వ్యవసాయం బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమదావశాత్తు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల శివయ్య(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. స్టాటర్ పెట్టెకు కరెంట్ షాక్ రావడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విద్యుధ్ఘాతానికి రైతు బలి
Published Sun, Feb 28 2016 2:21 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM
Advertisement
Advertisement