కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలను జిల్లా ప్రజాపరిషత్ నిర్వహిస్తోంది.
జెడ్పీ ఉద్యోగులారా..! మీ భవిష్యనిధిలో నెలనెలా చెల్లించే మొత్తాలు జమ అవుతున్నాయా..లేదా.. ఒకవేళ జమ అయితే ఎంత..? తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉంది కదూ..!అయితే 119.226.159.178:8080/్డఞఞజుఠటౌౌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ సర్వీసు నెంబర్ ఎంటర్ చేయండి.. భవిష్యనిధి సమాచారం తెలుసుకోండి. జిల్లా ప్రజాపరిషత్ సీఈవో జయరామిరెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన భవిష్యనిధి వెబ్‌సైట్‌ను గాంధీ జయంతి సందర్భంగా గురువారం ఉదయం కలెక్టర్ విజయమోహన్ ప్రారంభించనున్నారు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యే ముందు మరింత సమాచారం మీకోసం..
కర్నూలు(జిల్లా పరిషత్):
కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలను జిల్లా ప్రజాపరిషత్ నిర్వహిస్తోంది. దాదాపు 8,434 మంది ఉద్యోగుల భవిష్యనిధి చందాదారులు జిల్లా ప్రజాపరిషత్ భవిష్యనిధిలో చందాదారులుగా ఉన్నారు. ప్రభుత్వ సాధారణ భవిష్యనిధికి వర్తించే నిబంధనలే జెడ్పీ భవిష్యనిధికి కూడా వర్తిస్తాయి. ప్రస్తుతం 8,434 మంది చందాదారుల భవిష్యనిధి ఖాతాల వివరాలను 2005-06 సంవత్సరం నుంచి 2013-14వ సంవత్సరం వరకు 74,870 రికార్డులను 119.226.159.178:8080/్డఞఞజుఠటౌౌ అనే వెబ్‌సైట్‌లో ఉంచారు. చందాదారులకు మంజూరు చేసిన రుణాలను వెబ్‌సైట్ ద్వారా గత సంవత్సరం నుంచి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. రుణ ఉత్తర్వులను కూడా ఇప్ప టి నుంచి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయడం వల్ల, సదరు ఉత్తర్వులను చందాదారులు వెంటనే పొందే అవ కాశం కల్పించారు. దీనివల్ల భవిష్యనిధి ఖాతాదారులు తమ తమ ఖాతాలకు సంబంధించిన చందా వివరాలను వెంటనే తెలుసుకునే సౌకర్యం ఉంటుంది.
భవిష్యనిధి చందా మొత్తం రూ.189కోట్లు
జిల్లా ప్రజాపరిషత్‌లోని భవిష్యనిధి చందాదారుల మొత్తం నిల్వ రూ.189కోట్లుగా ఉంది. దాంతో పాటు 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి 2010-11 సంవత్సరం ప్రభుత్వం నుంచి భవిష్యనిధి మొత్తాలకు వడ్డీ రూ. 35,88,72,010 ఆడిట్ వారిచే ధ్రువీకరించిన మొత్తం జమకావాల్సి ఉంది. భూస్టర్ స్కీమ్ కింద 2006-07 సంవత్సరం నుంచి 2010-11 సంవత్సరానికి రూ.23,24,482 ప్రభుత్వం నుంచి రావాలి. ఈ స్కీమ్ కింద సర్వీసులో ఉంటూ మరణించిన చందాదారుని వారసులకు, చందాదారు జమచేయాల్సిన చందా మొత్తాన్ని బట్టి రూ.20వేలు మించకుండా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యనిధి ఖాతాదారుల నెలసరి చందా మొత్తం ఒక నెలకు ప్రస్తుతం దాదాపు రూ.3 కోట్లను 8338-00-104-00-01 పద్దుకు జమచేశారు. చందాదారులకు మంజూరు చేసిన రుణ మొత్తాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన అంతిమ మొత్తాలు కలిపి నెలకు దాదాపు రూ.1,50,00,000 వరకు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.
సంవత్సరాల వారీగా ఖాతాదారుల సంఖ్య
సంవత్సరం ఖాతాదారుల సంఖ్య
2005-2006 8361
2006-2007 8402
2007-2008 8532
2008-2009 8333
2009-2010 8225
2010-2011 8266
2011-2012 8406
2012-2013 8434
2013-2014 7911
మొత్తం 74,870