నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలి విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని బుధవారం కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ విషయాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సదరు విద్యార్థి మాస్ కాపీయింగ్కు పాల్పడుతుండగా... ఇన్విజిలేటర్కు పట్టిబడిందని... ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని ఆమె సహచర విద్యార్తులు పోలీసులకు తెలిపారు.