హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో వారు సమ్మెను వాయిదా వేసుకున్నారు.
తొలుత ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు సీమాంధ్ర ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ఈ రోజు సాయంత్రం అధికారులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తరువాత క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సీఎంతో మాట్లాడిన తరువాత సమ్మె వాయిదా నిర్ణయం తీసుకున్నారు.