బాల్కొండ: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులోని జాతీయ రహ దారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో డివైడర్‌ను ఢీకొని కారు పల్టీ కొట్టడంతో అందులో ఉన్న తల్లి, ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని టోలిచౌకీకి చెందిన మి నాజ్ బేగం(39), ఆమె ఐదుగురు పిల్ల లు, చిన్నమ్మ కుమారుడు సయ్యద్ సమీ (32) కలిసి ఓ శుభకార్యం కోసం మహారాష్ట్ర లోని వార్ధాకు మంగళవారం అర్ధరాత్రి బయలు దేరారు. వీరితో పాటు మరి కొందరు బంధు వులు వేరే కారులో వెంట వెళ్లారు. మెదక్ జిల్లా రామాయంపేట్ చేరుకోగానే సయ్యద్ సమీకి నిద్ర రావడంతో పడుకొన్నాడు.
ఇంకో కారులో ఉన్న బంధువులు మాత్రం వెళ్లిపోయారు. ఉదయం ఐదు గంటలకు రామాయంపేట్ నుంచి బయలుదేరిన వీరి కారు కొత్తపల్లి శివా రుకు చేరుకుంటుండగా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ముందుకు దూసుకుపోయి, పల్టీలు కొట్టుకుంటూ అవతలి వైపు రోడ్డుపై నున్న రెయిలింగ్‌కు గుద్దుకుంది. దీంతో కారులో ఉన్న మినా జ్‌బేగం (39), ఆమె మూడు నెలల కూతురు సయ్యద్ పిల్జా కారులోనుంచి ఎగిరి బయటపడి అక్కడి కక్కడే చనిపో యారు. డ్రైవింగ్ చేస్తున్న సయ్యద్ సమీ తల పగిలి సీటులోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న ముప్కా ల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి, సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలిస్తుండగా అందులో అఖిల్ ఆహ్మద్(6) మార్గమధ్యలో మృతి చెందాడు. సయ్యద్ సోదియా, సయ్యద్ ఆదిల్, సయ్యద్ ఉమేల్‌లను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నది. స్థానికుల సహాయంతో పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్మూర్ రూరల్ సీఐ గోవ ర్ధన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నిద్ర మత్తే ప్రమాదానికి కారణమా..
డ్రైవింగ్ చేస్తున్న సయ్యద్ సమీ నిద్ర మత్తులోకి జారుకోవడంతో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పినట్లు తెలు స్తోంది. డివైడర్‌ను ఢీకొట్టిన తరువాత కారు 50 మీటర్లు ముందుకు దూసు కెళ్లింది. కారు ముందటి టైర్ విరిగి రోడ్డుపై పడిపోయింది. మృతదేహాలు కారులోంచి ఎగిరి రోడ్డు పక్కన పంట భూముల్లో పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment