
బిత్రపాడులో ఉన్న ఏనుగుల గుంపు
విజయనగరం , జియ్యమ్మవలస: కురుపాం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో కొద్ది నెలలుగా తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్న గజరాజులు తాజాగా జియ్యమ్మవలస మండలం బిత్రపాడులో మంగళవారం రాత్రి విధ్వంసం సృష్టించాయి. ఎకరాలకొద్దీ పంటను నాశనం చేశాయి. సుమారు ఐదు నెలలుగా ఏనుగుల నుంచి తామంతా ఇబ్బంది పడుతున్నా వాటిని శాశ్వతంగా తరలించే విషయంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన మండలంలోని ఏనుగులగూడలో ప్రవేశించిన ఏనుగులు నేటికీ సంచరిస్తూనే ఉన్నా ప్రభుత్వం శాశ్వతంగా తరలించే ప్రయత్నం చేయలేదు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల మీదుగా ఒడిశా తరలించినా మళ్లీ ఏనుగులు తిరిగి వచ్చేస్తున్నాయి. పంట నష్టం తీవ్రంగా ఉన్నా అధికారులు చాలీచాలని పరిహారంతో చేతులు దులుపుకుంటున్నారు. ఎన్నో విధాలుగా తాము నష్టపోతుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని బిత్రపాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఐదు నెలలుగా..
సుమారు ఐదు నెలల నుం చి ఏనుగులు సంచరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవ డం లేదు. పరిష్కరించలేప్పుడు కేంద్ర ప్రభుత్వ సా యం తీసుకోవాలి. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.– అల్లు రాజేశ్వరరావు,మాజీ వైస్ ఎంపీపీ, బిత్రపాడు
Comments
Please login to add a commentAdd a comment