mediaters
-
అక్కడ కిలో బీర రూ. 3లే!
బహిరంగ మార్కెట్లో కిలో బీరకాయలు అమ్మకం ధర రూ. 30లు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ రైతునుంచి దళారులు కొనుగోలు చేస్తున్నది ఎంతకో తెలుసా... అక్షరాలా రూ. 3లుకే. ఇది నమ్మలేకపోతున్నారు కదూ... అయితే గజపతినగరం మండలం బంగారంపేట వెళ్లాల్సిందే. ఆ మండలంలోని పలు గ్రామాల రైతులు పండిస్తున్న బీరకాయల్ని దళారులు కేవలం మూడురూపాయలకు కొనుగోలు చేసి మార్కెట్‌కు సరఫరా చేసి మనకు రూ. 30లు వంతున విక్రయిస్తున్నారు. ఎంత అన్యాయం? * పండించే రైతన్నకు మిగిలేది కష్టమే * దళారులకు దండిగా లాభాలు * అన్యాయం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువు గజపతినగరం రూరల్: మండలంలో ఉభాలు ప్రారంభానికి ముందు వివిధ గ్రామాల రైతులు విరివిగా కూరగాయలు పండించడం ఆనవాయితీ. పదేళ్లుగా బంగారమ్మ పేట, భూదేవి పేట, పాతబగ్గాం, మెంటాడ మండలం ఇద్దనవలస, కంటుభుక్తవలస, శాలి పేట, జక్కువ తదితర గ్రామాల్లో రైతులు బీరకాయలు పండిస్తున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉభాలకోసం వినియోగిస్తారు. అయితే వీరికి సరైఏన మద్దతు ధర కల్పించకపోవడంతో వీరి కష్టాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బీరకాయలు కిలో రూ. 30లు పలుకుతుండగా... దళారులు రైతులకు చెల్లించేది కేవలం కిలోకు మూడురూపాయలే. ఒకవైపు పంటపోయి... ఇటీవల కురుస్తున్న చిరుజల్లులకు పంట కాస్తా తీవ్రంగా నష్టపోయామనీ... దీనికి తోడు దళారులు తమనుంచి తక్కువధరకే కొనుగోలు చేస్తుండటంతో అసలు గిట్టుబాటు కావడంలేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏటా రూ. 6ల నుంచి రూ. 8లకు కొనుగోలు చేసేవారనీ, ఈ ఏడాది మరీ తక్కువ ఇస్తుండటంతో పెట్టుబడులు సైతం రావట్లేదని వారు బోరుమంటున్నారు. బంగారమ్మపేట గ్రామం నుంచి రెండు రోజుల కొకసారి రెండు మూడు లారీల బీరకాయల్ని దళారులు కొనుగోలు చేసి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, తదితర ప్రాంతాలకు తరలించి కాసులు కూడబెట్టుకొని రైతుల శ్రమను దోచేస్తున్నారు. ఇంటింటా అమ్మకాలు మొదట్లో కేజి బీరకాయలు 8రూపాయలకు కొనేవారు. ఇప్పుడు మూడు రూపాయలే ఇస్తామంటున్నారు. వారంతా సిండికేట్‌గా మారడంతో ఏం చేయాలో తెలీడం లేదు. ఇక చేసేది లేక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజపతినగరం వీధుల్లో సైకిల్‌పై తిప్పుతూ కేజీ బీరకాయలు 20రూపాయలకు అమ్ముకుంటున్నాను. - జొన్నాడ రాము, కూరగాయల రైతు, బంగారమ్మపేట పెట్టుబడులైనా రాలేదు గడచిన ఐదేళ్లుగా బీరకాయలు సాగు చేస్తున్నాను. పండించిన మొదటి రెండు మూడు సంవత్సరాలూ పంట దిగుబడితోపాటు మద్దతు ధర కూడా బాగుండేది. ఇప్పుడు కేజీ బీరకాయలు మూడు నుంచి నాలుగు రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. - సుంకరి సన్యాసి, కూరగాయల రైతు, బంగారమ్మపేట -
పత్తి రైతు చిత్తు!
♦ నిండా ముంచుతున్న వ్యాపారులు, దళారులు ♦ ఇష్టారీతిన ధర నిర్ణయం.. ట్రాక్టర్ పత్తిలో 40 కిలోలు కోత ♦ మార్కెట్ కాంటాతో పనిలేకుండా సొంతంగా తూకం ♦ నూటికి రూపాయిన్నర అదనపు కమీషన్ ♦ సాక్షి కథనాలతో స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ♦ జమ్మికుంట మార్కెట్లో ఆకస్మిక తనిఖీ ♦ అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /జమ్మికుంట: వర్షాభావం నుంచి ఎరువుల కొరత దాకా ఎన్నో ఎదురుదెబ్బల్ని తట్టుకున్న రైతన్న... చివరకు వ్యాపారులు, దళారుల చేతిలో చిత్తయిపోతున్నాడు. అంతో ఇంతో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామని మార్కెట్ కేంద్రాలకు వెళితే.. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నాడు. తూకం మొదలు కమీషన్ వరకు, మద్దతు ధర మొదలు తరుగు వరకు.. వ్యాపారుల మాయాజాలంలో నిండా మునిగిపోతున్నాడు. మార్కెటింగ్ శాఖ అధికారులే ఈ మోసానికి సహకరిస్తున్నారు. ఈ బాగోతంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. శుక్రవారం జమ్మికుంట పత్తి మార్కెట్లో ఆకస్మిక తనిఖీ చేశారు. మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. దళారులకు అప్పగించేశారు! కరీంనగర్ జిల్లాలో 11 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను చేపట్టాల్సి ఉన్నా... ఇప్పటివరకు కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, హుస్నాబాద్ మార్కెట్లలోనే ప్రారంభించారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలియగానే రైతులు ఆరు రోజులుగా రోజూ దాదాపు 10 వేల క్వింటాళ్ల పత్తిని మార్కెట్లకు తీసుకొస్తున్నారు. కానీ సీసీఐ అధికారులు ఏదో ఒక సాకు చెబుతూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు విధిలేక వ్యాపారులు, మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. నిండా మోసం..: నిబంధనల ప్రకారం మార్కెట్ కార్యాలయాల్లోని వేబ్రిడ్జ్‌ల వద్దే తూకం వేయాలి. పత్తి తేమ శాతం, నాణ్యత, ధర నిర్ధారణ విషయంలో మార్కెటింగ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించాలి. ఎంత తూకం వేస్తే అంత బరువుకు ధర చెల్లించాలే తప్ప బరువులో కోత విధించడానికి వీల్లేదు. అలాగే 2 శాతం కమీషన్ మాత్రమే తీసుకోవాలి.కానీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో ఇవేవీ అమలుకావడం లేదు. మార్కెట్లో వేబ్రిడ్జ్ ఉన్నా... వ్యాపారులు అక్కడ తూకం వేయనీయడం లేదు. తమకు అనుకూలమైన కాటన్ మిల్లుల వద్ద తప్పుడు తూకం వేస్తూ దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు ట్రాక్టర్లో పత్తిని తెస్తే 40 కిలోలు, ట్రాలీలో తెస్తే 20 కిలోల చొప్పున కోత విధిస్తూ మిగతా బరువుకు మాత్రమే సొమ్ము చెల్లిస్తున్నారు. ఇక 2 శాతం కమీషన్‌కు అదనంగా ‘క్యాష్ కటింగ్’ పేరిట ప్రతి రూ.వందకు మరో రూపాయిన్నర మినహాయించుకుంటున్నారు. ఇలా రూ.లక్షకు రూ.1,500, ప్రతి ట్రాక్టర్‌కు 40 కిలోల పత్తి కోతతో మరో రూ.1,600 రైతు నష్టపోతున్నాడు. తప్పుడు తూకం, తక్కువ ధర తో నిండా మునిగిపోతున్నాడు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. కరీంనగర్ జిల్లాలో గత ఆరు రోజులుగా రూ.20 కోట్లకుపైగా పత్తి వ్యాపారం జరగగా.. అందులో రైతులు రూ.5 కోట్లదాకా నష్టపోయినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. పత్తి కొనుగోళ్లలో మోసాలపై ‘సాక్షి’లో రెండు రోజుల పాటు వరుస కథనాలు రావడంతో.. కరీంనగర్ జిల్లా పాలనా యంత్రాంగంలో కదలిక వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఆకస్మికంగా జమ్మికుంట మార్కెట్‌ను తనిఖీ చేశారు. మార్కెటింగ్ శాఖ ఏడీ ప్రకాష్, తహసీల్దార్ రజనితో కలిసి రైతుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులంతా మూకుమ్మడిగా తమ బాధను వెళ్లగక్కారు. ‘‘మేం తెచ్చిన పత్తిని సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం లేదు. వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రూ.2,500 నుండి రూ.3,750 దాకా మాత్రమే ఇస్తున్నారు తప్ప ఒక్కరికి కూడా సీసీఐ నిర్ణయించిన ధర చెల్లించడం లేదు. పైగా ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. మార్కెట్ వేబ్రిడ్జ్‌పై కాకుండా సొంత కాంటాలపై తూకం వేస్తున్నారు. కాస్ట్ కటింగ్ పేరిట రూ.వందకు రూపాయిన్నర చొప్పున మినహాయించుకుంటున్నారు. మీరేమో ఆత్మహత్య చేసుకోవద్దు. ధైర్యంగా ఉండండని చెబుతున్నారు. అసలే కాలంలేక బాధపడుతున్నం. ఇక్కడికొస్తే అడ్తిదారులు, వ్యాపారుల దోపిడీతో చస్తున్నాం. ఇట్లయితే మేం బతికేదెట్లా..?’’అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ నీతూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘‘కాస్ట్ కటింగ్, సొంతంగా తూకం వేసుకోవడం, ట్రాక్టర్‌కు 40 కిలోల చొప్పున పత్తిని మినహాయించుకోవడం వంటివి నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇకపై అలా జరిగితే లెసైన్సు రద్దు చేస్తాం. క్రిమినల్ కేసు పెడతాం. గతంలో ఇక్కడ సీబీఐ దాడులు చేసి విచారణ జరుపుతున్న విషయాన్ని మర్చిపోవద్దు..’’ అని వ్యాపారులను హెచ్చరించారు. -
మధ్యవర్తిత్వంతోనే కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో లక్షలాదిగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే సరైన మార్గమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ఏపీ, టీఎస్ రాష్ట్రాల లీగల్ సర్వీసెస్ అథారిటీల ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక స్పృహతో మధ్యవర్తిత్వం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మధ్యవర్తిత్వం చేసే న్యా యవాదులకు మంచి భవిష్యత్తుంటుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యకార్యదర్శి జి.శ్యామ్‌ప్రసాద్, బార్ కౌన్సిల్ పూర్వ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఐసీఏడీఆర్ కార్యదర్శి జీఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
గోల గోల!
అనంతపురం సెంట్రల్ : అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులే మధ్యవర్తిత్వం పుచ్చుకుంటున్నారు. నిబంధనలను కాలరాస్తూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. శింగనమల నియోజకవర్గంలోని ఉల్లికల్లు రీచ్ ఇసుక రవాణా టెండర్లే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నా అధికారులు దానిని పరిగిణలోకి తీసుకోకుండా టెండర్‌దారులను రాజీ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు... డ్వాక్రా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లు అధికార పార్టీ నేతలకు అదాయ వనరుగా మారారుు. స్థానిక ఎమ్మెల్యేలు ఇసుక రీచ్‌లను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. అక్కడంతా వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి నుంచి వివాదాస్పదంగా మారిన ఉల్లికల్లు ఇసుక రీచ్ టెండర్ల ఖరారు వివాదాస్పదమవుతోంది. అక్రమాలను ప్రగతి బాటలో నడిపిస్తా సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన నేడు (శుక్రవారం) జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ గురువారం ఆయనతో ఫోన్లో మాట్లాడగా.. అనంతపురం జిల్లాలో పనిచేయడానికి ప్రతి అధికారి ఆసక్తిగా ఉంటారన్నారు. అక్కడి ప్రజలు జిల్లా కలెక్టర్‌ను ఎంతో అదరించి అభిమానిస్తారని ఆయన తెలిపారు. అలాంటి జిల్లాకు రావడం సంతోషకరంగా భావిస్తున్నానని చెప్పారు. జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా సేవలందించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో ముందుకెళ్లి జిల్లాను ప్రగతి బాటలో నడిపించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, ఇక్కడి కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌ను హైదరాబాద్ సెర్ప్ సీఈఓగా ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. అరికట్టేందుకు జీపీఎస్ సౌకర్యం ఉన్న వాహనాలతో రవాణా చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు. ఇందులో ఐదుగురు టెండర్‌దారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో టెండర్ల నుంచి ఇద్దరు తప్పుకున్నారు. రవీంద్రారెడ్డి, రియాజ్, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కాటమయ్య మాత్రం చివరి వరకూ నిలబడ్డారు. అయితే ముగ్గురు టెండర్ దారులు వారివారి స్థాయిలో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి తెప్పించారు. తమ అనుయాయులకు టెండర్ ఇవ్వాల్సిందేనని పలుమార్లు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో రావడంతో టెండర్లలో పాల్గొన్న వారందరినీ ఒకతాటిపైకి తెచ్చే బాధ్యతను ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నారు. అందరినీ రింగ్ చేసిన తర్వాత గుట్టుగా టెండర్ బాక్సును తెరిచి ఇతరులు వేసిన రేటుకన్నా ఎక్కువ ధరకు ఎమ్మెల్యే అనుచరునికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వ్యూహం బెడిసికొట్టింది.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగంలోకి దిగి తొలుత అందరినీ రింగ్ చేసినా చివరకు టెండర్ తమకంటే తమకు ఇవ్వాలని ముగ్గురూ పోటీ పడ్డారు. వ్యూహం బెడిసి కొట్టడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. తక్కువ ధర కోట్ చేసిన వారికి ఇవ్వాలో... ప్రజాప్రతినిధి ఒత్తిడికి తలొగ్గి అడ్డగోలు నిర్ణయం తీసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాధిత టెండర్‌దారులు జాయింట్ కలెక్టర్ ల క్ష్మీకాంతంను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ కూడా తీవ్ర స్థాయిలో డీఆర్డీఏ- వెలుగు ప్రాజెక్టు అధికారులపై మండిపడినట్లు తెలిసింది. దీంతో గురువారం టెండర్‌దారులతో చర్చలు జరిపి ఫిఫ్టీ- ఫిఫ్టీ పంచుకునేలా రాజీ చేసినట్లు తెలిసింది.