సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వివిధ రకాల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు 49,548 ఉన్నాయి. వీటిపై ఆధారపడి 2,05,079 వ్యవసా య విద్యుత్ కనెక్షన్లు నడుస్తున్నాయి. ఓవర్‌లోడ్, అప్రకటిత కోతల కారణంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయి. పంటల సీజన్‌లో రోజూ 50 నుంచి 70 వరకు, అన్‌సీజన్‌లో 20కిపైగానే కాలిపోతున్నాయి. వీటి కి సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలోని పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. రబీ సీజన్‌లో వి ద్యుత్ అవసరం ఎక్కువ. ఖరీఫ్ సీజన్‌లోనూ పలు ప్రాం తాల్లో విద్యుత్‌పై ఆధారపడే పంటలు పండిస్తున్నారు. రైతులంతా ఒకే సమయంలో పంటలకు నీటిని పారిస్తుం డడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక భారం పడుతోంది.
రోలింగ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నా
కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతు చేయడానికి జిల్లాలో 24 కేంద్రాలున్నాయి. ఐదు మరమ్మతు కేంద్రా లు విద్యుత్‌శాఖ పరిధిలో ఉండగా, 19 కేంద్రాలు ప్రైవేట్ సంస్థల అధీనంలో పనిచేస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే తక్షణమే రైతులకు పంపిణీ చేయడానికి వీలుగా 2,186 రోలింగ్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచారు. అయితే వీటిని సకాలంలో పంపిణీ చేసిన దాఖ లాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను కేంద్రాలకు తరలించిన వెంటనే మరమ్మతులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాన్ని విద్యుత్ శాఖలోని కొంత మంది సిబ్బంది ఆసరా చేసుకొని డబ్బు లు గుంజుతున్నారు.
కాసులిస్తేనే కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌కు మోక్షం లభిస్తోంది. లేకపోతే రోజుల తరబడి మరమ్మతు కేంద్రాల చుట్టూ తిరగాల్సిందే.
ముడుపులు తడిసి మోపెడు
ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతుకు చేయడానికి ముడుపులు, రవాణా తదితర ఖర్చులు కలిపితే రైతులపై రూ. రెండు వేల వరకు భారం పడుతోంది. ఈ విషయం ఉన్న తాధికారులకు తెలి సినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నా యి. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో ఆరు నెలల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మా యమైంది. స్థానికులు సంబంధిత అధికారుల కు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ దాని జాడ కనిపెట్టలేకపోయారు. ఆరు నెలలు గడుస్తున్నా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితులలో పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు డబ్బులు ఇవ్వొద్దు
ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాలలో రైతులు సిబ్బందికి డబ్బులు ఇవ్వకూడదు. ట్రాన్స్‌ఫార్మ ర్లు కాలిపోయిన సమయంలో రైతులు బంధుమిత్ర పథకంలో భాగంగా 9440811600 నెంబర్‌కు ఫోన్‌చేస్తే విద్యుత్ సిబ్బందే వచ్చి వాటిని మరమ్మతు కేంద్రాలకు తరలిస్తారు. మరమ్మతు కోసం సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. రెండు వేలకుపైగా రోలింగ్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచాం. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
- నాగరాజు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ విభాగం ఏడీ
కాసులిస్తేనే
Published Sun, Dec 22 2013 6:41 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement