ప్రతి పైసా కోస్తా జిల్లాల వైపే | evary ruppe use on coastal districts | Sakshi
Sakshi News home page

ప్రతి పైసా కోస్తా జిల్లాల వైపే

Published Mon, Nov 2 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

ప్రతి పైసా కోస్తా జిల్లాల వైపే

ప్రతి పైసా కోస్తా జిల్లాల వైపే

సీమకు ఖర్చు చేస్తారన్నది అనుమానమే
ఏపీ సివిల్ సొసైటీ ప్రతినిధుల సదస్సులో కుసుమకుమారి

 
తిరుపతి సిటీ : కేంద్రం నుంచి వచ్చిన ప్రతి సహాయమూ కోస్తా జిల్లాల వైపే వెళుతోందని, రాయలసీమ వైపు రాని వ్వడం లేదని ఎస్కే యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ పి.కుసుమకుమారి అన్నారు. ప్రభుత్వ దృష్టి అంతా అమరావతి వైపే ఉందని, ప్రత్యే హోదా, ప్రత్యేక ప్యాకేజీల్లో రాయలసీమకు ఎంత ఖర్చు చేస్తారన్నది అనుమానమేనని పేర్కొన్నారు. ఏసీ సివిల్ సొసైటీ ప్రాంతీయ సదస్సు తిరుపతి యూత్ హాస్టల్‌లో జరిగింది. సదస్సును ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఏర్పడిన ఏపీ సివిల్ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సదస్సులను నిర్వహిస్తోందని తెలిపారు. 

అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మళ్లీ అభివృద్ధిని కేంద్రీకరించడం బాధాకరమన్నారు. ఏపీ సివిల్ సొసైటీ ప్రాంతీ య కన్వీనర్ భూమన్ మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని తెలి పారు. శివరామకృష్ణన్ నివేదికను కూడా లెక్కచేయకుండా భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రాంతంలో రాజధాని కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధాని చేయడం వల్ల కోస్తా జిల్లాల వారంతా తనకు ఓట్లేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అలా చేస్తున్నారని ఆరోపించా రు. సీమలో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేసి వలసపోతున్నారని సీనియర్ జర్నలిస్ట్ జగన్నాథనాయుడు తెలిపారు. రాజధాని పేరుతో 33వేల ఎకరాల పంట పొలాలను లాగేసుకున్నారని, మరో 55వేల ఎకరాల అటవీ భూమిని తీసుకోబోతున్నారని, భవిష్యత్తులో ప్రాణవాయువు కూడా కరువైపోతుందని అన్నారు. నీటి వాటా సాధనలో సీమ వెనుకబడడం వల్ల భాషాపరంగా, సాంస్కృతికంగా సీమ వాసులు చిన్నచూపునకు గురవుతున్నారని మరో సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ అన్నా రు. ఇన్ని అన్యాయాలు చూశాక విడిపోదామన్న బలమైన కోర్కె మేధావుల్లో, చదువుకున్న వారిలో కలుగుతోందని సామాజిక కార్యకర్త పురుషోత్తంరెడ్డి అన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ సుబ్రమణ్యంరెడ్డి, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, గ్రామ వికాస సంస్థ ప్రతినిధి రాంబా బు, హేతువాది ఊట్ల రంగనాయులు, చలపతి, రామ్మూర్తి, వెంకటరమణ, సీనియర్ జర్నలిస్ట్ సొదుం రమణారెడ్డి, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement