తెలంగాణ వాహనాలపై ఏపీ పన్ను
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలకు పన్ను విధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శుక్రవారం నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. ఏపీలో ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాల వలే తెలంగాణ నుంచి వచ్చే రవాణ వాహనాలపై పన్ను వసూలు చేస్తారు. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే అన్ని చెక్పోస్టుల వద్ద ఈ విధానం అమలుకానుంది. అందుకు సంబంధించిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.
అయితే ప్రతి 3 నెలలకు ఓ సారి ఏపీ ప్రభుత్వం పన్ను వసూలు చేయనుంది. ఈ పన్ను వసూలు ద్వారా ఏడాదికి సుమారు రూ. 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.