ఎస్తేర్ సందడి | Esther says | Sakshi
Sakshi News home page

ఎస్తేర్ సందడి

Published Mon, Mar 10 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

ఎస్తేర్ సందడి

ఎస్తేర్ సందడి

 సినీనటి, భీమవరం బుల్లోడు ఫేమ్ ఎస్తేర్ నరోన్హ ఆదివారం నగరంలో సందడి చేశారు. బందరు రోడ్డులోని రిప్పల్స్ మాల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఎక్స్‌ప్రెస్ ఫర్ బెటర్ విజన్ షోరూమ్ ప్రారంభోత్సవంలో ఎస్తేర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ ఆప్టికల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.  షోరూం యజమాని సిద్దులింగ్ హర్నల్ మాట్లాడుతూ వినియోగదారుల సౌకర్యార్థ అన్ని రకాల ఆప్టికల్స్‌ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇక్కడ ఉచితంగా ఐ చెకప్ నిర్వహించడంతో పాటుగా  ఉచితంగా సర్వీసునూ అందిచనున్నట్టు వివరించారు.  
 

 ఐఏఎస్ కావాలని కోరిక : ఎస్తేర్

 టాలీవుడ్‌లోని అందరి హీరోలతో నటించాలని ఉందని ఎస్తేర్ పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూఇటీవల నిర్మించిన భీమవరం బుల్లోడు చిత్రం సక్సెస్ సాధించిందని పేర్కొన్నారు. కొన్ని చిత్రాల చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఐఏఎస్ అవ్వాలనేది తన కోరికని, దానికోసం ఇంకా చదువుతున్నానని ఎస్తేర్ వెల్లడించారు.      
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement