ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తితోపాటు అతనికి సహకరించిన లోమడ సుబ్బారెడ్డిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా సుబ్బారెడ్డికి వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదన్న కారణంతో వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తిరిగి ఎర్రగుంట్లకు తీసుకెళ్లారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి వద్ద సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరు అక్కడే ఉండి స్వామీజీని నమ్ముకుంటే ఎలాంటి సమస్యలున్నా తీరుతాయని, పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందని, స్వామి వద్దకు వస్తే దెయ్యాలు పోతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఇటీవల అయ్యప్పస్వామి దేవాలయంలో జరిగిన లక్షార్చన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది స్వామీజీ వేషంలో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తిని చూసి ప్రలోభాలకు గురయ్యారు. స్వామీజీ వేషంలో ఉన్న వ్యక్తిని కోర్టు తిరిగి పోలీసులకు అప్పగించడంతో పోలీసులకు ముప్పుతిప్పలు తప్పలేదు. అతన్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టుకోవడం కష్టంగా మారింది. ఏ క్షణంలో అతను ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులు కాపలాగా సిబ్బందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో కడప రిమ్స్‌కు తరలించినా అక్కడ వైద్యులు అందుబాటులో ఉండకపోవచ్చని పోలీసులు శుక్రవారం వరకు స్టేషన్‌లోనే ఉంచుకునే అవకాశం ఉంది.
నకిలీ బాబా కోర్టుకు హాజరు
Published Thu, Dec 25 2014 2:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement