సైకిల్ యాత్ర చేస్తూ పర్చూరు చేరుకున్న ఇంగ్లండ్ మహిళలు
సాక్షి, పర్చూరు(ప్రకాశం): సైక్లింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించడం కోసం ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు మహిళలు భారీ సాహసానికి పూనుకున్నారు. ఇంగ్లండ్‌లోని జార్జియాకు చెందిన మహిళలు ఫ్లోకార్ట్, రేజ్ జూన్ 29న ఇంగ్లాండ్‌లో ఒకే సైకిల్‌పై యాత్ర ప్రారంభించారు. వీరు శుక్రవారం పర్చూరుకు చేరుకోగా స్థానికులు సాదర స్వాగతం పలికారు. ఇప్పటి వరకు 13 దేశాల్లో 6 వేల మైళ్లు సైకిల్ యాత్ర చేశామని పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం ద్వారా వచ్చిన నగదును ఆక్ఫామ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందజేస్తామని తెలిపారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయన్నారు. ఇంగ్లండ్‌లో చట్టాల అమలు కఠినంగా ఉంటుందని, అక్కడ ట్రాఫిక్ నియంత్రణలోనే ఉంటుందని చెప్పారు. భారత్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదన్నారు. స్థానిక హ్యుమన్ రైట్స్ నాయకుడు ఎం.హరిప్రసాద్ ఇంట్లో సేద తీరిన ఇంగ్లండ్ మహిళలు ఆతిథ్య విందు స్వీకరించారు. తాము ముంబయికి వెళ్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment