రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం శ్రీకాళహస్తి-నడికుడి రైలు మార్గానికి నిధులు నిల్
కడప-బెంగళూరు రైలు మార్గానికి పైసా విదల్చని దుస్థితి తిరుపతికి ఒక్క కొత్త సర్వీసూ లేదు
అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే. రైల్వే బడ్జెట్ రూపకల్పన సమయంలో ఓ వైపు టీడీపీ నేతలు, మరో వైపు కమలనాథులు బీరాలు పలికారు, బడ్జెట్‌లో జిల్లాకు పెద్దపీట వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు జిల్లా ప్రజలను ఊరించి ఉసూరుమనిపించారు. రైల్వే బడ్జెట్ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జిల్లాకు అన్యాయం జరిగింది.
తిరుపతి గాంధీరోడ్డు: కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ఈ ఏడాది జిల్లాకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైలు మార్గాలను పూర్తి చేసేందుకు నిధులు మం జూరు చేస్తారని చెప్పుకొచ్చారు. పలమనేరు మీదుగా కుప్పం వరకు కొత్త రైలుమార్గం నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోద ముద్ర వేస్తుం దని బీరాలు పలికారు. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త సర్వీసులు మంజూరు చేస్తారని స్పష్టీకరించారు. చంద్రబాబు చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా రైల్వే బడ్జెట్లో ప్రకటించలేదు.
అన్యాయం ఇలా..
కడప- మదనపల్లె - బెంగళూరు రైలు మార్గా న్ని 2009-10 బడ్జెట్‌లో రైల్వేశాఖ మంజూరు చేసింది. రూ.2 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రైల్వే, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయిం చారు. ఈ ప్రాజెక్టులకు 2009-10 బడ్జెట్లో రైల్వే శాఖ రూ.40 కోట్లు కేటాయించింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.40 కోట్లు కేటాయించడంతో రూ.80 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2010 -11 బడ్జెట్‌లో రూ.56 కోట్లు, 2011-12 బడ్జెట్‌లో రూ.60 కోట్లను రైల్వేశాఖ కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయలేదు. 259 కిలోమీటర్ల పొడవు రైలుమార్గం నిర్మించాలి ఉండగా, ప్రస్తుతం 21 కిలోమీటర్ల పొడవున చేపట్టిన రైలుమార్గం పనులు కూడా నిలిచిపోయాయి. మంత్రి సురేష్‌ప్రభు ఈ రైలు మార్గానికి ఒక్క పైసా కూడా విదల్చలేదు.
శ్రీకాళహస్తి - నడికుడి రైలుమార్గాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని 2009-10 బడ్జెట్‌లో నిర్ణయించారు. రూ.1314 కోట్ల వ్యయంతో 309 కిలోమీటర్ల పొడువునా ఈరైలుమార్గం నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ రైలు మార్గానికి 2013-14 బడ్జెట్‌లో రూ.కోటి కేటాయించారు. ఆ నిధులు సర్వేకు కూడా సరిపోవు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆైరె లు మార్గానికి ఒక్కపైసా కూడా కేటాయించలేదు. ఇక ఈ రైలు మార్గం మరుగునపడినట్లే లెక్క.
ఊసే లేని కొత్త రైళ్లు..
కొత్త రైల్వే సర్వీసులను మంజూరు చేయడంలోను మంత్రి సురే్ ప్రభు జిల్లాకు తీరని అన్యాయం చేశారుతిరుపతి- వారణాసి, తిరుపతి- షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగితాలకే పరిమితమయ్యాయి. రేణిగుంటలోని కోచ్ రిపేరు వర్క్‌షాప్ సామర్థ్యాన్ని విస్తరించడంపై బడ్జెట్‌లో స్పష్టతలేదు. ఇంత అన్యాయం జరిగినా సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రజాప్రతినిధులు నోరుమెదపక పోవ డం గమనార్హం.
పార్లమెంట్‌లో పోరాడుతాం
శ్రీకాళహస్తి -నడికుడి మార్గానికి నిధులు కేటాయిస్తారనుకున్నాం. ఏపీకే న్యాయం జరగనప్పుడు జిల్లాకు ఏం చేస్తారు? తిరుపతి నుంచి షిర్డికి రైలు ఏర్పాటు చేస్తారని ఆశలున్నాయి. సూళ్ళూరుపేట సబ్ వే పూర్తి చేస్తారనుకున్నాం. ఆ ఊసే లేదు. వెంకటాచలం వద్ద ఓవర్‌బ్రిడ్జి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై బీజేపీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. దీనిపై పార్లమెంట్‌లో పోరాడుతాం.
- వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి ఎంపీ
జిల్లాకు మొండిచేయి
బీజేపీ రాష్ట్రానికి, జిల్లాకు మొండిచేయి చూపినా బాబు ఏమీ స్పందించరు. రాజధానికి 50 వేల ఎకరాల భూమి సేకరణకే బాబు నిమగ్నమయ్యారు. బాబు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి భూములు సేకరిస్తున్నారు. ఈ పనిలో పడి రాష్ట్రంలో ఏం జరుగుతోంది. బాబు పట్టించుకోవడం లేదు. రైల్వే బడ్జెట్ చూస్తే జిల్లాతో పాటు రాష్ట్రానికి కూడా ఏమీ దక్కకపోయినా రాష్ట్ర అధికార పార్టీ మాత్రం నోరు తెరవడంలేదు.
- పెద్దిరెడ్డి వెంకట మిథన్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు
బాబు మాటలు పెడచెవిన పెట్టారు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు మొండి చేయి చూపారు. ప్రధాని రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. బీజేపీకి పూర్తి సహకారం అందిస్తున్న చంద్రబాబు మాటలు కూడా పెడచెవిన పెట్టడం దారుణం. రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రాకు అన్యాయంపై ప్రధా న మంత్రితో చర్చిస్తాం. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికి రాష్ట్రాన్ని ముక్కలు చేసి అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసింది.
- గాలి ముద్దుకృష్ణమనాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
కరుణించని ప్రభు
Published Fri, Feb 27 2015 1:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement