బాల్కొండ మండలకేంద్రంలో 44వ జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు.
బాల్కొండ మండలకేంద్రంలో 44వ జాతీయరహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేల్పూరు మండలం పడిగేల్ గ్రామానికి చెందిన ఆరె బాలయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.