అనంతపురం సెంట్రల్ :
అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులే మధ్యవర్తిత్వం పుచ్చుకుంటున్నారు. నిబంధనలను కాలరాస్తూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. శింగనమల నియోజకవర్గంలోని ఉల్లికల్లు రీచ్ ఇసుక రవాణా టెండర్లే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నా అధికారులు దానిని పరిగిణలోకి తీసుకోకుండా టెండర్‌దారులను రాజీ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు... డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు అధికార పార్టీ నేతలకు అదాయ వనరుగా మారారుు. స్థానిక ఎమ్మెల్యేలు ఇసుక రీచ్‌లను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. అక్కడంతా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి నుంచి వివాదాస్పదంగా మారిన ఉల్లికల్లు ఇసుక రీచ్ టెండర్ల ఖరారు వివాదాస్పదమవుతోంది. అక్రమాలను ప్రగతి బాటలో నడిపిస్తా
సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన నేడు (శుక్రవారం) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గురువారం ఆయనతో ఫోన్లో మాట్లాడగా.. అనంతపురం జిల్లాలో పనిచేయడానికి ప్రతి అధికారి ఆసక్తిగా ఉంటారన్నారు. అక్కడి ప్రజలు జిల్లా కలెక్టర్‌ను ఎంతో అదరించి అభిమానిస్తారని ఆయన తెలిపారు. అలాంటి జిల్లాకు రావడం సంతోషకరంగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా సేవలందించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో ముందుకెళ్లి జిల్లాను ప్రగతి బాటలో నడిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, ఇక్కడి కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌ను హైదరాబాద్ సెర్ప్ సీఈఓగా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే.
అరికట్టేందుకు జీపీఎస్ సౌకర్యం ఉన్న వాహనాలతో రవాణా చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు. ఇందులో ఐదుగురు టెండర్‌దారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో టెండర్ల నుంచి ఇద్దరు తప్పుకున్నారు. రవీంద్రారెడ్డి, రియాజ్, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కాటమయ్య మాత్రం చివరి వరకూ నిలబడ్డారు. అయితే ముగ్గురు టెండర్ దారులు వారివారి స్థాయిలో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి తెప్పించారు.
తమ అనుయాయులకు టెండర్ ఇవ్వాల్సిందేనని పలుమార్లు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో రావడంతో టెండర్లలో పాల్గొన్న వారందరినీ ఒకతాటిపైకి తెచ్చే బాధ్యతను ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నారు. అందరినీ రింగ్ చేసిన తర్వాత గుట్టుగా టెండర్ బాక్సును తెరిచి ఇతరులు వేసిన రేటుకన్నా ఎక్కువ ధరకు ఎమ్మెల్యే అనుచరునికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
వ్యూహం బెడిసికొట్టింది..
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగంలోకి దిగి తొలుత అందరినీ రింగ్ చేసినా చివరకు టెండర్ తమకంటే తమకు ఇవ్వాలని ముగ్గురూ పోటీ పడ్డారు. వ్యూహం బెడిసి కొట్టడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. తక్కువ ధర కోట్ చేసిన వారికి ఇవ్వాలో... ప్రజాప్రతినిధి ఒత్తిడికి తలొగ్గి అడ్డగోలు నిర్ణయం తీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే బాధిత టెండర్‌దారులు జాయింట్ కలెక్టర్ ల క్ష్మీకాంతంను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ కూడా తీవ్ర స్థాయిలో డీఆర్‌డీఏ- వెలుగు ప్రాజెక్టు అధికారులపై మండిపడినట్లు తెలిసింది. దీంతో గురువారం టెండర్‌దారులతో చర్చలు జరిపి ఫిఫ్టీ- ఫిఫ్టీ పంచుకునేలా రాజీ చేసినట్లు తెలిసింది.
గోల గోల!
Published Fri, Jan 23 2015 10:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM
Advertisement
Advertisement