పసుపు పంటకు సాగునీటిని పెట్టేందుకు వెళ్లిన రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కొడుకుకు స్వల్పగాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన నారెళ్ల చిన్న బాలయ్య(45), తన కొడుకు బాల్‌రెడ్డితో కలిసి ఎరువుల బస్తాలు తీసుకొని పంట పొలానికి వెళ్లాడు. పసుపు పంటకు ఎరువులు చల్లేందుకు సిద్ధం అయ్యారు. పంటకు సాగునీటిని పారించేందుకు మోటార్ స్టార్ట్ చేసి గేట్‌వాల్ తింపుతుండగా అక్కడే విద్యుత్ వైర్లు ఉండటంతో షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకు బాల్‌రెడ్డి రక్షించేందుకు వెళ్లగా అతడికి స్వల్పంగా షాక్ తగిలింది. అదే ప్రాంతంలోని పంట పొలాల్లోని రైతులు వచ్చి మోటార్ ఫీజులను తొలగించారు. అప్పటికే రైతు చని పోయాడు. మృతుడికి కొగుకుతో పాటు భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Mon, Oct 17 2016 8:31 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement