్రేయసు కోసం తమ పదవులకు రాజీనామా చేశారని అన్నారు. తమ ఎంపీలు రాజీనామాలు స్పీకర్ ఆమోదించిన తర్వాత కూడా ఉప ఎన్నికలు రావని చంద్రబాబు అనడంలోనే ఎన్నికలు అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని అర్థం అవుతోందన్నారు. తమ పార్టీ ఎంపీల మాదిరిగానే టీడీపీకి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుందని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు వందల హామీలలో పది శాతం కూడా టీడీపీ అమలు చేయలేదని కోలగట్ల ధ్వజమెత్తారు. -
జగన్‌పై దుష్ర్పచారం చేస్తే సహించం
విజయనగరం మున్సిపాలిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాడని రెండేళ్ల పాలనలో ప్రజలు గమనించారని, 2019 ఎన్నికల్లో వారు తగిన బుద్ధి చెప్పటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం ఆయ విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మహానాడులో ఒక్కటైనా ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయకపోగా.. ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలనైనా ప్రస్తావించకపోవటం విచారకరమన్నారు . ప్రపంచం ఆశ్చర్యపడేలా రాజధాని నిర్మిస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు, ఈవిషయంలో జగన్మోహన్రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ చేస్తున్న విషప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్మాణానికి జగన్ అడ్డుపడుతున్నారన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు చూపించగలరా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేక, సాయం చేయమని అడగలేక, బీజేపీ కాళ్ల ముందు మోకరిల్లుతున్న చంద్రబాబు ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. కోటీశ్వరులైన సుజనాచౌదరి, టీజే వెంకటేష్‌లకు రాజ్యసభ సీట్లు కేటాయించేందుకు ఎన్ని రూ.కోట్ల ముడుపులు తీసుకున్నారో, విపక్ష ఎమ్మెల్యేల కొనుగోలుక డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియజేయాలన్నారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు ఏపీ నుంచి రాజ్యసభ టిక్కెట్టు ఖరారు చేసేముందు, విశాఖ ప్రత్యేక జోన్ ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాపాలు చేసిన వారే దేవాలయాల హుండీలో డబ్బు వేస్తారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించి భక్తు మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఆయన వెన్నుపోటు రాజకీయాలకు ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తూనే ఉంటుందన్నారు. -
బాబు విదేశీ పర్యటనల మర్మమేంటి?
ఎమ్మెల్సీ కోలగట్ల సూటి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ విదేశీ పర్యటనల మర్మమేంటి? అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికా? లేక తన పెట్టుబడులను అక్కడ పెట్టి రావడానికా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ఆకర్షించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికేనని చంద్రబాబు పైకి చెబుతున్నారని కానీ ఆయన వెళ్తున్నది ఏపీలో దోచుకున్నది విదేశాల్లో దాచుకోవడానికేనని ప్రజలనుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన గత 9 ఏళ్ల పాలనలో కూడా భాగస్వామ్య సదస్సులు నిర్వహించి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని, చివరికేమీ లేదని గుర్తు చేశారు. ఆ తొమ్మిదేళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులు ఉంటేనే విదేశీ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని, అలాంటిది జూట్, ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలు మూతపడిన పరిస్థితులు ఉంటే వారెలా వస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలేననీ వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారన్నారు. రెండేళ్లలో అసలు చంద్రబాబు సాధించిన అభివృద్ధి ఏమైనా ఉందా? రైతుల రుణాల భారం తగ్గిందా? డ్వాక్రా మహిళల రుణాలు రద్దయ్యాయా? విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పరిమితులు లేకుండా అమలు చేస్తున్నారా? అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. -
ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగనే సీఎం
ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి సాక్షి, తిరుమల : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని, అందుకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేస్తోందన్నారు. మింగుడుపడని ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షపార్టీ నేతను ఎలా ఎదుర్కోవాలనే విషయానికే సమయాన్ని వెచ్చిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఇచ్చే సూచనల్ని ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనిని మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
వారిది దోచుకో.. దాచుకో.. పద్ధతి: కోలగట్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పెద్ద బాబు దోచుకుంటూ ఉంటే చినబాబు దాచుకునే పనిలో పడ్డారని, ప్రజల గురించి అసలు పట్టిం చుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంవద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పథకాలేవీ రాష్ట్రంలో అమలు జరగట్లేదని, ‘దోచుకో...దాచుకో...’ అనే ఒక్క పథకం మాత్రమే దిగ్విజయంగా సాగుతోందని వ్యంగ్యంగా అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామనే విధానంతో కిందిస్థాయి నుంచీ టీడీపీ కార్యకర్తలు దోచుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. -
అదీ బాబు మైండ్ గేమ్‌లో భాగమే...
ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవుతుండటంతో పాలుపోని చంద్రబాబు ఏపీలోని ప్రజల దృష్టి మరల్చేందుకు మైండ్‌గేమ్ ఆడుతున్నారని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంఎల్సీ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే పలు చానెళ్లలో పదిమంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయించుకుంటున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన సాక్షితో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పీఎసీ చైర్మన్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన వెళ్లడంవల్ల సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా పీఎం అయిపోలేరనీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఎటువంటి నష్టం వాటిల్లదనీ పేర్కొన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామాలాడుతున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. -
మోసంతోనే అధికారంలోకి...
విజయనగరం మున్సిపాలిటీ: పార్టీలోకి ఎవ్వరొచ్చినా.. చేర్చుకోమనే చెప్పానని అయితే వారి చేరిక వల్ల కలిగే లబ్ధి గురించి ఒక సారి ఆలోచిం చుకోవాలని అధిష్టానానికి సూచించినట్టు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ప్రధానంగా చేరికల వల్ల పార్టీకి చెడు జరగకుండే ఉంటే మంచిదన్న భావనను వ్యక్తం చేశానన్నారు. శని వారం రాత్రి తన నివాసంలో జరిగిన విజయనగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఎవరు చేరినా జిల్లా పార్టీ అధ్యక్షునిగా తనతో కలిసి పని చేయాల్సిందేనని, ఆ అవకాశం వేరెవ్వరికి దక్కనివ్వకుండా పని చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని అయితే ప్రస్తు త ముఖ్యమంత్రికి ఉన్న అపార మోసపూరిత అనుభవంతో అధికారం చేజిక్కించుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటికీ అదే మోసపూరిత ధోరణిలో నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీకి అక్కడి ప్రజలు ఎలా బుద్ది చెప్పారో.. భవి ష్యత్తులో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోనూ టీడీపీకి అదే గుణపాఠం చెబుతారన్నా రు. భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, రానున్న రోజుల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఇప్పటివరకు 25 శాతం మాత్రమే పార్టీ కమిటీల నియా మకం పూర్తయిందని మిగిలిన కమిటీలను త్వరి తగతిన నియమించాలని సూచించారు. కమిటీ ల నియామకంలో నాయకత్వ లక్షణాలు కలిగి, పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే వారిని ని యమించాలన్నారు. ఈ విషయంలో మండల, పట్టణ పార్టీ కమిటీ సభ్యులు సహకరించాల న్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు ప్రాధాన్యమివ్వాలన్నా రు. ప్రజలు అనుభవించే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా వ్యవహరించినపుడే వారి నుంచి మన్ననలు పొందగలమన్నారు. కమిటీల నియామకంలో తూతూమంత్రంగా కాకుండా బాధ్యతతో చేపట్టాలన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కోల గట్ల నాయకత్వంలో జిల్లాలో పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్. బంగారునాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి.జైహింద్‌కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు ఎంకె.మోహన్, పట్టణ కమి టీ అధ్యక్షుడు ఆశపు.వేణు, కౌన్సిలర్లు ఎస్‌వివి రాజేష్, పిలకా.దేవి, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, బూర్లి.నరేష్, సోము.కోటేశ్వరరావు, మామిడి.అప్పలనాయు డు, జి. సూరపురాజు తదితరులు పాల్గొన్నారు. -
శుభాశీస్సులు
ఎమ్మెల్సీ కోలగట్ల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్ జగన్ వధూవరులకు దీవెనలు వైఎస్ జగన్ రాకతో కిక్కిరిసిన వేదిక ప్రాంగణం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రథమ కుమార్తె వివాహ రిసెప్షన్ మంగళవారం ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యక్రమానికి హాజరై వివాహబంధంతో ఒక్కటవుతున్న సంధ్య,నాగాభిషేక్లను ఆశీర్వదించారు. నిండునూరేళ్లు వర్థిల్లాలని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాత్రి 8.15 గంటల సమీపంలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం వీరభద్రస్వామి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు. జగన్‌ను చూసేందుకు పార్టీ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అరగంట సేపు జగన్మోహన్ రెడ్డి అక్కడే గడిపి, అక్కడి నుంచి రాత్రి బస చేసే జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. విజయనగరం మున్సిపాలిటీ/ కంటోన్మెంట్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ప్రథమ కుమార్తె సంధ్య, నాగాభిషేక్ల వివాహ విందు భోజనాలు మంగళవారం ఘనం గా జరిగాయి. బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛరణ ల నడుమ ఒక్కటి కానున్న నూతన వధూవరులను వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. పట్టణ శివారులోని ఆర్కే టవ ర్స్ ప్రాంగణంలో భారీ సెట్టింగ్‌లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లో మంగళవారం రాత్రి జరిగిన వేడుకలకు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరులను ఆశీర్వదించిన వారిలో ప్రతిపక్ష ఉప నాయకులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, రోజా, పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్న దొర, బేబీనాయన, ఈశ్వరి, కొండపల్లి అప్పలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు, ముత్యాలనాయుడు, బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నా యుడు, పరీక్షిత్ రాజు, కంబాల జోగులు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, అవనాపు విజయ్ తదితరులున్నారు. అలాగే వధూవరులను ఆశీర్వదించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు ఆర్వీఎస్కేకే రంగారావు(బేబీనాయన), పార్టీ రాష్ట్ర కార్యదర్శి సవరపు జయమణి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొణతాల రామకృష్ణ, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు కడుబండి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, పెనుమత్స సురేష్‌బాబు, జమ్మాన ప్రసన్నకుమార్, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ కేవీ సూర్యనారాయణరాజు, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాసరావు, పాలవలస రాజశేఖర్, విశాఖ జిల్లా నాయకుడు వంశీకృష్ణయాదవ్, గుడివాడ అమరనాధ్,గండి బాబ్జిలు ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, రాష్ట్రమాజీ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ వీఎస్ప్రసాద్, మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మజ్జి, శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, సీపీఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఇందుకూరి రఘురాజు, ద్రోణంరాజు శ్రీనివాసరావు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, కరణం ధర్మశ్రీ, పాలవలస రాజశేఖరం, తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కలెక్టర్ ఎంఎంనాయక్, జాయింట్ కలెక్టర్ బి.రామారావు, ఆర్డీఓ జె.వెంకటరావు, విజయనగరం మున్సిపల్ కమీషనర్ ఆర్.సోమన్నారాయణ, మండల తహశీల్దార్ కె.శ్రీనివాసరావులతో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, కామెడీ యాక్టర్లు శివారెడ్డి ధనరాజ్, పలువురు యాంకర్లు పాల్గొని సందడి చేశారు. జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా ఆర్కే టవర్స్ ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. దీంతో ఆయన అరగంట సేపు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. నేడు పెనుమత్స ఇంటికి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం నెల్లిమర్ల మండల మొయిద గ్రామం వెళ్లనున్నారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు గృహంలో జరగనున్న ఆయన మనుమని ఉపనయన కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు విజయనగరం పట్టణం నుంచి బయలుదేరి తిరిగి మళ్లీ 11 గంటల సమంలో నేరుగా అక్కడి నుంచి విశాఖ చేరుకుంటారు. -
నేడు ఎమ్మెల్సీ కోలగట్ల రాక
విజయనగరం మున్సిపాలిటీ : శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గురువారం విజయనగరం రానున్నారు. శాసనమండలి సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలకడంతో పాటు అభినందన సత్కార సభ నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పా ట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ నాయకులు స్వాగ తం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. విజయనగరం పట్టణంలోని ప్రధాన జంక్షన్లతో పాటు అన్ని రహదారులకు ఇరువైపులా ఆయన అభిమానులు స్వా గతం పలుకుతూ, శుభాకాంక్షలు తెలుపు తూ ఫెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలో పండగ వాతావరణం సంతరించుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డెంకాడ మండలం చింతవలస గ్రామం వద్ద పార్టీ విజయనగరం నియోజకవర్గం నాయకులు కోలగట్లకు ఘన స్వాగతం పలికి, అనంతరం కార్ల ర్యాలీతో ఊరేగింపు ప్రారంభిస్తారు. అక్క డి నుంచి వీటీ అగ్రహారం వై జంక్షన్‌కు చేరుకుని పార్టీ నాయకులు ఏర్పాటు చేసే భారీ మోటారు సైకిళ్లతో పట్టణ వీధుల్లో ఊరేగింపు సాగనుంది. వై జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు మయూ రి జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్, వైఎస్ఆర్జంక్షన్, ఎన్సీఎస్రోడ్, కన్యకాపరమేశ్వరి కోవెల, గంట స్తంభం జంక్షన్, మె యిన్‌రోడ్, మూడులాంతర్ల జంక్షన్ మీ దుగా కోట జంక్షన్ వరకు సాగుతుంది. అనంతరం కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసే అభినందన సత్కార సభలో కోలగట్లను ఘనంగా సత్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏ ర్పాట్లలో ఆ పార్టీ నాయకులు తలమునకలై ఉన్నారు. ర్యాలీలో పాల్గొనే వారికి కోలగట్ల చిత్రపటంతో ముద్రించిన టీ షర్టులు, టోపీలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆధ్యాంతం జిల్లా వాసులంతా తిలకించే విధంగా ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నారు. స్థానిక మీడియా ఛానల్స్ సిటీ కేబుల్, సత్యవిజన్లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక ప్రసారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.