Benami loans
-
బినామీ రుణాలతో రూ.కోటికి టోకరా
అమలాపురం రూరల్(తూర్పుగోదావరి): ఏదైనా వాణిజ్య బ్యాంకులో బంగారు నగలు కుదవ పెట్టి రుణం తీసుకోవాలంటే బ్యాంక్ అధికారులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తారు. అన్ని అర్హతులు చూపించినా కుదవ పెట్టిన బంగారు నగలు మేలిమి బంగారమని నిర్ధారించటానికి నఖశిఖ పర్యంతం తనిఖీలు, ఆరా తీస్తారు. అలాంటిది అమలాపురం రూరల్ మండలం సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచిలో అసలు బంగారు నగలు లేకుండానే బినామీ పేర్లతో పలు దఫాలుగా రూ.కోటి దాకా రుణాలు లాగేసి బ్యాంక్‌కు టోకరా వేసేశారు. వేసింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ బ్యాంక్ నగదు అధికారే. మొత్తం రూ.కోటి గోల్‌మాల్‌కు ఈ నగదు అధికారే సూత్రధారి..పాత్రధారి. బ్రాంచి ప్రతి ఏటా వార్షిక ఆడిట్ విధిగా జరగుతుంది. మార్చి నెల తర్వాత ఏదో నెల బ్యాంకుకు వచ్చి ఆడిట్ బృందం ఆడిట్ చేస్తుంది. అందులో భాగంగానే గత నెల ఆగస్టు చివరి వారం, ఈ నెల మొదటి వారం దాదాపు రెండు వారాలపాటు సాధారణ ఆడిట్ జరిగినప్పుడు రూ.కోటికి టోకరా బయటపడింది. సాధారణంగా సమనస బ్యాంక్‌లో రోజుకు దాదాపు 20 మంది ఖాతాదారులకు బంగారు నగల కుదవపై రుణాలు ఇస్తుంది. ఇప్పటికే బ్యాంక్ చెస్ట్‌లో సుమారు 2 వేల మంది ఖాతాదారులకు సంబంధించి బంగారు నగలపై రుణాలు ఇచ్చారు. ఈ రెండు వేల బంగారు నగలపై రుణాలకు చెందిన ఒక్కో రుణానికి ఒక్కో వస్త్ర సంచిలో భద్రపరుస్తారు. ఈ లెక్కన రెండు వేల నగల సంచులు ఉండాలి. ఆడిట్ అధికారులు ఆడిట్ చేస్తున్నప్పుడు రెండు వేల సంచులకు 25 సంచులు తక్కువ రావడంతో మరింత లోతుగా ఆడిట్‌తో ఆరా తీశారు. బ్యాంక్ రికార్డుల్లో బంగారు నగలపై రుణాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్పప్పటికీ దానికి తగినట్లుగా బ్యాంక్ చెస్ట్‌లో నగల సంచులు లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఏఏ ఖాతాదారుల పేరున ఈ రుణాలున్నాయనే దిశగా తనిఖీలు చేశారు. అయితే ఆ పేర్లు బినామీలుగా గుర్తించారు. అవి బ్యాంక్ నగదు అధికారి కుటుంబీకులు, బంధువుల పేర్లతో ఉన్నట్లు కూడా గమనించారు. మొత్తం మీద బ్యాంక్ నగదు అధికారి నిర్వాకమేనని తేల్చారు. ఇది ఒక్కరి పనేనా..? రూ.కోటి మేర బంగారు నగలపై బినామీ రుణాలు పొందిన మోసం బ్యాంక్‌లో ఒక్క నగదు అధికారి వల్లే జరిగిందా.. లేక బ్యాంక్ సిబ్బందిలోనే ఎవరైనా ఒకరిద్దరు సహకరించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వారాలు సాధారణంగా ఆడిట్ చేపట్టిన ఆడిట్ బృందం రూ.కోటి లెక్కలు తేడా రావడంతో తమ ఆడిట్‌ను మరో వారం రోజులు పాటు కొనసాగించారు. శుక్రవారం వరకూ గత 21 రోజులుగా ఆ బ్యాంక్‌లో రూ.కోటి గోల్‌మాల్‌పై లోతైన ఆడిట్ జరుగుతూనే ఉంది. ఇది కాకుండా విజయవాడ నుంచి మరో బ్యాంక్ ఉన్నతాధికారులతో కూడిన ఆడిట్ బృందం సోమవారం సమనస బ్యాంక్‌కు రానుంది. ఈ ఉన్నత స్థాయి బృందం రూ.కోటికి టోకరా ఒక్క నగదు అధికారి వల్లే జరిగిందా... సిబ్బందిలో ఎవరి సహకారం ఉందా అనే కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది. అయితే బ్యాంక్‌లో ఖాతాదారులకు ఎవ్వరికీ ఈ బినామీ రుణాలు, రూ.కోటి మాయం వల్ల ఇబ్బందులేమీ ఉండవని ఆ బ్యాంక్ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈ అవకతవకలు బ్యాంక్ అంతర్గతంగా జరిగినే తప్ప ఖాతాదారులపై ప్రభావం చూపే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తున్నారు. రూ.కోటి దాటితే సీబీఐ విచారణ అనివార్యం సాధారణంగా వాణిజ్య బ్యాంక్‌ల్లో నగదు దుర్వినియోగం రూ.కోటి. అంతుకు మించి జరిగినప్పుడు సీబీఐ విచారణ అనివార్యం. సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.కోటి మూడు లక్షలు వరకూ అవకతవకలు జరిగాయి. దీంతో ఇంతటి భారీ నగదు గోల్‌మాల్‌పై సీబీఐ దర్యాప్తు అనివార్యం కానుందని ఆ బ్యాంక్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ కేసు సీబీఐకి వెళ్లకుండా సూత్ర«ధారి అయిన నగదు అధికారిచే రూ.కోటిలో కొంత మొత్తాన్ని రికవరీ చేయించే ప్రయత్నం తెర వెనుక జరుగుతున్నట్లు తెలిసింది. నగదు అధికారి, అకౌంటెంట్లు బంగారు నగలపై రుణాలకు కస్టోడియల్‌గా ఉంటారు. వీరిద్దరి వద్ద నగలు భద్ర పరచిన లాకర్‌కు సంబంధించి తాళాలు చెరొకరి దగ్గర ఉంటాయి. ఉదయం సాయంత్రం విధిగా కుదవ పెట్టిన నగల సంచులను ఆ ఇద్దరూ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ గోల్ మాల్లో నగదు అధికారితో పాటు అకౌంటెంట్ పాత్ర ఉండవచ్చన్న అనుమానాలు బ్యాంక్ సిబ్బందిలో వినిపిస్తున్నాయి. బ్యాంకులో దోపిడీ.. ఆక్వా చెరువులపై పెట్టుబడి బ్యాంకులో రూ.కోటి బినామీ రుణాలకు సూత్రధారైన బ్యాంకు నగదు అధికారి బుద్ధిగా బ్యాంక్ అధికారిగా ఉద్యోగం చేసుకోకుండా తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం పొందాలన్న అత్యాశతో ఆక్వా సాగుపై కూడా ఓ కాలు మోపారు. బ్యాంక్‌లో బినామీ రుణాలతో కాజేసిన రూ.లక్షల సొమ్ములు ఆక్వా చెరువుల సాగులో పెట్టుబడిగా పెట్టడం.. ఆ సాగులో నష్టాలు రావడంతో భర్తీకి తాను పనిచేసే బ్యాంక్‌కే కన్నం వేసినట్లు బంగారు నగల పేరుతో బినామీ రుణాల బాగోతానికి తెరతీశారు. తాను నగదు అధికారే కదా.. టోకరా వేసిన ఎవరికీ అనుమానం రాదని భావించాడు కాబోలు తాను పనిచేసే బ్యాంక్‌ను తన మోసాలకు వేదికగా మార్చుకుని ఇంటి దొంగగా మిగిలారు. -
గొట్లాం పీఏసీఎస్‌కు రుణాఘాతం !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బినామీ రుణాలు గొట్లాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం( పీఎసీఎస్) కొంప ముంచాయి. ఇప్పుడా సొసైటీ ఉనికికే ముప్పు వాటిల్లనుంది. రిజిస్ట్రార్ ఆదేశాలు అమలైతే సొసైటీ గల్లా పెట్టి ఖాళీ కానుంది. భవిష్యత్‌లో వచ్చే నిధులు కూడా డీసీసీబీ ఖాతాకు వెళ్లిపోనున్నాయి. పెద్ద ఎత్తున అక్రమాలు జరగడంతో సొసైటీ నుంచి రూ.కోటీ 11లక్షల99వేల మేర రికవరీ చేయాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. అదే జరిగితే సొసైటీ నిధులు డీసీసీబీకి జమఅవుతాయి. ఈ నేపథ్యంలో సొసైటీ పరిస్థితి అగమ్య గోచరం కానుంది. బొండపల్లి మండలం గొట్లాం పీఏసీఎస్ ద్వారా 1,559 మందికి నిబంధనలకు విరుద్ధంగా రూ.కోటీ 3లక్షల 78వేల 803మేర రుణాలిచ్చేశారని గత ఏడాది నిర్వహించిన సెక్షన్ 53విచారణలో తేల్చారు. దాదాపు అన్నీ బినామీ రుణాలేనని నిర్ధారణకొచ్చారు. కాకపోతే, ఈ అక్రమాలకు అప్పట్లో పనిచేసి మృతి చెందిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులను బాధ్యులగా చేస్తూ మిగతా వారంతా తప్పించుకున్నారు. ఆ పాపమంతా వారిదేనని విచారణాధికారులు కూడా తేల్చేశారు. ఈమేరకు విచారణ నివేదికను ఆరు నెలల క్రితం పైండింగ్స్ కోసం సహకార శాఖ రిజిస్ట్రార్‌కు పంపించారు. కాకపోతే, అప్పట్లో ఇచ్చిన నివేదికలో సొసైటీ సిబ్బంది, డెరైక్టర్ల విషయమై సీరియస్‌గా తీసుకోలేదన్న ఆరోపణలొచ్చాయి. వాస్తవానికి సొసైటీలో ఏ అక్రమాలు జరిగినా అందులో పర్యవేక్షక అధికారులు, పాలకవర్గం ప్రతినిధులుగా డెరైక్టర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటోంది. ఎవరికే రుణమిచ్చినా పరిశీలించాల్సిన బాధ్యత సూపర్వైజరీ అధికారులపై ఉండగా, ఎవరికెంత రుణం ఇచ్చారన్నదానిపై పాలకమండలి సభ్యులంతా తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన అక్కడే అక్రమాలు జరిగినా సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శిని బాధ్యుల్ని చేసి విచారణ అధికారులు చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణాధికారులిచ్చిన నివేదికపై తాజాగా రిజిస్ట్రార్ పైండింగ్స్ రాసి పంపించారు. చనిపోయిన సొసైటీ అధ్యక్ష, కార్యదర్శుల్ని బాధ్యుల్ని చేసేస్తే సరిపోదని, అప్పట్లో పనిచేసిన ఉద్యోగులు, పాలకవర్గ సభ్యుల్ని కూడా భాగస్వామ్యం చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా సొసైటీకి రుణ వితరణ కోసం ఇచ్చిన నిధులు డీసీసీబీవని, బినామీ రుణాలు, ఇతరత్రా అవకతవకల నేపథ్యంలో దుర్వినియోగమైన రూ.కోటీ 11లక్షల 99వేలును సదరు సొసైటీ నుంచి డీసీసీబీ రికవరీ చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. అలాగే, అప్పట్లో పనిచేసిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని, పాలకవర్గ ప్రతినిధులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం సొసైటీలో సుమారు రూ.10లక్షల మేర టర్నోవర్ అవుతోంది. దాదాపు రూ.కోటీ 11లక్షల99వేలు రికవరీ చేయాలంటే సొసైటీకి భవిష్యత్‌లో వచ్చే నిధుల్ని డీసీసీబీ జమ చేసుకోవల్సి వస్తుంది. ఈ లెక్కన సొసైటీ ఉనికికే ముప్పు వాటిల్లబోతోంది. ఇంత వేగంగా కోలుకునే అవకాశం ఉండదు. దాని పరిధిలో ఉన్న రైతులకు ఇక ఎటువంటి ప్రయోజనాలు అందే అవకాశం లేదు. -
‘మెప్మా’లో తనిఖీలు
ఖమ్మంసిటీ: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బినామీ రుణాల బాగోతం వ్యవహారం రాష్ట్రస్థాయిలోనే ఓ కుదుపు కుదిపింది. మెప్మా సిబ్బంది, బ్యాంకు అధికారులు కలిసి చేసిన నిర్వాకం ఆ సంస్థకే మాయని మచ్చగా మిగిలింది. మెప్మాలో జరిగిన అవినీతిలో తెరవెనుక ఉన్న బాస్‌పై గత మూడు రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి కమ్యూనిటీ ఆర్గనైజర్, రీసోర్స్ పర్సన్లు బినామీ గ్రూపులతో రుణాల మంజూరు చేసిన అగ్రిమెంట్లను పరిశీలించారు. ఒక గ్రూపునకు రుణాలు ఇవ్వాలంటే ఎవరెవరి సంతకాలు చేయాల్సి ఉంటుందో.. వాటి వివరాలను పీడీ వేణుమనోహర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ అగ్రిమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలోనే వీరిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని పీడీని ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. సంవత్సరం క్రితమే ఇలాంటి బినామీ గ్రూపుల వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ నగరంలోని బ్యాంకు మేనేజర్‌తో సమావేశం ఏర్పాటు చేసి ఆయా బ్యాంకులలోని గ్రూపుల వివరాలను, రుణం చెల్లించని గ్రూపుల వివరాలను ఎందుకు సేకరించలేకపోయారని అడిగారు. బ్యాంకు ఓ గ్రూపునకు రుణం మంజూరు చేసిన తర్వాత ప్రతినెలా మెప్మాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే సంవత్సరాలు గడిచినా సమాచారం రాకపోవడం వెనుక కారణమేంటని ఆరా తీశారు. రుణాల మంజూరులో అవకతవకలు జరగకుండా గ్రూపులు అన్నింటినీ రెండు సంవత్సరాల క్రితమే ఆన్లైన్ చేసినప్పటికీ ఈ గ్రూపులు ఆన్లైన్లో ఎందుకు రాలేదని కూడా పీడీని అడిగి తెలుసుకున్నారు. కొన్ని పత్రాలను వారితోపాటు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ సైతం దీనిపై నివేదిక కోరినట్లు సమాచారం. తెరవెనుక బాస్‌పై ఆరా.. మెప్మాలోని తెరవెనుక బాస్‌కు సంబంధించి ఆస్తులు, ఉద్యోగంలో చేరిననాటినుంచి ఇప్పటి వరకు ఏమైనా రిమార్కులు ఉన్నాయా..? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ‘సాక్షి’లో వచ్చిన షాడో కమిషనర్ అనే వార్తపై కూడా ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మెప్మా కార్యాలయంలో ఆ ఉద్యోగి బాసిజాన్ని గురించి సైతం ఆరా తీస్తున్నారు. -
మేం అనుకున్నదే చేస్తాం!
* జెడ్పీ సాక్షిగా ప్రభుత్వ విప్ రవికుమార్ స్పష్టీకరణ * అర్హుల పింఛన్ల రద్దుపై సభ్యుల ప్రశ్నలతో అసహనం * రెచ్చిపోయి కేకలు వేసిన విప్ * వేదిక వద్దకు వెళ్లి నిలదీసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు, ఎమ్మెల్యేలు * అన్యాయం జరిగితే న్యాయం చేస్తామని సర్దిచెప్పిన మంత్రి * పాడైన , రంగుమారిన ధాన్యం కొనుగోలుకూ చర్యలు శ్రీకాకుళం: పింఛన్ల రద్దు వ్యవహారం జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో వాగ్వాదాలకు, అరుపులకు దారి తీసింది. సభ్యుల ఆరోపణలకు సరిగ్గా సమాధానం చెప్పకపోగా ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాటలతో రెచ్చిపోవడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. మేం చేయాలనుకున్నదే చేస్తామన్న విప్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ సభ్యులు వేదిక వద్దకు వచ్చి ఆయన్ను నిలదీశారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో బూర్జ జెడ్పీటీసీ సభ్యుడు ఆనెపు రామకృష్ణ పింఛన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గంలో అర్హులైన వారికి పింఛన్లు రాకుండా ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పలువురు అర్హులకు పింఛన్ల జాబితాలో చోటు లేకపోవడాన్ని, టీడీపీ హయాం నుంచీ పింఛన్లు పొందిన వారిని ప్రస్తుతం తొలగించడాన్ని ఆధారాలతో సహా నివేదించారు. దీనికి కొద్దిసేపు సజావుగానే సమాధానాలు చెప్పిన విప్ రవికుమార్ ఓ దశలో జెడ్పీటీసీని ఉద్దేశించి మీ వల్లే అలా జరిగిందని వ్యాఖ్యానించారు. దీంతో జెడ్పీటీసీ స్పందిస్తూ మీరే కక్ష సాధింపుతో ఇలా చేస్తున్నారని గట్టిగా చెప్పారు. దీనికి విప్ స్పందిస్తూ ‘మీరు కేకలు వేసినా ఫలితం ఉండదు.. మేము చేయాలనుకున్నదే చేస్తాం. మీరు టాంపరింగ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి జెడ్పీటీసీ రామకృష్ణ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అర్హుల పింఛన్లు తొలగించిన పలు ఉదంతాలను సభ దృష్టికి తీసుకురావడంతో విప్ రవికుమార్ మరింత రెచ్చిపోయారు. దాంతో వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీలతో పాటు శాసనసభ్యులు కలమట వెంకటరమణ, కంబాల జోగులు బూర్జ జెడ్పీటీసీకి బాసటగా నిలిచారు. సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పడం సరికాదన్నారు. వారంతా వేదిక వద్దకు వచ్చి గట్టిగా నిలదీయడంతో రవికుమార్ వారిపై కేకలు వేశారు. హెచ్చరిస్తున్న ధోరణిలో వేలు చూపుతూ సమాధానం చెప్పారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆర్‌ఆండ్‌బీ తీరుపై అసంతృప్తి అంతకు ముందు ఆర్అండ్బీ శాఖపై సమీక్షలో అన్ని పార్టీల సభ్యులు, శాసనసభ్యులు, విప్, ఉన్నతాధికారులు, జెడ్పీ చైర్పర్సన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండాలో హుద్‌హుద్ తుపాను లెక్కలు లేకపోవడాన్ని తప్పుబట్టారు. 2012లో మంజూరైన గజాల ఖానా నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడాన్ని పాలకొండ జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించారు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయని ఆయన చెప్పగా పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఆర్అండ్బీ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. అధికారులు మండల సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని కూడా పలువురు సభ్యులు తప్పు పట్టగా ఇక మీదట తప్పక హాజరు కావాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గత ప్రశ్నలకు ఇప్పుడు సమాధానమా? గత సమావేశంలో తాము అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం అందజేయడాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తప్పు పట్టారు. ఇప్పుడు సమాధానాలు ఇస్తే ఈ అంశాలపై ఎప్పుడు తాము మాట్లాడుతామని నిలదీశారు. ఇప్పటి వరకు ఏజెండాలోని అంశాలు ప్రస్తావనకు రాలేదని, అటువంటప్పుడు తమ సమస్యలను ఎలా తెలియజేస్తారని అడిగారు. త్వరలో మళ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని, అవసరమైతే వరుసగా రెండు రోజులు నిర్వహించాలని కలమటతో పాటు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు సూచించారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటన్నింటిపైనా చర్చించాల్సి ఉందని చెప్పారు. దీనికి మంత్రి స్పందిస్తూ సంక్రాంతి తరువాత సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. బినామీ రుణాలపై చర్యలు సొసైటీల్లో బినామీల పేరిట రుణాలు పొందిన వారిపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు చేపడతామని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాతపట్నం, రాజాం ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కంబాల జోగులు మాట్లాడుతూ రుణమాఫీ వర్తింపులో అవకతవకలను ప్రశ్నించారు. దీనికి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆధార్ నెంబరు, బ్యాంకు అకౌంట్, రేషన్‌కార్డు సమర్పించిన అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. జిల్లాలో 2.40 లక్షల మంది అర్హులైన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులకు అందజేశామని చెప్పారు. ఆధార్ కార్డులు లేని 60వేల మంది రైతుల వివరాలను బ్యాంకులకు త్వరలో అందజేస్తామని తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆధార్ కార్డులు మంజూరు కాని రైతులకు మంజూరుకు తహశీల్దార్లు కృషి చేయాలని అన్నారు. పాడైన ధాన్యాన్ని కూడా కొంటాం:మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై చర్చలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 115 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 17.20 హెక్టార్లలోని ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు. పాతపట్నం ఎమ్మెల్యే మాట్లాడుతూ 1100 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ రంగుమారిన, పూర్తిగా పాడైన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన రైతుల నష్టపరిహారం జాబితాలను పంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామోదరరావు కోరారు. నందిగాం జెడ్పీటీసీ కురమాన బాలకృష్ణ మాట్లాడుతూ తమ మండలంలో 90 శాతం పంట నష్టం జరిగినా తుపాను నష్టం జాబితాలో చేర్చలేదని ఫిర్యాదు చేశారు. మంత్రి సమాధానం చెబుతూ ఆ మండలాన్ని సుడిదోమ మండలంగా పరిగణించామని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా పరిహారాన్ని అందజేస్తామని చెప్పారు. విప్ రవికుమార్ మాట్లాడుతూ విత్తన తయారీ యూనిట్లపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పొలంలో కల్లాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఉపాధిహామీ పనుల్లో చేర్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జేసీ వివేక్‌యాదవ్, ఏజేసీ పి. రజనీకాంతారావు, జెడ్పీ సీఈవో వసంతరావు, ఎమ్మెల్సీలు పీరుకట్ల విశ్వప్రసాద్, గాదె శ్రీనివాసులు నాయుడు, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్పీటీసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీలో జంగిల్ క్లియరెన్స్ స్కామ్:ఎమ్మెల్యే శివాజీ శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని ఆర్అండ్బీ శాఖలో జంగిల్ క్లియరెన్స్ స్కామ్ జరుగుతోందని పలాస శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర శివాజీ ఆరోపించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్అండ్బీ శాఖపై సమీక్ష జరుగుతున్నప్పుడు జంగిల్ క్లియరెన్స్ నిధులు ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు తటపటాయిస్తూ ఒక్కో కిలోమీటరుకు రూ. 12 వేలు జంగిల్ క్లియరెన్స్ కింద మంజూరవుతోందని, దీనిని వెచ్చించి మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని శివాజీ మరమ్మతులకు నోచుకోని రోడ్ల నిధులు ఏమవుతున్నాయని అడిగారు. ఇవి పక్కదారి పడుతున్నాయి కనుకే స్కాం అనాల్సి వచ్చిందన్నారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా అధికారులు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పాలకవర్గాలు లేక అధికారుల ఇష్టారాజ్యం: జెడ్పీ చైర్పర్సన్ స్థానిక సంస్థలకు మూడేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యం అయిందని జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు అజెండా తయారు చేయడాన్ని తప్పుపట్టారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ పాలకవర్గాలు లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించి తమ పనులను మరిచిపోయారన్నారు. వచ్చే సమావేశం నాటికి వీటిని సరిచేసుకోవాలని సిబ్బందికి సూచించారు. -
కొనసాగుతున్న విచారణ
పార్వతీపురం/గరుగుబిల్లి : విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావివలస పీఏసీఎస్‌లో జరిగిన బినామీ రుణాల అవకతవకలపై రెండో రోజు బుధవారం పార్వతీపురం డివి జన్ కో ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రారు పి.చిన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం విచారణ కొనసాగించింది. సహకార సంఘం చట్టం సెక్షన్ 51 ప్రకారం చేపట్టిన ‘రుణగ్రస్తుల విచారణ’కు 108 మంది హాజరయ్యారు. బినామీలుగా గుర్తించిన 480 మంది రైతులకు ఈ నెల 16 నుంచి 19 వరకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం 120 మందికి స మన్లు జారీ చేయగా, అందులో 108 మంది హాజరైనట్లు కమిటీ తెలిపింది. ఈ రెండు రోజులు విచారణకు హాజ రు కాని వారికి తర్వాత సమయం ఇస్తామన్నారు. అయితే ఈ కమిటీ ముందు రెండు రోజులు హాజరైన 209 మంది కూడా తాము రుణం తీసుకోలేదని, తమకు పీఏసీఎస్ ముఖం కూడా తెలియదని చెప్పినట్లు సమాచారం. దీనిలో భాగంగా 11 కాలమ్స్‌కు సంబంధించి ప్రొఫార్మాలో సమాచారం సేకరించి తమచే సంతకాలు చేయించుకున్నట్లు బాధితులు తెలిపారు. ఇందులో అధి క మంది భూములు లేని వారమని తెలపగా, మిగతా వారు తమకు పీఏసీఎస్‌లో సభ్యత్వం లేదని, తాము రుణాలు అడగలేదని, తమకు రుణాలు అంటగట్టారని వాపోయినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ పీఏసీఎస్ పరిధిలో 11వేల మందికి పైగా రైతులుండగా, ఇందులో 4,485 మంది రైతులు రుణం తీసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. దీంతో పాటు 2009నాటికి దీని వ్యాపా ర లావాదేవీలు సుమారు రూ.9కోట్లు కాగా, ప్రస్తుతం సుమారు రూ.18.20కోట్లకు పెరిగింది. ఇంకా గురు, శు క్రవారాల్లో చిలకాం, కారివలస, దత్తివలసలకు చెందిన వారికి విచారణ జరగనుందని బృందం నాయకులు పి.చిన్నయ్య తెలిపారు. ఈ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. ఈ విచారణపై రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన చెప్పారు. విచారణను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
బినామీ రుణాలపై విచారణ
పార్వతీపురం/గరుగుబిల్లి : గరుగుబిల్లి మండలంలోని రావివలస పీఏసీఎస్‌లో జరిగిన బినామీ రుణాలపై మంగళవారం పార్వతీపురం డివిజన్ కో- ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రారు పి. చిన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం విచారణ చేపట్టింది. సహకార సంఘం చట్టం సెక్షన్ 51 ప్రకా రం ‘రుణగ్రస్తుల విచారణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 480 మంది బినామీలుగా గుర్తించిన రైతులకు ఈనెల 16,17,18 తేదీల్లో హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అందులో భా గంగా మంగళవారం 120 మందికి సమన్లు జారీ చేయ గా, 101 మంది విచారణకు హాజరయ్యారు. కమిటీ ముందు హాజరైన 101 మంది తాము రుణం తీసుకోలేదని, తమకు పీఏసీఎస్ ముఖం కూడా తెలియదని చెప్పారు. 11 కాలమ్స్‌కు సంబంధించిన ప్రొ ఫార్మాలో సమాచారం సేకరించి తమతో సంతకాలు చేయించుకున్నట్టు తెలిపారు. కాగా పీఏసీఎస్ పరిధిలో 11 వేలకు పైగా రైతులుండగా, అందులో 4,485 మంది రైతులు రుణం తీసుకున్నట్టు రికార్డులు చూపిస్తున్నాయి. దీంతో పాటు 2009 నాటికి దీని వ్యాపార లావాదేవీలు సు మారు రూ. 9 కోట్లు కాగా, ప్రస్తుతం సుమారు రూ. 18.20 కోట్లకు పెరిగింది. అలాగే బృందం బహిరంగ విచారణ చేపట్టకుండా కార్యాలయంలో విచారణ చేయ డం పట్ల బాధితులు తమకు న్యాయం జరగదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధ, గురువారాల్లో కూడా విచారణ చేపట్టిన, అనంతరం ఉన్నతాధికారుల కు నివేదిక అందజేస్తామని బృందం నాయకులు పి. చిన్నయ్య తెలిపారు. రావివలసలో ఉద్రిక్తత రావివలసలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం సమ న్లు జారీ చేసిన వారికి అధికారులు విచారణ చేపట్టడం తో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నా యి. దీంతో బుధ, గురువారాల్లో జరగాల్సిన విచారణ లో కూడా బాధితులు ఆందోళన చేపట్టే అవకాశాలు లేకపోలేదు. తమ గ్రామంలోని పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై మంగళవారం జరిగిన విచారణను పలు వార్తా ఛానెళ్లు కవర్ చేశాయి. అయితే ఆ వార్తల ప్రసారాన్ని గ్రామస్తులు తిలకిస్తారని, వార్తలు చూసిన వారు చైత న్యవంతులవుతారన్న ఉద్ధేశ్యంతో వీరఘ ట్టం నుంచి ఆ గ్రామానికి వచ్చే కేబుల్ (ఓఎఫ్‌సి)ని కట్ చేసి న్యూస్ ఛానెళ్లు రాకుండా చేశారు. ఈ విషయమై కేబుల్ ఆపరేటర్ నగిరెడ్డి శ్రీహరినాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమ గ్రామానికి వస్తున్న కేబుల్ (ఓఎఫ్‌సి)ని వీరఘట్టం- కడకెళ్ల గ్రామానికి మధ్యలో ఎవరో కట్ చేశారన్నారు. మేమెలా బతికేది...? రావివలస పీఏసీఎస్ లో బినామీ రుణాలు బాధితులను భోరున ఏడిపిస్తున్నాయి. జీవితాంతం కష్టించినా రూ.10 వేలు ముఖం చూడని నిరుపేదలకు సైతం లక్షలు అప్పులున్నట్టు సమన్లు పంపిణీ చేయడంతో వాటిని చూసి బాధితులంతా బావురుమన్నారు. ఏమి చేయా లో...? ఎవరికి చెప్పుకోవాలో తెలియక...అంతా రోధస్తూ...మంగళవారం అధికారుల బృందం చేపట్టిన సహకార సంఘం చట్టం సెక్షన్ 51 ప్రకారం జరిపిన ‘రుణగ్రహీతల విచారణ’లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామానికి చెందిన రజక వృత్తితో జీవనం సాగిస్తున్న గుమ్మల లక్ష్మణ తనకు అందిన సమన్లు పట్టుకొని మేమెలా బతి కేది...అప్పులెలా తీర్చాలంటూ...రోధించారు. -
బిగుసుకున్న ఉచ్చు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం :డీసీసీబీ చైర్పర్సన్ మరిశర్ల తులసీకి బినామీ రుణాల ఉచ్చు బిగుసుకుందా? ఆమె చిక్కుల్లో పడ్డారా? రావివలస పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి) డెరైక్టర్లకు కష్టాలు తప్పవా? అధికారులు తీసుకుంటున్న చర్యలతో ఈ బినామీ రుణాల బాగోతం బయటపడనుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. రికార్డుల్లో పేర్కొన్న ప్రకారం రుణం తీసుకున్నారా? లేదా? అని ఈనెల 16న రావివలస సొసైటీ వద్దకొచ్చి తమ ముందు చెప్పాలని నాలుగు రోజులుగా విచారణాధికారి, పార్వతీపురం డిప్యుటీ రిజిస్ట్ట్రార్ పి.చిన్నయ్య నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులందుకున్నాక రుణగ్రహీతలు ఆశ్చర్యానికిలోనై తాము అంత మొత్తంలో రుణం తీసుకోలేదని కొందరు, అసలు రుణమే తీసుకోలేదని మరికొందరు పీఏసీఎస్ వద్దకొచ్చి అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు. ఈ బకాయిలను ఎవరు చెల్లిస్తారో చెప్పాలని పలువురు బాధితులు బుధవారం సీఈఓ సీహెచ్ సింహచలాన్ని నిలదీశారు. సెంటు భూమి లేనివారి పేరున రూ. 75 వేలు, ఒకే ఇంటిలో కుటుంబ సభ్యులందరి పేరున చెరో రూ. 75 వేలు, చనిపోయిన వారి పేరున రూ.75 వేలు, వలస వెళ్లినవారి పేరున రూ.75 వేలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. ఇలా రుణ గ్రహీతల జాబితాలో ఉన్న వారంతా తిరగబడుతున్నారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. ఇప్పటి వరకు రుణగ్రహీతల వివాదమే నడుస్తుండగా ఇప్పుడా వివాదానికి కారకులగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డెరైక్టర్ల వంతు వచ్చింది. సొసైటీ ప్రతినిధుల ఆస్తుల క్రయ,విక్రయాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ సెక్షన్ 51ప్రకారం విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవమేంటో తేలనుంది. ఒకవేళ బినామీ రుణాలు తీసుకోవడం వాస్తవమని తేలితే బాధ్యులైన వారిపై ఆర్థిక పరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణాధికారి చిన్నయ్య మరిన్ని చర్యలు తీసుకున్నారు. బినామీల రుణాల ఆరోపణల నేపథ్యంలో 2012కి ముందు, 2012తర్వాత రావివలస సొసైటీ పాలక వర్గం సభ్యులు, సిబ్బందికి సంబంధించిన ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లను నిలిపేయాలని పార్వతీపురం, కురుపాం సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. డెరైక్టర్లగా పనిచేసి, పని చేస్తున్న 22 మందికి, సొసైటీలో పనిచేస్తున్న మరో ఐదుగురు సిబ్బందికి ఈ ఉత్తర్వులు వర్తింపచేశారు. ఆ సొసైటీ అధ్యక్షురాలు, ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ మరిశర్ల తులసీ, డెరైక్టర్లుగా కొనసాగిన దూడి గుంపస్వామి, మంత్రపూడి జగ్గునాయుడు, బొత్స అప్పలస్వామి, మర్రాపు సత్యనారాయణ, గుంట్రెడ్డి వెంకటనాయుడు, గంటా తాతబాబు, ఏగిరెడ్డి రామునాయుడు, రెడ్డి అప్పలనర్సమ్మ, మూడడ్ల నాగమణి, అక్కెన కృష్ణంనాయుడు, గొట్టాపు శ్రీరాములు, మారుకొండ సీతంనాయుడు, మరిశర్ల అప్పలనాయుడు, గుంట్రెడ్డి సూర్యప్రభావతి, కుప్పిలి బంగారమ్మ, గుల్ల సూర్యనారాయణ, వానపల్లి సత్యనారాయణ, గాడి అప్పల స్వామినాయుడు, ముడిద అప్పలనర్సమ్మ, గంటా రత్నాలమ్మ, జామి రమణమ్మలకు సంబంధించిన ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు చేయరాదని సబ్ రిజిస్ట్రార్లను కోరారు. సొసైటీ ముఖ్య కార్య నిర్వాహక అధికారి చింతల సింహాచలం, అకౌంటెంట్ గొల్లపల్లి ముసలినాయుడు, గుమస్తాలు మర్రాపు వేణుగోపాలనాయుడు, గంటా మాధవనాయుడు ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు కూడా విచారణ ముగిసే వరకు నిలిపేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్టు అసిస్టాంట్ రిజిస్టార్ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తులపై ఆరా డెరైక్టర్లగా పని చేసి, పని చేస్తున్న 22 మందితో పాటు ఐదుగురు సిబ్బంది ఆస్తులపై కూడా ఆరా తీస్తున్నారు. వారికి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు గరుగుబిల్లి తహశీల్దార్‌కు విచారణాధికారి ప్రత్యేక లేఖ రాశారు. తాము సూచించిన వ్యక్తుల స్థిర, చరాస్థులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని కోరారు. ఆ మేరకు ఆస్తులపై నిఘా పెట్టి, ఒక వేళ బాధ్యులని తేలితే ఆర్థిక పరమైన చర్యలు తీసుకోనున్నారు. -
కదులుతున్న బినామీ రుణాల డొంక !
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బినామీ రుణాల డొంక కదులుతోంది. సెక్షన్ 51 ప్రకారం అధికారులు ఆఘమేఘాల మీద విచారణకు ఉపక్రమించారు. రికార్డుల్లో ఉన్న రుణ గ్రహీతలకు నోటీసు లు జారీ చేస్తున్నారు. విచారణాధికారిగా నియమితులైన సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ పి. చిన్నయ్య పేరుతో జారీ అయిన 70 నోటీసులు ఇప్పటికే పంపిణీ చేసేశారు. ఈ నెల 16న రావివలస సొసైటీలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నా రు. మీపేరున ఫలానా మొత్తంలో రుణం తీసుకున్నట్టుగా ఉందని, సదరు రుణం తీసుకున్నదీ లేనిదీ చెప్పాలని ఆ నోటీసులో కోరారు. ఉదాహరణకు... రావివలసకు చెందిన దాసరి పార్వతీకి జారీ చేసిన సమన్లలో 2012సెప్టెంబర్ 24న రూ.74వేల రుణం తీసుకున్నట్టు ఉంది. ఆ మొత్తం తీసుకున్నారా లేదా అన్నది ఈనెల 16 న పీఏసీఎస్‌లో జరిగే విచారణలో తెలపాలని, హాజరు కానిపక్షంలో స్పల్ప కాలిక రుణం కింద తీసుకున్నట్టుగా పరిగణించాల్సి వస్తుందని సమనులో స్పష్టం చేశారు. ఇదే తరహాలో ఇప్పటికే 70మందికి పంపిణీ చేయగా, గ్రామంలో మరో 3,930మందికి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ విచారణలో వాస్తవమేంటో తేలనుంది. బినామీల భాగోతం బయటపడనుంది. ఉలిక్కిపడ్డ రైతులు నోటీసులు అందుకోగానే రైతులు ఉలిక్కి పడ్డారు. తాము తీసుకున్న రుణం పది,పదిహేను వేల రూపాయల్లోనే ఉంటుందని డబ్బైయేసి వేలు ఉండదని వారంతా లబోదిబోమంటున్నారు. గ్రామ పెద్దల్ని కలిసి తమ గోడు చెప్పుకుంటున్నారు. ఒక్క సోమవారమే గ్రామ పెద్దలు రెండు పర్యాయాలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ సమన్లు విషయమై చర్చించారు. దీన్నెలా ఎదుర్కోవాలో అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. మంతనాల్లో నేతలు ఇదిలా ఉండగా, రుణబాగోతాన్ని దీన్ని ఏలాగైనా చేధించాలని టీడీపీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, తమను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పన్నుతున్న పధకాన్ని ఎలా తిప్పికొట్టాలన్నదానిపై కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే నాడు చక్రం తిప్పిన కాంగ్రెస్ యువనేత ఒకరు ఆ గ్రామంలోకి వెళ్లి రహస్య చర్చలు జరిపారు. ఇదెక్కడికి దారి తీస్తుందో, బినామీల భాగోతం ఏ స్థాయిలో బయటపడుతుందో వేచి చూడాలి. -
చెరుకు గానుగ ఆడేదెవరు?
విజయనగరం కంటోన్మెంట్: చెరుకు బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా చెరుకు సరఫరా చేసిన రైతుల పేరున బినామీ రుణాలు వాడడంతోనే ఎన్సీఎస్ యూజమాన్యంపై రైతులకు నమ్మకం పోరుుందని, చెరుకు రైతులకు సమస్య లేకుండా గానుగ ఆడుతామని ప్రభుత్వం భరోసా కల్పించాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. కలెక్టర్ ఎంఎం నాయక్‌ను ఆయన కార్యాలయంలో శుక్రవారం రంగారావు కలిశారు. చెరుకు రైతుకు పొంచి ఉన్న ముప్పుపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని విన్నవించారు. అనంతరం కలెక్టరేట్ పొర్టికో వద్ద మీడియూతో మాట్లాడారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలోని రైతులంతా సీతానగరం చక్కెర ఫ్యాక్టరీ ఉందన్న ధీమాతో మూడు లక్షల టన్నుల చెరుకును ఉత్పత్తి చేశారని ఇప్పుడు గానుగ ఆడే విషయంలో వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్సీఎస్ యూజమాన్యం మళ్లీ గానుగ ఆడుతామన్న సంకేతాలిస్తున్న సమయంలో రైతులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గానుగ ఆడే సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ రైతుల గుండెలపై భారం పెరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వమే భరోసానివ్వాలని కోరారు. ఆర్ఆర్ యూక్టుతో ఎన్సీఎస్ భూముల విక్రయంతో బిల్లులను పూర్తి స్థారుులో చెల్లింపులు చేయూలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఆధీనంలో క్రషింగ్ జరపాలన్నారు. ఇతర పార్టీలకు భూములను విక్రరుుంచి వచ్చిన సొమ్ముతో ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు, ఫ్యాక్టరీ కార్మికుల వేతనాల చెల్లింపులు వెంటనే జరపాలన్నారు. రైతులకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటుందో ముందుగానే చెప్పాలని కోరారు. శాసనసభలో ప్రస్తావించా... జిల్లాలోని చెరుకు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభలో తాను ప్రస్తావించానని ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెరుకు బోర్డు నిబంధనలకు అనుగుణంగా బిల్లులు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశానన్నారు. సొంతంగా పెట్టుబడులు పెట్టలేక అప్పులు చేసి రైతులు చెరుకును పండిస్తున్నారని ఇటువంటి వారికి వెంటనే బిల్లులు చెల్లింపులు చేయూల్సిన అవసరం ఉందన్నారు. చెరుకు రైతుల సమస్యలు మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అదే జరిగితే చూస్తూ ఊరుకోబోమని రైతుల తరఫున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అగ్రిమెంట్లే చేయలేదు... జిల్లాలోని ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులకు ఇంత వరకూ చెల్లింపులు చేయకపోవడమే కాకుండా కొత్త సీజన్‌కు సంబంధించిన అగ్రిమెంట్లు ఇంకా చేయకపోవడం దారుణమని ఎమ్మెల్యే రంగారావు అన్నారు. ఏటా ఈ సమయూనికి అగ్రిమెంట్లు కట్టేవారని ఈ ఏడాది ఇంత వరకు అగ్రిమెంట్లు కట్టకపోవడంతో రైతుల్లో సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని నివృత్తి చేయూలన్నారు. అనంతరం ఎన్సీఎస్ సుగర్స్‌లో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న రామా సుగర్స్ లేబర్ యూనియన్ నాయకులు సీఎస్ రంగనాయకుడు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు, పీఎఫ్ బకారుులు చెల్లించలేదన్నారు. ఏటా ఆందోళన చేసేటప్పుడు మాత్రమే ఎంతోకొంత నిధులు చెల్లించే అలవాటున్న యూజమాన్యం పూర్తి స్థారుు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్సీఎస్ యూజమాన్యం ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఆదాయూన్ని సొంత వ్యాపారాలకు మళ్లించడం వల్లే రైతుల సమస్యలు పెరి గిపోయూయని చెప్పారు. ఎమ్మెల్యే వెంట పలువురు రైతులు ఉన్నారు. -
అవినీతి ‘ప్రతినిధులు’
బినామీ రుణాల కుంభకోణంలో ప్రముఖుల పేర్లు రుణగ్రహీతల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులు భార్యల పేరున దర్జాగా పాసుపుస్తకాల సృష్టి బుచ్చెయ్యపేట : వారంతా ప్రజాప్రతినిధులు. తమకేదో మంచి చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఏరికోరి గెలిపించుకున్నవారు. తప్పుచేసే వారిని సక్రమమార్గంలో పెట్టాల్సిన వారే వక్రమార్గం అనుసరించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ పాసుపుస్తకాలు, బినామీ రుణ వ్యవహారంలో వెల్లడవుతున్న పేర్లు చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే అడ్డదారులు వెతకడంపై మండిపడుతున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారుల సంతకాలే ఫోర్జరీచేసి, నకిలీ స్టాంప్‌లతో పాసుపుస్తకాలు సృష్టించి లేని భూముల్ని ఉన్నట్లుగా రికార్డులు సృష్టించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలో బినామీ రుణాల వ్యవహారం వెలుగు చూడడంతో అధికారులు అనుమానం ఉన్న 255 పట్టాదారు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 75 పుస్తకాలు పరిశీలించగా 52 నకిలీవని తేలింది. నీలకంఠాపురం సర్పంచ్ భార్య ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికాగా అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గం వ్యక్తి కుమార్తెగా పట్టాదారు పాసుపుస్తకం సృష్టించారు. వాస్తవంగా భూమి లేకపోయినా సర్వే నంబర్ 86/3, 94/2, 95/1లో 4.72 ఎకరాల భూమి ఆమెకు ఉన్నట్లు పాసుపుస్తకం సృష్టించి బ్యాంకు నుంచి రుణం పొందారు. మల్లాం ఎంపీటీసీ మాజీ సభ్యురాలికి ఆర్.భీమవరంలోని సర్వే నంబర్ 816లో సెంటు భూమి లేదు. కానీ తనకు 4.32 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ పాసుపుస్తకం సృష్టించి రుణం పొందారు. కొండెంపూడి, కోమళ్లపూడి, తురకలపూడి, గంటికొర్లాం, పెదపూడి, చినభీమవరం, బుచ్చెయ్యపేట, పోలేపల్లి, కొండపాలెం, పెదమదీన, గున్నెంపూడి, రాజాం, చిట్టియ్యపాలెం, తైపురం తదితర గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. సర్పంచ్‌లు, మాజీలు, ఎంపీటీసీ సభ్యులు, మాజీలు, ఎంపీటీసీలు, సహకార, డెయిరీ సభ్యులు, పలుకుబడి ఉన్న నాయకులు, ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో తమవంతు భాగాన్ని సొంతం చేసుకున్నారు. జేసీ విచారణ జరపడం, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించడం, రెవెన్యూ అధికారులు పరిశీలన వేగవంతం చేయడంతో ‘బినామీ’దార్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో ఎమ్మెల్యే, మంత్రులను ఆశ్రయించి విచారణ తప్పుతోవ పట్టించేం దుకు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు అన్నిపుస్తకాల పరిశీలన అనంతరం మరెంతమంది బినామీలు వెలుగు చూస్తారో చూడాలి.