బొబ్బిలి, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు స్వర్ణయుగం చూస్తారని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని ఆరో వార్డు అభ్యర్థి గెంబలి శ్రీనివాసరావుకు మద్దతు గా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటేసి మంచి పాలకవర్గం రావడానికి అవ కాశం కల్పించాలని కోరారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఓటర్లే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరైన నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి అని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయితేనే ప్రజా సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్ మాజీ చైర్మన్ సజ్జా వెంకటరావు, వైద్యులు జనార్దనరావు, మున్సిపల్ మాజీ వైస్ ైచైర్మన్లు గెంబ లి సత్యనారాయణ, నారాయణస్వామి,పాల్గొన్నారు.
జగన్ పాలనతో స్వర్ణయుగం
Published Fri, Mar 28 2014 3:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement