పేదలకు సంక్షేమ పథకాలు | elfare schemes poor | Sakshi
Sakshi News home page

పేదలకు సంక్షేమ పథకాలు

Published Sun, Sep 27 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

elfare schemes poor

జంగారెడ్డిగూడెం:ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది , సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి చేరే విధంగా కృషిచేస్తున్నామని రాష్ట్రమంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. శనివారం నగర పంచాయతీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నగరపంచాయతీ భవన నిర్మాణానికి గతంలో రూ. 50లక్షలు మంజూరయ్యాయని, తాజా అంచనాల ప్రకారం 1.65 కోట్ల రూపాయలు మంజూరవుతాయని చెప్పారు. 7వ వా ర్డులో రూ. 3 లక్షలతో సీసీరోడ్డు, డ్రైన్, 14వ వార్డులో రూ. 5లక్షలతో సీసీరోడ్డు, బుట్టాయగూడెంలో రూ. 5లక్షలతో సీసీ రోడ్డు, 13వ వార్డులో రూ. 4లక్షలతో కాంపౌండ్‌వాల్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.
 
 17వ వార్డులో రూ. 8లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, 2వ వార్డులో రూ. 5లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు, బాలికల జెడ్పీహైస్కూల్ పాఠశాలలో రూ. 14.80 లక్షలతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో దీపం గ్యాస్ కనెక్షన్‌లను పంపిణీ చేశారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, టీడీపీ పట్టణ , మండల కమిటీ అధ్యక్షులు షేక్ ముస్త ఫా, ముళ్లపూడి గంగాధర శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్బిన దత్తాత్రేయ, పెనుమర్తి రామ్‌కుమార్, నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, సొసైటీ అధ్యక్షుడు వందనపు హరికృష్ణ, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement