మద్యం నకిలీ బ్రాండ్ టీడీపీ! | Fake alcohol brand TDP | Sakshi
Sakshi News home page

మద్యం నకిలీ బ్రాండ్ టీడీపీ!

Published Thu, Sep 11 2014 2:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

మద్యం నకిలీ బ్రాండ్ టీడీపీ! - Sakshi

మద్యం నకిలీ బ్రాండ్ టీడీపీ!

 పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా అధికార టీడీపీలోని వర్గపోరు నకిలీ మద్యం రాకెట్‌ను వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వం మనదే.. ప్రజాప్రతినిధులం మనమే.. ఇక మన జోలికి ఎవరొస్తారన్న ధీమాతో టీడీపీ నేతలు మద్యం రాకెట్‌కు ప్రాణప్రతిష్ఠ చేసి.. పొరుగునున్న ఒడిశా నుంచి నకిలీ మద్యాన్ని జిల్లాలోకి పారిస్తున్నారు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందా అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి ఆయుధంగా మారింది. అంతే ఎక్సైజ్ శాఖకు ఉప్పందించారు. ఆ వెంటనే ఎక్సైజ్ ఉన్నతాధికారులు వేట మొదలుపెట్టడంతో నకిలీ రాకెట్ బండారం బద్దలైంది.
 
 శ్రీకాకుళం క్రైం: ఒడిశాకు అనుకొని ఉన్న జిల్లా సరి హద్దు ప్రాం తాల్లో గత రెం డు రోజులుగా ఎక్సైజ్ ఉన్నతాధికారులు జరుపుతు న్న విస్తృత దాడుల్లో పట్టుబడిన నకిలీ మద్యం నిల్వలు టీడీపీకి చెందిన మద్యం వ్యాపారులవని విశ్వసనీయంగా తెలిసింది. ఆ పార్టీలో ఉన్న అంతర్గత పోరు కారణంగా నకిలీ మద్యం రాకెట్ విషయంవెలుగులోకి వచ్చినా, అధికార పార్టీకి చెం దిన వ్యవహారం కావడంతో అనుకున్న స్థాయిలో మద్యం నిల్వలను పట్టుకోలేకపోయారు. ఏదేమైనా నకిలీ రాకెట్‌ను ఛేదిం చడం మాత్రం టీడీపీ, అధికార వర్గాల్లో కల కలం సృష్టిస్తోంది.
 
 బార్ కోడింగ్ స్టిక్కర్లూ నకిలీవే
 ఇచ్ఛాపురం కేంద్రంగా కొన్నాళ్లుగా నకిలీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఇటీవల సర్కారు ప్రవేశపెట్టిన బార్ కోడింగ్ స్టిక్కర్లు సైతం నకిలీవి సృష్టించి అసలు ఏదో.. నకిలీ ఏదో పోల్చుకోలేని విధంగా చెలామణీ చేస్తున్నారు. ఒడిశాలో తయారవుతున్న నకిలీ మద్యాన్ని చీకటి దారుల్లో ఇచ్ఛాపురానికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ నేతలకు చెందిన, వారి సన్నిహితుల మద్యం షాపు ల్లో పెట్టి విక్రయాలు జరుపుతున్నారు. లాటరీ ద్వారా జరిపిన కేటాయింపుల్లో ఒడిశాకు చెందిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఇచ్ఛాపురంలో మద్యం దుకాణాలు వచ్చాయి.
 
 అనపర్తికి చెందిన మరో ఇద్దరికి కూడా ఇక్కడే షాపులు దక్కా యి. వీరంతా టీడీపీకి చెం దిన వారే కావడంతో అంద రూ కలిసి నకిలీ మద్యం దందా మొదలుపెట్టినట్లు తెలిసింది. కాగా గతంలో ఇచ్ఛాపురంలో కొన్ని దుకాణాలు అనపర్తికి చెందిన వేరొకరికి వచ్చాయి. ఈసారి ఆ వర్గానికి దుకాణాలు దక్కకపోవటంతో, ప్రస్తుతం దుకాణాలు కైవసం చేసుకున్న వర్గంపై కన్నేశారు. నకిలీ వ్యవహారం గురించి తెలుసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి ద్వారా జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేతను ఆశ్రయించి.. ఆయన ద్వారా ఎక్సైజ్ అధికారులకు ఉప్పందించడమే కా కుండా.. దాడులు జరిపి సరుకు స్వాధీనం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.
 
 పక్కా ప్రణాళికతో దాడులు
 ఈ సమాచారం అధారంగా ఎక్సైజ్ అధికారులు నకిలీ ముఠాపై నిఘా పెట్టారు. దాడులకుప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ విషయంలో విఫలమైతే ఆ కీలక నేత నుంచి ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో రెండు రోజులపాటు కసరత్తు చేసిన అనంతరమే మంగళవారం దాడులు జరిపారు. జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులందరూ ఉదయం నుంచి రాత్రి వరకు ఇచ్ఛాపురంలోనే తిష్ట వేసి దాడులను పర్యవేక్షించారు. ఎవరికీ అనుమానం రాకుండా జిల్లాలో ఉన్న ఎక్సైజ్ సిఐలు, ఎస్సైలతోపాటు సిబ్బందిని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలకు పురమాయించారు.
 
 నకిలీ రాకెట్‌పై దాడి చేసే సమయానికి వారందరూ ఇచ్ఛాపురం వచ్చేలా ప్రణాళిక రచించి అమలు చేశారు. దీనికి ముందు నకిలీ మద్యాన్ని నిల్వ ఉంచిన ఓ ఇటుక బట్టీ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఓ వ్యక్తిని పం పారు. ఆ స్ధలంలో లారీ వెళ్లిన ఆనవాళ్లు కని పించడంతో అక్కడే మద్యం నిల్వలు ఉన్న ట్లు నిర్ధారణకు వచ్చారు. ఎక్కడికి వెళుతున్న దీ చెప్పకుండా.. సిబ్బంది అందరి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించి ఒక్కసారిగా ఇటుకబట్టీ వద్దకు తీసుకువెళ్లి దాడులు చేపట్టారు. ఇంత చేసినా నకిలీ రాకెట్ నిర్వహకులకు విషయం తెలిసిపోయింది. దాంతో వారు చివరి క్షణంలో చాలా స్టాక్‌ను వేరే చోటుకు తరలించేసినట్లు తెలుస్తోంది. దీంతో పది కేసుల ఓసీ నిబ్ బాటిళ్లు మాత్రమే దొరికాయి.
 
 డీసీని ఇంటికి పిలిపించిన ప్రజాప్రతినిధి
 దాడుల్లో పట్టుబడిన నలుగురు మద్యం దుకాణాల యాజమానులను తప్పించే ప్ర యత్నంలో ఓ ప్రజాప్రతినిధి ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్‌ను తన ఇంటికి పిలిపించి,  40 నిమిషాలు చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ నలుగురు వ్యక్తులు తమకు చెం దిన వారేనని ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని కోరినట్టు తెలుస్తొంది. అయితే ఈ విషయంలో తన నిస్సహాయతను డీసీ ఆయనకు వివరించారు. అయితే పట్టుకున్నది ఒడిశా మద్యం అయినందున ఒడిశా అధికారులకు కేసును బదలాయిస్తే అక్కడ తాము చూసుకుంటామని ఆ ప్రజాప్రతినిధి సలహా ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి రెండు వర్గాల టీడీపీ నేతల ఒత్తిళ్ల మధ్య ఈ కేసును ఎలా డీల్ చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 బరంపురం ఎక్సైజ్ అధికారులకు అప్పగించాం
 దాడుల్లో దొరికిన మద్యం బరంపురానికి చెందినది కావడంతో కేసును బరంపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్‌కు అప్పగించామని డీసీ నాగలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదన్నారు. ఈ దాడుల్లో అనుమానితులుగా పట్టుకున్న వారి పేర్లను బరంపురం ఎక్సైజ్ అధికారులకు తెలియజేశామని, ఇక్కడ కూడా విచారణ జరుపుతామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement