పార్టీలోకి ఎవ్వరొచ్చినా.. చేర్చుకోమనే చెప్పానని అయితే వారి చేరిక వల్ల కలిగే లబ్ధి గురించి ఒక సారి ఆలోచిం చుకోవాలని
విజయనగరం మున్సిపాలిటీ: పార్టీలోకి ఎవ్వరొచ్చినా.. చేర్చుకోమనే చెప్పానని అయితే వారి చేరిక వల్ల కలిగే లబ్ధి గురించి ఒక సారి ఆలోచిం చుకోవాలని అధిష్టానానికి సూచించినట్టు వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ప్రధానంగా చేరికల వల్ల పార్టీకి చెడు జరగకుండే ఉంటే మంచిదన్న భావనను వ్యక్తం చేశానన్నారు. శని వారం రాత్రి తన నివాసంలో జరిగిన విజయనగరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో ఎవరు చేరినా జిల్లా పార్టీ అధ్యక్షునిగా తనతో కలిసి పని చేయాల్సిందేనని, ఆ అవకాశం వేరెవ్వరికి దక్కనివ్వకుండా పని చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని అయితే ప్రస్తు త ముఖ్యమంత్రికి ఉన్న అపార మోసపూరిత అనుభవంతో అధికారం చేజిక్కించుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటికీ అదే మోసపూరిత ధోరణిలో నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీకి అక్కడి ప్రజలు ఎలా బుద్ది చెప్పారో.. భవి ష్యత్తులో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోనూ టీడీపీకి అదే గుణపాఠం చెబుతారన్నా రు. భవిష్యత్తు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, రానున్న రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు.
ఇప్పటివరకు 25 శాతం మాత్రమే పార్టీ కమిటీల నియా మకం పూర్తయిందని మిగిలిన కమిటీలను త్వరి తగతిన నియమించాలని సూచించారు. కమిటీ ల నియామకంలో నాయకత్వ లక్షణాలు కలిగి, పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే వారిని ని యమించాలన్నారు. ఈ విషయంలో మండల, పట్టణ పార్టీ కమిటీ సభ్యులు సహకరించాల న్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటూ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు ప్రాధాన్యమివ్వాలన్నా రు. ప్రజలు అనుభవించే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా వ్యవహరించినపుడే వారి నుంచి మన్ననలు పొందగలమన్నారు.
కమిటీల నియామకంలో తూతూమంత్రంగా కాకుండా బాధ్యతతో చేపట్టాలన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కోల గట్ల నాయకత్వంలో జిల్లాలో పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్. బంగారునాయుడు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి.జైహింద్‌కుమార్, ప్రచార కమిటీ అధ్యక్షుడు ఎంకె.మోహన్, పట్టణ కమి టీ అధ్యక్షుడు ఆశపు.వేణు, కౌన్సిలర్లు ఎస్‌వివి రాజేష్, పిలకా.దేవి, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, బూర్లి.నరేష్, సోము.కోటేశ్వరరావు, మామిడి.అప్పలనాయు డు, జి. సూరపురాజు తదితరులు పాల్గొన్నారు.