మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె
మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె
Published Thu, Sep 25 2014 9:47 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
అనంతపురం: మరో మూడు మాసాల్లో రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. రుణమాఫీతో రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పక్కా విధానాన్ని రూపొందిస్తుందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా తెలంగాణలోని ఏపీ విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తామని ఓ ప్రశ్నకు పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిచ్చారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు ఆశాజనకంగా లేవని, అయినా అన్ని వర్గాలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Advertisement