rv sujaya krishna ranga rao
-
చెరుకు గానుగ ఆడేదెవరు?
విజయనగరం కంటోన్మెంట్: చెరుకు బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా చెరుకు సరఫరా చేసిన రైతుల పేరున బినామీ రుణాలు వాడడంతోనే ఎన్సీఎస్ యూజమాన్యంపై రైతులకు నమ్మకం పోరుుందని, చెరుకు రైతులకు సమస్య లేకుండా గానుగ ఆడుతామని ప్రభుత్వం భరోసా కల్పించాలని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. కలెక్టర్ ఎంఎం నాయక్‌ను ఆయన కార్యాలయంలో శుక్రవారం రంగారావు కలిశారు. చెరుకు రైతుకు పొంచి ఉన్న ముప్పుపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని విన్నవించారు. అనంతరం కలెక్టరేట్ పొర్టికో వద్ద మీడియూతో మాట్లాడారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలోని రైతులంతా సీతానగరం చక్కెర ఫ్యాక్టరీ ఉందన్న ధీమాతో మూడు లక్షల టన్నుల చెరుకును ఉత్పత్తి చేశారని ఇప్పుడు గానుగ ఆడే విషయంలో వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్సీఎస్ యూజమాన్యం మళ్లీ గానుగ ఆడుతామన్న సంకేతాలిస్తున్న సమయంలో రైతులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గానుగ ఆడే సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ రైతుల గుండెలపై భారం పెరుగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వమే భరోసానివ్వాలని కోరారు. ఆర్ఆర్ యూక్టుతో ఎన్సీఎస్ భూముల విక్రయంతో బిల్లులను పూర్తి స్థారుులో చెల్లింపులు చేయూలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఆధీనంలో క్రషింగ్ జరపాలన్నారు. ఇతర పార్టీలకు భూములను విక్రరుుంచి వచ్చిన సొమ్ముతో ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు, ఫ్యాక్టరీ కార్మికుల వేతనాల చెల్లింపులు వెంటనే జరపాలన్నారు. రైతులకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటుందో ముందుగానే చెప్పాలని కోరారు. శాసనసభలో ప్రస్తావించా... జిల్లాలోని చెరుకు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభలో తాను ప్రస్తావించానని ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెరుకు బోర్డు నిబంధనలకు అనుగుణంగా బిల్లులు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశానన్నారు. సొంతంగా పెట్టుబడులు పెట్టలేక అప్పులు చేసి రైతులు చెరుకును పండిస్తున్నారని ఇటువంటి వారికి వెంటనే బిల్లులు చెల్లింపులు చేయూల్సిన అవసరం ఉందన్నారు. చెరుకు రైతుల సమస్యలు మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అదే జరిగితే చూస్తూ ఊరుకోబోమని రైతుల తరఫున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అగ్రిమెంట్లే చేయలేదు... జిల్లాలోని ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోని చెరుకు రైతులకు ఇంత వరకూ చెల్లింపులు చేయకపోవడమే కాకుండా కొత్త సీజన్‌కు సంబంధించిన అగ్రిమెంట్లు ఇంకా చేయకపోవడం దారుణమని ఎమ్మెల్యే రంగారావు అన్నారు. ఏటా ఈ సమయూనికి అగ్రిమెంట్లు కట్టేవారని ఈ ఏడాది ఇంత వరకు అగ్రిమెంట్లు కట్టకపోవడంతో రైతుల్లో సందేహాలు నెలకొన్నాయని చెప్పారు. వీటిని నివృత్తి చేయూలన్నారు. అనంతరం ఎన్సీఎస్ సుగర్స్‌లో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న రామా సుగర్స్ లేబర్ యూనియన్ నాయకులు సీఎస్ రంగనాయకుడు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు, పీఎఫ్ బకారుులు చెల్లించలేదన్నారు. ఏటా ఆందోళన చేసేటప్పుడు మాత్రమే ఎంతోకొంత నిధులు చెల్లించే అలవాటున్న యూజమాన్యం పూర్తి స్థారుు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్సీఎస్ యూజమాన్యం ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఆదాయూన్ని సొంత వ్యాపారాలకు మళ్లించడం వల్లే రైతుల సమస్యలు పెరి గిపోయూయని చెప్పారు. ఎమ్మెల్యే వెంట పలువురు రైతులు ఉన్నారు. -
రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరం
బొబ్బిలి, న్యూస్‌లైన్: ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఎంతో అవసరమని, అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓటేసి దీవించాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్వీ సుజయకృష్ణ రంగారావు కోరారు. పట్టణంలోని ఐటీఐకాలనీ, మిలట్రీకాలనీ, ప్రేమనగర్ కాలనీ, పోలవానివలస గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి చోట సుజయ్‌కు జనం హారతులు పట్టి జేజేలు పలికారు. మీరు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవుతారని, తమ్ముడు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశీర్వదించారు. మేం ఫ్యానుకు తప్ప మరిదేనికీ ఓటు వేయమంటూ భరోసా ఇచ్చారు. ఐటీఐ కాలనీలో రెండు నెలల చిన్నారిని ఎత్తుకుని లాలించి తండ్రిలా పరిపాలన అందిస్తాననే నమ్మకాన్ని అందించారు.. చిన్నారులు సైతం కండువాలు వేసుకుని జెండాలు పట్టుకుని సుజయ్ వెంట పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం నిరంతరం కష్టపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కలిసుండాలని జగన్ జైలులో కూడా ప్రాణాలకు తెగించి దీక్షలు చేశారన్నారు. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒకటై రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశాయన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో నిరంతరం కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి దోహదపడ్డారని అన్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రాభివృద్ది చేయగలిగిన సత్తా ఒక్క జగన్ మోహన్‌రెడ్డికే ఉందని అన్నారు. ముందు చూపుతోపాటు పరిపాలన చేయగల సత్తా ఉన్న ఏకైక నాయకుడుగా మనకు కనిపిస్తున్నది జగనేనని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక, ఓటమి భ యంతో రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు జత కట్టారని అన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అమలు చేయడానికి సాధ్యం కానివి, ఇంతకు ముందు ఎద్దేవా చేసిన వాటిని ఇప్పుడు ఇస్తానని హామీలు గుప్పిస్తున్నారని, దానిని ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లే రన్నారు. సుజయ్ వెంట ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి కాగాన పార్వతి, బొద్దాన అప్పారావు, వాడపల్లి రజనీకాంత్, వంగపండు మహేష్, అరసాడ మురళి, చక్రధర్, లంక వాసుదేవరావు, న్యాయవాదులు చెల్లారపు సత్యనారాయణ, సాలా ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పాలనతో స్వర్ణయుగం
బొబ్బిలి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగం చూస్తారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని ఆరో వార్డు అభ్యర్థి గెంబలి శ్రీనివాసరావుకు మద్దతు గా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటేసి మంచి పాలకవర్గం రావడానికి అవ కాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఓటర్లే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరైన నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయితేనే ప్రజా సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ సజ్జా వెంకటరావు, వైద్యులు జనార్దనరావు, మున్సిపల్ మాజీ వైస్ ైచైర్మన్లు గెంబ లి సత్యనారాయణ, నారాయణస్వామి,పాల్గొన్నారు. -
సత్తాచూపుతాం!
బొబ్బిలి, న్యూస్‌లైన్: పుర ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని, జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో మంచి ఫలితాలను సాధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. బొబ్బిలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.పార్టీకి ఫ్యాన్ గుర్తు వచ్చాక జరుగుతున్న మొదటి ప్రత్యక్ష ఎన్నికలు ఇవని, అందుకు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో సత్తా చూపుతాం! చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ఈ నెల 27 జగన్ జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార సమయం ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో నాలుగు పురపాలక సంఘాల్లో సభలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నాలుగు రోజులుగా తాను వార్డుల్లో ఇంటింట ప్రచారం చేస్తున్నానని, ఆ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. సాధారణ ఎన్నికల కంటే నెల 15 రోజుల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని, అయినా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో జయభేరి మోగిస్తామని చెప్పారు. తమ పేరు చెప్పుకొని చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారని తెలిసిందని, దానిని ఎవరూ నమ్మవద్దని, తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫారంలు ఇచ్చిన తరువాత ఫ్యాను గుర్తును కేటాయించారని,వారికే ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గునాన వెంకటరావు, 7వ వార్డు అభ్యర్థి రాంబార్కి శరత్‌కుమార్, మాజీ కౌన్సిలరు బొబ్బాది తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.