అమరావతి వచ్చిన వారికి మినహాయింపు | Exemption for those who come to Amravati | Sakshi
Sakshi News home page

అమరావతి వచ్చిన వారికి మినహాయింపు

Published Wed, May 10 2017 2:09 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

Exemption for those who come to Amravati

ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలకు సవరణలు

సాక్షి, అమరావతి: రాజధాని మార్పిడిలో భాగంగా హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు 2017 సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభించింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ మార్గదర్శకాలను మార్చుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనగా సచివాలయ ఉద్యోగులెవరికీ ఈ ఏడాది సాధారణ బదిలీలు ఉండవు.

అలాగే హైదరాబాద్‌ నుంచి విభాగాధిపతుల కార్యాలయాలకు వచ్చిన వారిని కూడా ఈ ఏడాది బదిలీ చేయరు. ఇటీవలే హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement