చిలకలగూడ : మానవత్వం మంటకలుస్తోంది.. వావివరుస తప్పుతోంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ తండ్రి కన్నకూతురిపైనే లైంగికదాడికి పా ల్పడి సమాజం తలదించుకునే ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఆటోడ్రైవరైన రాజు (34) భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి సీతాఫల్‌మండి మేడిబావిలో నివసిస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న రాజు తరుచూ ఆమెను వేధించేవాడు. పెద్దకుమార్తె స్థానికంగా ఒకటోతరగతి చదువుతోంది. భార్యపై అనుమానంతో కొంతకాలంగా చిన్నారిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు.
గురువారం ఉదయం చిన్నారి కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి మందులు తెచ్చిఇచ్చింది. అయినా తగ్గకపోవడంతో ఎందుకు కడుపునొప్పి వస్తుందని గట్టిగా అడగ్గా.. కసాయితండ్రి అకృత్యాలు ఏడుస్తూ చెప్పింది. దీంతో భర్తను నిలదీయగా వెంటనే చిన్నకూతురుని వెంట తీసుకొని పరారయ్యాడు. చేసేదిలేక చిన్నారితో కలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం గాంధీలో చేర్పించిన పోలీసులు రాజు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
కీచక తండ్రి.. కన్నకూతురిపై లైంగికదాడి
Published Fri, Dec 27 2013 8:32 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement