యనమలతో ఉద్యోగ సంఘాల భేటీ | employees union meets yanamala | Sakshi
Sakshi News home page

యనమలతో ఉద్యోగ సంఘాల భేటీ

Published Tue, Jan 13 2015 5:16 PM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

మంత్రి మండలి ఉపసంఘంతో భేటీ అయిన ఉద్యోగసంఘాల నేతలు - Sakshi

మంత్రి మండలి ఉపసంఘంతో భేటీ అయిన ఉద్యోగసంఘాల నేతలు

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను మంత్రి వర్గానికి తెలియజేశాయి. ఉద్యోగుల కనీస వేతనం రూ. 15 వేలుగా నిర్ధారించాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబంలోని నలుగురు సభ్యులను ఒక్కో యూనిట్ గా గుర్తించాలని కోరాయి.

ఉద్యోగుల ఇంక్రిమెంట్ రేటు 3 శాతానికి పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే సంబంధిత శాఖకు చెందిన నలుగురు మంత్రులు సమావేశానికి హాజరు కాలేదు.  వారు వచ్చిన తరువాత  డిమాండ్లపై చర్చిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement