సాధికారత ఉత్తుత్తిదే!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రైతు సాధికార సదస్సులు ఉత్తుత్తి సదస్సులుగా మారాయి. తొలిరోజైన గురువారం జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో ఎక్కడా స్పష్టత లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణి అవలంబించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి రోజున 227 గ్రామాల్లో రైతు సాధికార సదస్సులు జరిగాయి. కొన్ని గ్రామాల్లో రాష్ర్టమంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు.
రుణమాఫీ జాబితాల్లో తప్పులు, ఎక్కువ రుణం ఉన్నవారికి తక్కువ మాఫీ చేసేందుకు అనుమతులు ఉన్నట్టు ధ్రువ పత్రాలు మంజూరు చేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 20 వేలు వరకు రుణం పొందిన రైతులకు కేవలం రూ. 12,500 మాత్రమే మాఫీ వర్తించడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యూరుయి. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులను రైతులు నిలదీయంతో వారితోపాటు అధికారులూ ఇబ్బంది పడ్డారు. ఆధికార పార్టీ నాయకుల హడావుడి అన్ని గ్రామాల్లోనూ కనిపించింది. నాయకుల ఉపన్యాసాలు, రుణ మాఫీ ధ్రువ పత్రాల పంపిణీ తప్పా ఇతర ఏ ప్రయోజనం లేకపోవడంతో రైతులు అసంతృప్తికి గురయ్యూరు.
డ్వాక్రా మహిళల రుణమాఫీపై నాయకులు, అధికారులు ఎక్కడా ప్రస్తావించలే దు.
గ్రూపులోని ఒక్కో మహిళకు రూ. పది వేలు వంతున ప్రొ త్సాహం అందజేస్తారనే ఆశతో సదస్సుల వద్దకు వచ్చిన వారికి నిరాశే మిగిలింది. రాజాంలోని వీఆర్ అగ్రహారంలో 129 మంది రెతులు ఏపీజీవీబీలో రుణం పొం దగా వారిలో ఒక్కరికి మాత్రమే మాఫీ జరిగింది. మిగిలిన 128 మంది రైతుల పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవు. అధికారులు జాబితా చదివి వినిపించడం..వారి పేర్లు లేకపోవడంతో రైతులు అందోళన వ్యక్తం చేశారు. పాలకొండ మండలంలోని వెలగవాడలో అధికారులను రైతులు నిలదీశారు. రుణమాఫీలో అవకతవకలు ఉండడంతో పలుసార్లు జాబితాలు, ఆధార్ నంబర్లు అధికారులు అడగడంతో అందజేసినా.. జాబితాల్లో స్పష్టత లేదని రైతులు మండిపడ్డారు. అలాగే యరకరావుపేటలో కొత్త పింఛన్ల మంజూరులో అవకతవకలు ఉన్నాయని అక్కడ వృద్ధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పలాసలోని బాడంగి గ్రామంలో రైతులు ఆర్.రామకృష్ణ, జగన్నాథరావులకు అన్ని అర్హతలున్నా రుణమాఫీ వర్తించలేదని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో రైతు కృష్టారావు మాట్లాడుతూ ఎన్నికల్లో అన్నిరకాల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రూ. 50 వేలు లోపు రైతు రుణాలనే మాఫీ చేస్తామంటూన్నారని..ఇది ప్రజలను మోసం చేయడమేనని అధికారులను నిలదీశారు. కొత్తూరు మండలంలో జరిగిన సాధికర సదస్సులో కూడా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.