
ప్రముఖ సంగీత విద్వాంసుడు నేదునూరి కన్నుమూత
విశాఖ : ప్రముఖ సంగీత విద్వాంసుడు , సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నేదునూరి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1927లో జన్మించిన నేదునూరి తిరుమల తిరుపతి దేవస్థానం, కంచికామకోటి ఆస్థాన విద్యాంసుడిగా పనిచేశారు. అన్నమయ్య కృతులకు స్వరకల్పన చేశారు.