‘నీళ్లివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం’
Published Wed, Jan 27 2016 1:06 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
కర్నూలు : నందికొట్కూరు నియోజకవర్గంలోని కేసీ కెనాల్ ఆయకట్టు భూములకు సాగు నీరు ఇవ్వకుంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం దాదాపు 200 మంది రైతులు జల వనరుల శాఖ ఎస్‌ఈ ఛాంబర్‌ను చుట్టుముట్టారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు మార్చి దాకా నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి, అధికారులే కారణమంటూ లేఖలు రాసి, అక్కడే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు వారితో మాట్లాడారు. సుంకేశుల రిజర్వాయర్ నీటి నిల్వలు కర్నూలు నగర వాసుల తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని చెప్పారు. అవసరమైన 1.20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.88 టీఎంసీల నిల్వలే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో తాము సాగు నీటిని ఇవ్వలేమని నిస్సహాయత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగుతోంది.
Advertisement