ఏపీ సచివాలయం లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు | elevator jam in ap secretariat.. 8 members in | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయం లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు

Published Thu, Jun 8 2017 8:23 PM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

ఏపీ సచివాలయం లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు - Sakshi

ఏపీ సచివాలయం లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు

  • సచివాలయంలో లిఫ్ట్‌లో ఇరుకున్న సిబ్బంది
  • ప్రాణభయంతో హడలిపోయిన బాధితులు
  • లోపలనుంచి తమను రక్షించండని మీడియా ప్రతినిధులకు ఫోన్లు
  • 25 నిముషాల తర్వాత ఎట్టకేలకు లిఫ్ట్‌ మరమ్మతు
  •  
    సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం అసెంబ్లీ నిండా వర్షపు నీళ్లు. అదే రోజు మడుగులా మారిన సచివాలయం. తాజాగా లిఫ్ట్‌లో పదిమంది పారిశుధ్య సిబ్బంది లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణభయంతో కేకలు వేయడం ఇదీ సచివాలయంలో తంతు. వివరాల్లోకి వెళితే.. ఏపీ సచివాలయంలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఏడెనిమిదిమంది పారిశుధ్య సిబ్బందితో పాటు ఒకరిద్దరు సందర్శకులు 3వ బ్లాకులో కిందకు దిగేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. లిఫ్ట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌కు వచ్చింది గానీ, ద్వారాలు తెరుచుకోలేదు. ఎంత అరచినా ఎవరూ స్పందించలేదు. దీంతో లోపలున్న సిబ్బంది ప్రాణభయంతో భీతిల్లారు.

    దీంతో సాక్షి ప్రతినిధికి ఫోన్‌ చేశారు. తమకు ఊపిరి (ఆక్సిజన్‌) అందడం లేదని, తమను రక్షించడంటూ ఫోన్‌ చేశారు. దీంతో సాక్షి టీవీలో స్క్రోలింగ్‌లు వచ్చాయి. ఒక్కసారిగా విషయం అందరికీ తెలిసింది. విషయం తెలియడంతో సచివాలయంలో ఫొటోగ్రాఫర్లు కూడా 3వ బ్లాకు వద్దకు పరిగెట్టుకుంటూ వెళ్లారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికీ తెలిసింది. దీంతో పరిగెట్టుకుంటూ వెళ్లి లిఫ్ట్‌ నిర్వాహకులను పిలిపించారు. అప్పుడు వచ్చి లిఫ్ట్‌ ద్వారాలు తెరుచుకునేలా చేశారు.

    ద్వారాలు తెరుచుకునే సరికి 25 నిముషాలు పైనే పట్టింది. ద్వారాలు తెరుచుకునే సరికి బాధితులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఐదు నిముషాల అనంతరం ఊపిరి అందడం లేదని, ప్రాణం పోతుందేమోనన్న భయం వచ్చిందని లిఫ్ట్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం సిబ్బంది చెప్పారు. లిఫ్ట్‌లో ఓ దివ్యాంగుడుకూడా ఉన్నారు. అంతర్జాతీయ రాజధానికి ఆయువుపట్టయిన సచివాయలయంలో 25 నిమిషాలు తమను రక్షించేవాడు లేకపోవడం దారుణమని బాధితుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement