రాజాం- పాలకొండ రోడ్డులో పోలీసుల అత్యుత్సాహం
Published Wed, Aug 7 2013 3:20 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
రాజాం, న్యూస్‌లైన్: పోలీసులు అత్యు త్సాహం కనబర్చి మరోసారి స్వామి భక్తిని చాటుకున్నారు. మంత్రి కోండ్రు మురళీమోహన్ క్యాంపు కార్యాలయానికి అవసరానికి మించి భద్రత ఏర్పాట్లు చేశారు. ఓ భవనం మొదటి అంత స్తులో ఉన్న కార్యాలయానికి ఇంత భద్రత ఏర్పాట్లు చేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమకారులు మంగళవారం రాజాం బంద్ నిర్వహించారు. దీంతో రాజాం- పాలకొండ రోడ్డులో ఉన్న మంత్రి కార్యాలయం వద్ద ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేయడమే కాకుండా 15 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని రక్షణగా నియమించారు. మంత్రి కార్యాలయం లో రెండు కంప్యూటర్ల్, ఫ్యాక్స్ ప్రిం టర్, అథిదులకు టీ, కాఫీ అందించేం దుకు గ్యాస్ స్టౌవ్, సిలిండర్‌తో పాటు ఏసీ మిషన్, ఫర్నిచర్ మాత్రమే ఉన్నా యి.
వీటి భద్రక కోసం పోలీసులు ముళ్ల కంచె ఏర్పాటుచేసి 15 మంది పోలీ సులను మొహరించడాన్ని స్ధాని కులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తహ శీల్దార్, మండల పరిషత్, ఇతర ప్రభు త్వ శాఖల కార్యాలయాల వద్ద ఎటువంటి బందోబస్తు ఏర్పాటుచేయ కుండా ఇక్కడే ఏర్పాటు చేయ డాన్ని తప్పుపడుతున్నారు. ఆయా కేంద్రాల్లో విలువై న రికార్డులు ఉన్నాయి. వాటి భద్రతను గాలికి వదిలి అద్దె భవనంలో ఉన్న మంత్రి కార్యాలయం చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేసి 15 మంది భద్రతా సిబ్బందిని నియమించడమేమి టని ప్రశ్నిస్తున్నారు. సమైక్య వాదులపై లాఠీచార్జీ చేసి పలువురిని తీవ్రంగా గాయ పర్చడమే కాకుండా 19 మం దిపై నాన్‌బెయిల బుల్ కేసులు నమో దు చేసి ఇప్పటికే విమర్శలపాలైన పోలీ సులు ఇప్పుడు మళ్లీ అత్యుత్సాహం ప్రదర్శించడంతో పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Advertisement