మధ్యవర్తిత్వంతోనే కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో లక్షలాదిగా పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే సరైన మార్గమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్‌ప్యూట్ రిజల్యూషన్, ఏపీ, టీఎస్ రాష్ట్రాల లీగల్ సర్వీసెస్ అథారిటీల ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సామాజిక స్పృహతో మధ్యవర్తిత్వం చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మధ్యవర్తిత్వం చేసే న్యా యవాదులకు మంచి భవిష్యత్తుంటుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యకార్యదర్శి జి.శ్యామ్‌ప్రసాద్, బార్ కౌన్సిల్ పూర్వ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఐసీఏడీఆర్ కార్యదర్శి జీఎల్‌ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.