చెరుకు గానుగ ఆడేదెవరు? | farmers lost confidence on NCS company | Sakshi
Sakshi News home page

చెరుకు గానుగ ఆడేదెవరు?

Published Sat, Sep 13 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

చెరుకు గానుగ ఆడేదెవరు?

చెరుకు గానుగ ఆడేదెవరు?

విజయనగరం కంటోన్మెంట్: చెరుకు బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా చెరుకు సరఫరా చేసిన రైతుల పేరున బినామీ రుణాలు వాడడంతోనే ఎన్‌సీఎస్ యూజమాన్యంపై రైతులకు నమ్మకం పోరుుందని, చెరుకు రైతులకు సమస్య లేకుండా గానుగ ఆడుతామని ప్రభుత్వం భరోసా కల్పించాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. కలెక్టర్ ఎంఎం నాయక్‌ను ఆయన కార్యాలయంలో శుక్రవారం రంగారావు కలిశారు. చెరుకు రైతుకు పొంచి ఉన్న ముప్పుపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని విన్నవించారు.
 
అనంతరం కలెక్టరేట్ పొర్టికో వద్ద మీడియూతో మాట్లాడారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలోని రైతులంతా సీతానగరం చక్కెర ఫ్యాక్టరీ ఉందన్న ధీమాతో మూడు లక్షల టన్నుల చెరుకును ఉత్పత్తి చేశారని ఇప్పుడు గానుగ ఆడే విషయంలో వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్‌సీఎస్ యూజమాన్యం మళ్లీ గానుగ ఆడుతామన్న సంకేతాలిస్తున్న సమయంలో రైతులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గానుగ ఆడే సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ రైతుల గుండెలపై భారం పెరుగుతుందన్నారు.
 
ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వమే భరోసానివ్వాలని కోరారు. ఆర్‌ఆర్ యూక్టుతో ఎన్‌సీఎస్ భూముల విక్రయంతో బిల్లులను పూర్తి స్థారుులో చెల్లింపులు చేయూలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఆధీనంలో క్రషింగ్ జరపాలన్నారు. ఇతర పార్టీలకు భూములను విక్రరుుంచి వచ్చిన సొమ్ముతో ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు, ఫ్యాక్టరీ కార్మికుల వేతనాల చెల్లింపులు వెంటనే జరపాలన్నారు. రైతులకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటుందో ముందుగానే చెప్పాలని కోరారు.
 
శాసనసభలో ప్రస్తావించా...
జిల్లాలోని చెరుకు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభలో తాను ప్రస్తావించానని ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెరుకు బోర్డు నిబంధనలకు అనుగుణంగా బిల్లులు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశానన్నారు. సొంతంగా పెట్టుబడులు పెట్టలేక అప్పులు చేసి రైతులు చెరుకును పండిస్తున్నారని ఇటువంటి వారికి వెంటనే బిల్లులు చెల్లింపులు చేయూల్సిన అవసరం ఉందన్నారు. చెరుకు రైతుల సమస్యలు మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అదే జరిగితే చూస్తూ ఊరుకోబోమని రైతుల తరఫున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.  
 
అగ్రిమెంట్లే చేయలేదు...
జిల్లాలోని ఎన్‌సీఎస్ కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులకు ఇంత వరకూ చెల్లింపులు చేయకపోవడమే కాకుండా కొత్త సీజన్‌కు సంబంధించిన అగ్రిమెంట్లు ఇంకా చేయకపోవడం దారుణమని ఎమ్మెల్యే రంగారావు అన్నారు. ఏటా ఈ సమయూనికి అగ్రిమెంట్లు కట్టేవారని ఈ ఏడాది ఇంత వరకు అగ్రిమెంట్లు కట్టకపోవడంతో రైతుల్లో సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని నివృత్తి చేయూలన్నారు.
 
అనంతరం ఎన్‌సీఎస్ సుగర్స్‌లో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న రామా సుగర్స్ లేబర్ యూనియన్ నాయకులు సీఎస్ రంగనాయకుడు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు, పీఎఫ్ బకారుులు చెల్లించలేదన్నారు. ఏటా ఆందోళన చేసేటప్పుడు మాత్రమే ఎంతోకొంత నిధులు చెల్లించే అలవాటున్న యూజమాన్యం పూర్తి స్థారుు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్‌సీఎస్ యూజమాన్యం ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఆదాయూన్ని సొంత వ్యాపారాలకు మళ్లించడం వల్లే రైతుల సమస్యలు పెరి గిపోయూయని చెప్పారు. ఎమ్మెల్యే వెంట పలువురు రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement