Loan waiver list
-
రుణమాఫీ లిస్ట్‌లో ఓ ఎమ్మెల్యే పేరు!
సాక్షి, ముంబై : రైతుల రుణమాఫీ వ్యవహారం మహారాష్ట్రంలో రాజకీయంగా పెను కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రైతుల డిమాండ్ల కోసం సొంత నేత యశ్వంత్ సిన్హా దీక్ష చేపట్టడం, బీజేపీ ప్రభుత్వ తీరు నచ్చక మరో నేత ఎంపీ అయిన నానా పటోలే ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఈ అంశంపై అధికారులు ఎంత చిత్తశుద్ధితో తెలియజేసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ రైతుల పేర్ల జాబితాలో శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ పేరు కనిపించటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొల్హాపూర్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ తరపున ఆయన రుణం కోసం దరఖాస్తు చేసినట్లు.. ఆయనకు 25 వేల రూపాయలు మంజూరు అయినట్లు ఉంది. కరువు ప్రాంత రైతులకు అందించిన రుణమాఫీ కింద ఆయనకు రుణం కూడా రద్దు అయ్యింది. దీనిపై స్పందించిన కొల్హాపూర్ ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ తాను ఎలాంటి రుణానికి దరఖాస్తు చేసుకోలేదని చెప్పటం విశేషం.‘‘ఆ వార్త మీడియాలోనే చూసి నేను తెలుసుకున్నా. షాక్‌కు గురయ్యాను. నేను ఎక్కడా నా పేరును నమోదు చేసుకోలేదు. ఆ రుణమాఫీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను కోరాను’’ అని ఆయన చెప్పారు. కాగా, సుమారు 34 వేల కోట్ల రుణమాఫీ విషయంలో తప్పులు దొర్లిన మాట వాస్తవమేనని.. త్వరలో వాటిని సరిదిద్దుకుంటామని స్వయానా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రుణమాఫీ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయం పరిధిలో ఉండటంతో ప్రతిపక్షాలు ఫడ్నవిస్‌పై మండిపడుతున్నాయి. శివ సేన ఎమ్మెల్యే ప్రకాశ్ అబిట్కర్ -
మూడో విడత నిరాశే !
ఆరుగాలం కష్టపడడమే తప్ప.. ఎవరికీ హాని తలపెట్టడం తెలియని గిరిజన రైతులతో సర్కార్ ఆటలాడుతోంది. ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రుణమాఫీలో ప్రభుత్వం మూడో విడతలోనూ గిరిజన రైతులకు మొండిచేయి చూపడంతో లబోదిబో మంటున్నారు. మొదటి, రెండో విడతలో ఎలాగు రుణమాఫీ జాబితాలో పేర్లు లేవు. కనీసం మూడో విడతలోనైనా పేర్లు ఉంటాయనుకుంటే అది కూడా నిరాశేమిగిలిందని గిరిపుత్రులు వాపోతున్నారు. - ఉద్యానవనాల పేరుతో తీసుకున్న రుణాలకు మాఫీ లేదు - ఆందోళనలో గిరిజన రైతులు సీతంపేట: రుణమాఫీపై ఆశలు పెట్టుకున్న గిరిపుత్రులు ఇటీవల వచ్చిన జాబితాను చూసి నివ్వెరపోయారు. రెండో విడతలో కేవలం 24 మంది రైతుల పేర్లు మాత్రమే రుణమాఫీలో ఉండడంతో అప్పట్లో కంగుతిన్నారు. మూడో విడత కోసం ఏదురు చూసి గిరిజన రైతులంతా ఆందోళన చెందుతున్నారు. సీతంపేట మండలంలో పదివేల మంది రైతులు ఉన్నారు. వీరిలో వివిధ పంటల రుణాల కింద సుమారు 5,600 మంది రుణాలు తీసుకున్నారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు, ఎస్వీజీబీ, ఎస్బీఐ, కుశిమి ఇండియన్ బ్యాంకులల్లో వీరంతా రుణాలు పొందారు. మొదటి విడతలో కేవలం 445 మందికి రుణమాఫీ అయ్యింది. అదికూడా ఒకొక్కరికీ రూ. 10 వేల లోపే. రెండోవిడతలో మరో 24 మందికి మాత్రమే మాఫీ వర్తించింది. తాము ఖరీఫ్ రుణం 2012లో తీసుకున్నప్పటకీ ఇప్పటి వరకు రూపాయి కూడా మాఫీ కాలేదని అక్కన్నగూడకు చెందిన సుక్కయ్య, జమ్మయ్య, లక్కమ్మ, సరస్వతి సవరబోయడు, సవర ముంజు, తిక్కమై తదితరులు వాపోతున్నారు. కుశిమి ఇండియన్ బ్యాంకు ద్వారా అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ రుణమాఫీ కాకపోవడం గమనార్హం. ఉద్యానవన పంటల రైతులకు మాఫీ లేనట్టేనా? గిరిజన ప్రాంతాల్లో ఉద్యానవన రైతులకు రుణమాఫీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఏజెన్సీలో ఎక్కువగా కొండపోడు పంటలే ఆధారంగా జీడిమామిడి, పసుపు, అల్లం, కంది, అరటి తదితర పంటలు పండిస్తారు. రుణం తీసుకున్నవారంతా చిన్నరైతులే. ఒక్కో గిరిజన రైతు రూ.30 వేల లోపే రుణం తీసుకున్నారు. ఇంత తక్కువ మొత్తాల్లో రుణాలు తీసుకున్నా మాఫీ కాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి చెందుతున్నారు. శంబాం, కోడిశ, కుశిమి, కడగండి, కుడ్డపల్లి, కొండాడ, టిటుకుపాయి, మండ, కిల్లాడ, పెదపొల్ల పంచాయతీల పరిధిలో రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈ విషయాన్ని వ్యవసాయాధికారి జ్ఞానేంద్రమణి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా మూడో విడతలో ఎవరి పేర్లూ రుణమాఫీ జాబితాలో లేవని స్పష్టం చేశారు. ఉద్యానవన పంటలకు మాఫీ వస్తే చాలా మందికి వర్తిస్తోందన్నారు. నిరాశే మిగిలింది గిరిజనులకు నిరాశేమిగిలింది. రెండు విడతల్లో రుణమాఫీ జరగలేదు. కనీసం మూడో విడతోనైనా జరుగుతుందని ఎదురు చూసిన రైతాంగానికి న్యాయం జరగలేదు. కొండపోడు పట్టాలకు రుణమాపీ తప్పనిసరిగా చేయాలి. - సవరగోపాలు, సర్పంచ్, సోమగండి ఖరీఫ్ సాగేలా చేయాలి రుణమాఫీ జరగకపోవడంతో ప్రస్తుతం వరిపంటను ఎలా పండించాలి. మిగతా పంటలు కూడా పండించలేని పరిస్థితి ఉంది. బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి మొగ్గు చూపడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలి. - సవర బెన్నడు, అక్కన్నగూడ, గిరిజన రైతు -
'ఏపీలో 330 మండలాల్లో వర్షపాతం తక్కువ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 330 మండలాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోస్తా జిల్లాలో వర్షపాతం మెరుగ్గా ఉందని, రాయలసీమలో తక్కువగా ఉందన్నారు. కోస్తాలో వరి పండించే రైతులు 1001, 1010 రకాల విత్తనాలు వేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 5 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో రుణమాఫీ జాబితా ప్రకటన వెల్లడిస్తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు పేర్కొన్నారు. -
రుణమాఫీ ఒక మాయ
రుణమాఫీ ఒక మాయ అని తేలిపోయింది. మూడు విడతలుగా విడుదలైన జాబితాలో తప్పులు దొర్లడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆధార్ ఫీడింగ్ లోపాలతో అనేక మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. అర్హత ఉన్న రైతులను కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉదయగిరికి చెందిన చిన్నారెడ్డికి ఎనిమిదెకరాల పొలం ఉంది. పంటల సాగు కోసం రూ.3 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో రూ.1.50 లక్షల రుణం మాఫీ అయిందని వెబ్సైట్లో పేరుంది. అయితే రైతు సాధికారత సదస్సులో రైతులకు ఇచ్చే పత్రాల జాబితాలో చిన్నారెడ్డి పేరు కనిపించలేదు. మండిపడ్డ రైతాంగం రుణమాఫీ జాబితా తప్పుల తడకగా ఉండడంతో జిల్లాలో సోమవారం జరిగిన రైతు సాధికరత సదస్సులు, బ్యాంకుల వద్ద బాధితులు నిరసనలు తెలియజేశారు. రైతు సాధికారత సదస్సు ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. ‘మాయ మాటలు చెప్పి మోసం చేయవద్దు. ముందుగా గ్రామం విడిచి వెళ్లండి’ అంటూ అధికారులపై తిరగబడ్డారు. రైతులు నిలదీయడంతో బ్యాంకర్లు, అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రైతులు అధికారులను నిలదీయడంతో జిల్లాలో జరిగిన రైతు సాధికార సదస్సులు రసాభాసగా మారాయి. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రైతురుణమాఫీ ఒకటి. ఆ హామీని అమలు చేయాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా ప్రకటన చేశారు. అయితే అమలులో చంద్రబాబు నైజాన్ని ప్రదర్శించారనే ప్రచారం సాగుతోంది. గందరగోళంగా జాబితా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికి మూడు జాబితాలు విడుదల చేసింది. మొదటి జాబితాలో 1.85 లక్షల మందిని తేల్చారు. వీరికి 20 శాతం చొప్పున రూ.206.22 కోట్లు జమచేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నగదును రైతుల ఖాతాల్లో జమచేయలేదు. సదస్సులో రైతులకు పత్రాలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా మరో రెండు జాబితాలు విడుదల చేసినప్పటికీ వాటిని బ్యాంకర్లు, అధికారులు బయటపెట్టలేదు. మొదటి జాబితానే గందరగోళంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొదటి జాబితాలో వేలాది మంది అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. అందుకు నిరసనగా మనోబోలులో జరిగిన రైతు సాధికారత సదస్సును అడ్డుకున్నారు. మాఫీ జాబితాలో కేవలం వందలాది మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయని రైతులు అధికారులను నిలదీశారు. వెయ్యి మందికి పైగా అర్హులు ఉంటే మొక్కుబడిగా కొంతమంది పేర్లు మాత్రమే ఉండటమేంటని ప్రశ్నించారు. దీంతో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన రైతులు ఫ్లెక్సీలు, కరపత్రాలను చించివేసి తగులబెట్టారు. కుర్చీలు పడేసి, షామియానా కిందకు తోసేసి సదస్సును అడ్డుకున్నారు. అదే విధంగా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అదేవిధంగా తిరుమూరు, వాకాడు, నెల్లిపూడి, దుగ్గరాజుపట్నం గ్రామాల్లోనూ రైతులు ఆందోళన చేశారు. సీతారాంపురం మండల పరిధిలో గతంలో జరిగిన ఆధార్ ఫీడింగ్‌లో పొరబాట్లు చోటు చేసుకోవడంతో రంగనాయుడుపల్లి, నెమళ్లదిన్నె, బెడుసుపల్లి, సింగారెడ్డిపల్లి, సంగసానిపల్లి, గంగవరం గ్రామాలకు చెందిన వందలాది మంది అర్హులైన రైతులను అనర్హులుగా గుర్తించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండాపురం మండలం ఎర్రబల్లి యూనియన్ బ్యాంక్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను మోసం చేశారంటూ మండిపడ్డారు. -
తిక్కముదిరింది ... లెక్కే లేదంది
‘శిష్యా ఏమి చేస్తున్నావ్ ’ అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నానని గురువుకు సమాధానమిచ్చాడట వెనుకటికో శిష్యుడు. తప్పులు దిద్దుకోవడం మంచిదే కానీ చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు లేవు కాబట్టే ఈ సామెత పుట్టుకొచ్చినట్టుంది. ఈ చందంగానే చంద్రబాబు రుణమాఫీ తయారైంది. ‘నేనే మోనార్క్‌ని ... ఆర్థిక శాస్త్రం అవపోసన పట్టేశాను ... రుణమాఫీ అమలు నాకే సాధ్యమంటూ’ డాంబికాలు పలికి ఆచరణలో బోర్లా పడ్డారు. అయినా నేనే గెలిచానంటూ రెండు వేళ్లు విజయ సంకేతంగా గాలిలో ఊపుతున్న నారా నైజం అర్థం కాక రుణ మాఫీ బాధితులు జుత్తు పీక్కుంటున్నారు. హైటెక్ జాబితాల్లో ఈ తప్పులేమిటని ప్రశ్నిస్తున్నారు రైతన్నలు. ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసిన మొదటి విడత రుణమాఫీ జాబితాలు తప్పుల తడకగా తయారవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రుణం పొందిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం అమల్లో ఉన్న స్కేలు ఆఫ్ ఫైనాన్స్‌ను (ఎస్.ఒ.ఎఫ్) ప్రాతిపదికగా తీసుకోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశంలో ప్రకటించిన విషయాలకు ఆచరణలో రుణమాఫీ జాబితాల్లో పేర్కొన్న అంశాలకు అసలు పొంతనే లేకుండా పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీడీసీసీ బ్యాంకు ఆర్థిక సాయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ద్వారా వ్యవసాయ రుణాలు పొందిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రధానంగా కందుకూరు ప్రాంతంలోని ఐదు సొసైటీల రైతులను రాయలసీమ జిల్లాలకు చెందిన వారుగా జాబితాలో పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వివిధ పంటల సాగుకు అక్కడి జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించిన ఎఫ్.ఒ.ఎస్.కు జిల్లాలోని జిల్లా కమిటీ ఆమోదించిన స్కేలు ఆఫ్ ఫైనాన్స్‌కు తేడా ఉంది. ఇతర జిల్లాలకంటే జిల్లాలో పంట సాగుకే అధిక వ్యయమవుతోంది. కందుకూరు ప్రాంతంలోని ఐదు సొసైటీల్లో 773 మంది రైతులను వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులుగా జాబితాల్లో పేర్కొనడంతో ఈ రైతులందరూ ఆయా జిల్లాల స్కేలు ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా రుణమాఫీకి అర్హులు కావడంతో రూ.1.53 కోట్ల రుణాల మాఫీని నష్టపోతున్నారు. - పోకూరు సొసైటీలో 210 మంది రైతులను అనంతపురం జిల్లాకు చెందిన వారిగా, 9 మంది రైతులను వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారిగా రుణమాఫీ జాబితాలో పేర్కొన్నారు. - యర్రారెడ్డిపాలెం సొసైటీలో 100 మంది రైతులను చిత్తూరు జిల్లావాసులుగా జాబితాలో చూపించారు. - మోపాడు సొసైటీలో 109 మంది రైతులను కర్నూలు జిల్లా రైతులుగా చూపించారు. తూనుగుంట సొసైటీలో 58 మంది, ధారకానిపాడు సొసైటీలో 287 మందిని చిత్తూరు జిల్లా రైతులుగా పేర్కొన్నారు. ఈ జాబితాలను చూసిన రైతులు విస్తుపోతున్నారు. ఈ విషయమై ఇక్కడి జిల్లా రైతులను రాయలసీమ జిల్లా రైతులుగా రుణమాఫీ జాబితాల్లో పేర్కొన్న విషయమై పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదరమోహన్ బాబును వివరణ కోరగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలిసి రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించి సవరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రుణమాఫీ జాబితాపై రైతుల ఆగ్రహం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులో రైతులు నిరసనకు దిగారు. రుణమాఫీ జాబితాలో అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపించారు. బ్యాంకర్ల తీరును నిరసిస్తూ వారిని నిర్బంధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ జాబితాను విడుదల సంగతి తెలిసిందే. చాలామంది రైతులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 50 వేల రూపాయలకు లోపు రుణం వారికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశారని వార్తలు వచ్చాయి. -
సాధికారత ఉత్తుత్తిదే!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రైతు సాధికార సదస్సులు ఉత్తుత్తి సదస్సులుగా మారాయి. తొలిరోజైన గురువారం జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో ఎక్కడా స్పష్టత లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణి అవలంబించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి రోజున 227 గ్రామాల్లో రైతు సాధికార సదస్సులు జరిగాయి. కొన్ని గ్రామాల్లో రాష్ర్టమంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు. రుణమాఫీ జాబితాల్లో తప్పులు, ఎక్కువ రుణం ఉన్నవారికి తక్కువ మాఫీ చేసేందుకు అనుమతులు ఉన్నట్టు ధ్రువ పత్రాలు మంజూరు చేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 20 వేలు వరకు రుణం పొందిన రైతులకు కేవలం రూ. 12,500 మాత్రమే మాఫీ వర్తించడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యూరుయి. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులను రైతులు నిలదీయంతో వారితోపాటు అధికారులూ ఇబ్బంది పడ్డారు. ఆధికార పార్టీ నాయకుల హడావుడి అన్ని గ్రామాల్లోనూ కనిపించింది. నాయకుల ఉపన్యాసాలు, రుణ మాఫీ ధ్రువ పత్రాల పంపిణీ తప్పా ఇతర ఏ ప్రయోజనం లేకపోవడంతో రైతులు అసంతృప్తికి గురయ్యూరు. డ్వాక్రా మహిళల రుణమాఫీపై నాయకులు, అధికారులు ఎక్కడా ప్రస్తావించలే దు. గ్రూపులోని ఒక్కో మహిళకు రూ. పది వేలు వంతున ప్రొ త్సాహం అందజేస్తారనే ఆశతో సదస్సుల వద్దకు వచ్చిన వారికి నిరాశే మిగిలింది. రాజాంలోని వీఆర్ అగ్రహారంలో 129 మంది రెతులు ఏపీజీవీబీలో రుణం పొం దగా వారిలో ఒక్కరికి మాత్రమే మాఫీ జరిగింది. మిగిలిన 128 మంది రైతుల పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవు. అధికారులు జాబితా చదివి వినిపించడం..వారి పేర్లు లేకపోవడంతో రైతులు అందోళన వ్యక్తం చేశారు. పాలకొండ మండలంలోని వెలగవాడలో అధికారులను రైతులు నిలదీశారు. రుణమాఫీలో అవకతవకలు ఉండడంతో పలుసార్లు జాబితాలు, ఆధార్ నంబర్లు అధికారులు అడగడంతో అందజేసినా.. జాబితాల్లో స్పష్టత లేదని రైతులు మండిపడ్డారు. అలాగే యరకరావుపేటలో కొత్త పింఛన్ల మంజూరులో అవకతవకలు ఉన్నాయని అక్కడ వృద్ధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలాసలోని బాడంగి గ్రామంలో రైతులు ఆర్.రామకృష్ణ, జగన్నాథరావులకు అన్ని అర్హతలున్నా రుణమాఫీ వర్తించలేదని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో రైతు కృష్టారావు మాట్లాడుతూ ఎన్నికల్లో అన్నిరకాల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రూ. 50 వేలు లోపు రైతు రుణాలనే మాఫీ చేస్తామంటూన్నారని..ఇది ప్రజలను మోసం చేయడమేనని అధికారులను నిలదీశారు. కొత్తూరు మండలంలో జరిగిన సాధికర సదస్సులో కూడా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. -
మరో పన్నాగం!
సాక్షిప్రతినిధి, అనంతపురం : రుణ మాఫీపై ఇన్నాళ్లూ రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం తీరా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే ముందు మరో పన్నాగం పన్నింది. సీఎం చేసిన విధాన ప్రకటనలా కాకుండా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం మాఫీ చేసేందుకు సిద్ధమైంది. దీంతో చాలామంది రైతులు కచ్చితంగా బ్యాంకులకు నగదు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాల నుంచి రూ.6,817 కోట్ల రుణాలను ‘అనంత’ రైతులు తీసుకున్నారు. రుణమాఫీ అమలుకు సర్కారు విధించిన నిబంధనల ప్రకారం అధికారులు జల్లెడ పట్టి 8.68 లక్షల ఖాతాలు అర్హమైనవిగా తేల్చి నివేదికలు పంపారు. ప్రస్తుతం రుణమాఫీ జాబితా ఎన్నో చిక్కుముళ్ల మధ్య ‘ఆన్లైన్’లో రైతులకు అందుబాటులోకి వచ్చింది. బ్యాంకుల వారీగా జాబితాలు వెబ్సైట్లో పొందుపరచడంతో రైతులకు అందుబాటులో జాబితాలను బ్యాంకర్లు ఇంకా డిస్ప్లే చేయలేదు. అయితే ఇప్పుడు బ్యాంకర్ల నుంచి కొత్త మాట వినిపిస్తోంది. రైతులు తీసుకున్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా ‘స్కేల్ ఆఫ్ పైనాన్స్’ ప్రకారం రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను బ్యాంకర్లకు సూచించినట్లు తెలుస్తోంది. రైతులకు తెలీకుండానే వారి నుంచి నగదును రాబట్టే మోసపూరిత ప్రక్రియ ఇది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం రుణమాఫీ జరిగితే జిల్లాలోని రైతులకు మరింత అన్యాయం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఖాతాలు అర్హమైనవిగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే, అందులో 22.79 లక్షల మాత్రమే అర్హత సాధించాయని తెలిపారు. అంటే ప్రతిపాదిత ఖాతాల్లో దాదాపు 50 శాతం ఖాతాలు తొలివిడత మాఫీ జాబితాలోకి చేరలేదు. ఈ లెక్కన ‘అనంత’ నుంచి అధికారులు పంపిన 8.68 లక్షల్లో కూడా దాదాపు సగం ఖాతాలు జాబితాలో ఉండవకపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 4-5లక్షల ఖాతాలు జాబితాలో ఉండొచ్చు. వీరిలో 50 వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1.60 లక్షల నుంచి 2లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మొత్తానికి ఏడాదిన్నరగా వడ్డీ డబ్బును ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పష్టత రాలేదు. దీంతో పాటు స్కేల్‌ఆఫ్‌ఫైనాన్స్ ప్రకారం అమలు చేస్తే తక్కిన డబ్బును రైతులు చెల్లిస్తేనే రుణవిముక్తులై కొత్త రుణాలు తీసుకునేందుకు అర్హత సాధిస్తారు? లేదంటే బకాయిదారుల జాబితాలోనే ఉంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే : శివశంకర్ అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.12 వేల రుణాన్ని బ్యాంకర్లు ఇవ్వాలి. అయితే బ్యాంకుకు, తనకూ ఉన్న సత్సంంబంధాలు, లావాదేవీలను బట్టి మూడెకరాలకు రూ.50 వేల రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ.50 వేల రుణం మాఫీ కావాలి. అయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం శివ శంకర్ 3 ఎకరాలకు 36 వేల రూపాయలు మాత్రమే రుణానికి అర్హుడు. దీంతో ప్రభుత్వం 36 వేల రూపాయలను మాత్రమే మాఫీ చేయనుంది. తక్కిన 14 వేల రూపాయలను బ్యాంకుకు చెల్లించి తీరాల్సిందే! పైగా మొత్తం 50 వేల రూ పాయలకు ఏడాదిన్నరగా 14 శాతం వడ్డీ పడుతుంది. దీన్ని అదనంగా చెల్లించాలి. బంగారు రుణాలదీ మరీ చిత్రమైన సమస్య మూడో ప్రాధాన్యత కింద బంగారు రుణాలను మాఫీ చేస్తానని సీఎం ప్రకటించారు. బంగారు తాకట్టుపెట్టి రైతులు రుణాలు తీసుకున్నపుడు 5 ఎకరాలుంటే 3-6 లక్షల రూపాయల అప్పు కూడా తెచ్చుకున్నారు. కానీ వీరికి స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 60 వేల రూపాయలు మాత్రమే అర్హత వస్తుంది. 50 వేల రూపాయల పైన ఉన్న రుణాలకు ఇప్పుడు 20 శాతం చెల్లించి, తక్కిన మొత్తాన్ని 4 విడత్లో చెల్లిస్తామన్నారు. ఈ లెక్కన కూడా ప్రభుత్వం ఇచ్చే పత్రాల్లో విధాన ప్రకటన చేసిన సమయంలో ప్రకటించిన విధంగా అప్పును పొందుపరుస్తారా? లేదంటే స్కేల్‌ఆఫ్‌ఫైనాన్స్ ప్రకారం అప్పలపట్టీ చూపుతారా? అనేది తేలాల్సి ఉంది. ఇదే జరిగితే ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానాలతో రైతులు, బ్యాంకర్లకు మధ్య కొత్త చిక్కులు తలెత్తి వారి మధ్య వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. ‘మేమే కచ్చితంగానే చేశాం. బ్యాంకర్లే లేనిపోని సాకులు చెబుతున్నారు’ అని రైతుల ముందు బ్యాంకర్లను దోషులుగా చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఉపక్రమిస్తున్నట్లు చర్యలను చూస్తే స్పష్టమవుతోంది. -
రుణమాఫీ జాబితా అస్పష్టం
-
రుణమాఫీ జాబితా అస్పష్టం
- ఆదివారం రాత్రి బ్యాంకులకు సమాచారం - పబ్లిక్ వెబ్సైట్లో అరకొర వివరాలు - నేడు తెలిసే అవకాశం సాక్షి, చిత్తూరు: రైతుల రుణమాఫీ మొదటి విడత జాబితా బ్యాంకులకు ప్రభుత్వం అందించింది. ఆ మేరకు ఆదివారం సాయంత్రం బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. ఆదివారం బ్యాం కులకు సెలవు కావడంతో అధికారులు జాబితాలను చూసే అవకాశం లేదు. సోమవారం రుణ మాఫీ జాబితాలను వెల్లడించనున్నారు. మొదటి విడతలో జిల్లాలో ఎంతమంది రైతులకు మాఫీ వర్తింప చేశారనే విషయంలో స్పష్టత లేదు. కాగా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని లీడ్ బ్యాంకు అధికారుల పేర్కొంటున్నారు. ఇక పబ్లిక్ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే జాబితా, సమాచారం వి వరాలు కనిపించడం లేదు. రైతు ఆధార్ నంబర్, రేషన్‌కార్డు, రుణ అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ రైతు వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొంతమంది రైతులు వివరాలను పబ్లిక్ వెబ్సైట్లో ఎంటర్ చేసి చూడగా రుణమాఫీ అయిందీ, లేనిదీ స్పష్టంగా చూపడంలేదు. వివరాలు పూర్తిగా అందలేదని సమాచారం వస్తోంది. జిల్లాలో 1.98 లక్షల మంది రైతుల కు మొదటి విడత రుణమాఫీ ఉంటుందని బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. తప్పించి స్పష్టంగా రుణమాఫీ ఎంతమందికి వచ్చిందనే విషయంలో స్పష్టత లేదు. ఇక జిల్లాలో సీఎం చంద్రబాబు హామీ మేరకు 2013 డిసెంబర్ 31 నాటికి 8,70,321 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. అధికారం చేపట్టిన తరువాత ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు ఒక్కోరైతు కుటుంబానికి కేవలం 1.5 లక్షలు రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తానని మాటమార్చారు. ఈ మేరకు ఆగస్టు రెండున మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుపుస్తకం, పంటల సాగు తదితర వివరాలు పరిగణలోకి తీసుకొని లబ్ధిదారుల జాబితా రూపొందించాలని ఆదేశించారు. 30 అంశాలను ప్రాతిపదికగా బ్యాంకర్లు జాబితాను రూపొందించారు. స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం తీసుకోని రైతులను అనర్హులుగా ప్రకటించాలని సూచించారు. మొత్తంగా జిల్లాలో 4.73 లక్షలమంది మాత్రమే రుణమాఫీకి అర్హులుగా తేల్చారు. ఈ లెక్కన జిల్లాలో సగంమంది రైతులను రుణమాఫీ నుంచి తప్పించారు. ఆ తరువాత కూడా జాబితాలోనూ కోత పెట్టింది ప్రభుత్వం. తొలుత 50 వేలలోపు రుణం తీసుకున్న వారికే మాఫీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ మార్గదర్శకాల కనుగుణంగా జిల్లాలో తొలివిడతలో కేవలం 1.98 లక్షల మంది మాత్రమే రుణమాఫీ జాబితాలో ఉండే అవకాశముందని బ్యాంకు అధికారులు అంచనా వేశారు. రైతుసాధికార సంస్థలో కేవలం 5 వేలకోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యంలో రూ.50 వేల ప్రకారం కూడా ప్రభుత్వం రైతు ఖాతాల్లో డబ్బు జమవేసే పరిస్థితి లేదనేది బ్యాంకర్ల అభిప్రాయం. మరోవైపు వడ్డీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. మొత్తం 939 కోట్ల మేర వడ్డీలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు నిధులు వడ్డీలకు కూడా జమయ్యే పరిస్థితి కానరావడంలేదు. -
రుణమాఫీ జాబితాలు. . ఆన్లైన్లో
- జాబితాల కోసం రైతుల ఉరుకులు, పరుగులు - ఎంతమంది పేర్లున్నాయనేది చెప్పలేకపోతున్న బ్యాంకర్లు మచిలీపట్నం : రుణమాఫీ జాబితాలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఆదివారం ఈ వివరాలను ఆన్లైన్లో ఉంచింది. ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ జాబితాలను ఆరో తేదీన ప్రకటిస్తామని చెప్పగా.. ఒకరోజు ఆలస్యంగా ఈ జాబితాలను ఆన్లైన్లో ఉంచారు. ఆదివారం సాయంత్రం నుంచి పలువురు రైతులు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు నెట్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాలు,బ్యాంకులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. గ్రామీణ ప్రాంతంలో నెట్ సెంటర్లు మూసి ఉండటంతో వివరాలు తెలుసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. రూ.50 వేల లోపు రుణం ఉన్నవారికి 20 శాతం మాత్రమే నగదు జమ చేస్తామని శనివారం సాయంత్రం ఆయా బ్యాంకులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయానికి ఈ సమాచారాన్ని నిలిపివేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రుణమాఫీకి సంబంధించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వివరాలు అందుబాటులో లేవు. గతంలోనే బ్యాంకులకు రుణమాఫీ జాబితాలు ఇచ్చినా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని బయట పెట్టలేదు. ఆదివారం ఈ జాబితాలను ఆన్లైన్లో ఉంచారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందనే అంశంపై బ్యాంకు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సోమవారం సాయంత్రానికి ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కుటుంబపరంగా వివరాలు... రుణమాఫీ జాబితాలను కుటుంబంలోని సభ్యుల పేర్లు.. ఎంత విస్తీర్ణానికి ఎంత రుణం తీసుకున్నారు.. ఏ తేదీన తీసుకున్నారు.. తీసుకున్న రుణం ఎంత.. ఎకరానికి రూ.19 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) ప్రకారం బకాయిలో ఎంత మొత్తం రద్దవుతుంది.. ఇప్పటివరకు ఈ రుణానికి ఎంత వడ్డీ అయ్యింది.. తదితర అంశాలు వివరంగా చూపారు. రూ.50 వేలకు పైబడి పంట రుణం ఉంటే 2014-15లో జమ చేసిన మొత్తం వద్ద జీరో చూపారు. ఉదాహరణకు ఒక రైతు ఎస్బీఐ గూడూరు బ్రాంచ్‌లో 2.75 ఎకరాలకు 2013 జూన్ ఆరో తేదీన రూ.68 వేలు రుణం తీసుకుంటే ఇప్పటివరకు ఈ మొత్తం వడ్డీతో కలుపుకొని రూ.71,419 అయ్యింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2.75 ఎకరాలకు రూ.52,250 రుణమాఫీ కింద గుర్తించి ఈ మొత్తానికి వడ్డీతో కలిపి రూ.54,877 రుణమాఫీ అవుతుందని చూపారు. రైతుకు సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు నమోదు చేస్తేనే ఈ వివరాలు ఆన్లైన్లో వస్తున్నాయి. జిల్లాలో 7.03 లక్షల మంది రైతులకు గాను రూ.9,137 కోట్ల పంట రుణాలు బకాయిలు ఉన్నాయి. ఇందులో ఎంతమంది పేర్లు జాబితాలో ఉన్నాయో వేచిచూడాలి. -
రుణ మాఫీ జాబితా... తప్పుల తడక !
నరసన్నపేట రూరల్ : నరసన్నపేట మండలంలో రుణమాఫీ రైతుల జాబితా అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాలకు వచ్చిన రైతుల జాబితా చూసి రెవెన్యూ కార్యదర్శులే ఆశ్చర్యపోతున్నారు. గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో లేవు. ఇతర గ్రామాల్లో ఉన్న రైతుల పేర్లు జాబితాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పేర్లు ఉన్న రైతులకు సంబంధించిన వివరాలు వీఆర్వోలు నమోదు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే తమ పేర్లు లేక పోవడంతో రుణాలు వాడుకున్న రైతులు గాబరా పడుతున్నారు. తమకు రుణ మాఫీ వర్తిస్తుందనుకున్నామని.. జాబితాలో పేర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క నరసన్నపేట మండలమే కాదు..జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ప్రతీ గ్రామంలోను పదుల సంఖ్యలో జాబితాలో సబంధం లేని రైతుల పేర్లు ఉన్నాయి. జమ్ము పంచాయతీకి ఇచ్చిన రుణమాఫీ జాబితాలో 213 పేర్లు ఉండగా వీటిలో 83 పేర్లు గ్రామానికి సంబంధం లేనివారివే. మబగాం గ్రామానికి చెందిన జుత్తు రామారావు పేరు జమ్ము పంచాయతీకి వచ్చిన జాబితాలో దర్శనమివ్వగా.. పోలాకి మండలం మెట్టపేటకు చెందిన మెట్ట గణపతిరావు పేరు జమ్ము గ్రామ జాబితాలో నమోదైంది. అలాగే జమ్ముకు చెందిన సాధు అప్పన్న రూ. 80 వేలు, కల్యాణి శ్రీరాములు 30 వేల రూపాయల రుణం వాడుకున్నారు. అయితే వీరి పేర్లు రుణమాఫీ జాబితాలో లేవు. దీంతో తమకు రుణమాఫీ వర్తించదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోజుల తరబడి రుణమాఫీ కోసం ఎదురు చూశామని తీరా మాఫీ జాబితా వచ్చే సరికి తమ పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. కోమర్తి పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దశుమంతిపురంలో 30 మంది రైతుల పేర్లు ఉండగా..వీరిలో 12 మంది పేర్లు గ్రామంతో సంబంధం లేని వారివే ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన రుణ గ్రహీతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పేర్లు పరిశీలనకే జాబితా.. తహశీల్దార్ సుధాసాగర్ రుణమాఫీ అర్హుల జాబితా బ్యాంకులో ఉంది. ప్రస్తుతం పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులకు ఇచ్చిన జాబితా కేవలం పేర్లు పరిశీలనకే పరిమితం. జాబితాలో పేర్లు లేవని రైతులు ఆందోళన చెందవద్దు. మరో జాబితా బ్యాంకులో ఉంది. దాంట్లో రుణం వాడుకున్న వారి పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం జాబితాలో ఉన్న పేర్లు వివరాలు సేకరిస్తున్నాం. నా సంగతి ఏంటి? జమ్ము గ్రామంలో నివసిస్తున్నాను. రెండు ఎకరాల పొలం ఉంది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 80 వేలు అప్పు నరసన్నపేట ఆంధ్రాబ్యాంకులో వాడుకున్నాను. రుణ మాఫీకి అర్హుడనే అనుకున్నాను. తీరా గ్రామానికి వచ్చిన జాబితాలో నాపేరు లేదు. నాసంగతి ఏంటి? ఇదేమి తీరు. - సాధు అప్పన్న, జమ్ము